Game Changer Review Rating : Intresting Political Action Entertainer

Game Changer Review Rating మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తాజాగా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. ఆర్ఆర్ ఆర్ తర్వాత ఆచార్య మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన గ్లోబల్ ఐకాన్ మెగాపవర్ స్టార్

Game Changer Review Rating  : Intresting Political Action Entertainer
'గేమ్ ఛేంజర్' రివ్యూ : ఆకట్టుకునే పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్

సినిమా పేరు : గేమ్ ఛేంజర్ (Game Changer)

రేటింగ్ : 3 / 5

తారాగణం :  రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, ఎస్ జె సూర్య, సముద్రఖని, శ్రీకాంత్, సునీల్, రాజీవ్ కనకాల, బ్రహ్మానందం

సంగీతం : ఎస్ థమన్

ఫోటోగ్రఫి : తిరు

నిర్మాత : దిల్ రాజు

దర్శకుడు : శంకర్

రిలీజ్ డేట్ : 2025 జనవరి 10

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తాజాగా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. ఆర్ఆర్ ఆర్ తర్వాత ఆచార్య మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన గ్లోబల్ ఐకాన్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఆ మూవీ ద్వారా ఆశించిన స్థాయి సక్సెస్ అయితే అందుకోలేకపోయారు. ఇక దాని అనంతరం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించిన గేమ్ ఛేంజర్ మూవీకి పచ్చా జండా ఊపారు.

మెగాస్టార్ చిరంజీవిని కొన్నేళ్ల క్రితం దర్శకత్వం వచ్చిన అవకాశం మిస్ చేసుకున్న తమిళ దర్శకుడు శంకర్, ఫైనల్ గా ఈ మూవీ ద్వారా ఆయన కుమారుడు రామ్ చరణ్ తో మూవీ తీసారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ నటించిన ఈ మూవీలో తమిళ దర్శకుడు కం నటుడు అయిన ఎస్ జె సూర్య విలన్ గా కనిపించగా ఇతర ముఖ్య పాత్రల్లో శ్రీకాంత్, సునీల్, సముద్రఖని, రాజీవ్ కనకాల, బ్రహ్మానందం, అంజలి నటించారు.

Game Changer Review 123 Telugu

ఎస్ థమన్ సంగీతం అందించిన గేమ్ చేంజర్ మూవీ పొలిటికల్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 10 న ఈ మూవీ గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి ఈ మూవీ యొక్క పూర్తి రివ్యూని ఇప్పుడు చూద్దాం

కథ :

ముందుగా ఈ మూవీ యొక్క కథ పరంగా చూసుకుంటే ఐఏఎస్ అధికారి అయిన రామ్ నందన్ మినిస్టర్ మోపిదేవికి ఏడు వెళ్లడం, అనంతరం వారిద్దరి మధ్య వైరుధ్యం మరింతగా పెరగడం, ఆ తరువాత సడన్ గా రామ్ నందన్ ఊహించని పదవికి ఎంపిక కావడం జరుగుతుంది. అయితే గతంలో ప్రజలకు మంచి చేయడం కోసం పార్టీ పెట్టి అశువులు బాసిన అప్పన్న కి రామ్ నందన్ కి ఏమిటి సంబంధం, అనంతరం కథ ఏ విధంగా మలుపులు తిరిగింది చివరకు మినిస్టర్ కి రామ్ నందన్ కి మధ్య ఏమి జరిగింది అనేది మిగతా

నటీనటుల పెర్ఫార్మన్స్ :

ముఖ్యంగా ఈ మూవీలో మెగాపవర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటన నిజంగా అద్భుతం. మరీ ముఖ్యంగా అప్పన్న పాత్రలో అతడి యాక్టింగ్, కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఐతే మనసుని తాకుతుంది. ఇక మరొక కీలక పాత్రలో నటించిన అంజలి కూడా అద్భుతంగా చేసారు. థమన్ అందించిన సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంటుంది. ఇక కీలకమైన విలన్ పాత్రలో కనిపించిన ఎస్ జె సూర్య మరొక్కసారి తన నటనతో అదరగొట్టారు. హీరోయిన్ కియారా అద్వానీ పాత్ర బాగుంది, తన పరిధి మేరకు అందం అభినయంతో ఆమె అలరించారు.

తిరు అందించిన విజువల్స్ తో పాటు ఫైట్స్, దర్శకుడు శంకర్ తీసిన విధానం బాగుంది. గతంలో శంకర్ తీసిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్స్ మాదిరిగా సాగినప్పటికీ కూడా గేమ్ ఛేంజర్ ఆకట్టుకుంటుంది. మాస్ క్లాస్ తో పాటు ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా మెప్పిస్తుంది. ఇక ఇతర పాత్రలు చేసిన శ్రీకాంత్, సముద్రఖని, రాజీవ్ కనకాల కూడా ఆకట్టుకున్నారు.

Game Changer Review in Telugu

ప్లస్ పాయింట్స్ :

రామ్ చరణ్ పెర్ఫార్మన్స్,

అంజలి పెర్ఫార్మన్స్,

సెకండ్ హాఫ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్  సీన్స్,

విజువల్స్,

మ్యూజిక్,

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్

రొటీన్ పొలిటికల్ డ్రామా,

నార్మల్ టేకింగ్

విశ్లేషణ :

ముఖ్యంగా గేమ్ ఛేంజర్ మూవీకి ప్రధాన ప్రాణం రామ్ చరణ్ యాక్టింగ్, అలానే అంజలి కూడా అద్భుతంగా చేసారు. ఇక పొలిటికల్ యాక్షన్ డ్రామా అయినప్పటికీ పెద్దగా బోరింగ్ గా అనిపించకుండా ముందుకు సాగుతుంది. కాకపోతే తన గత పొలిటికల్ మూవీస్ మాదిరిగానే కొత్తదనం లేకుండా శంకర్ టేకింగ్ ఉంటుంది. థమన్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, రామ్ చరణ్ పవర్ఫుల్ డైలాగ్స్ తో పాటు చరణ్, ఎస్ జె సూర్య ల మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి. తిరు విజువల్స్ కొన్ని చోట్ల చాలా బాగున్నాయి.

మొత్తంగా గేమ్ ఛేంజర్ ఆకట్టుకునే పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ ఒకింత ఎంటర్టైన్మెంట్ దిశగా సాగిన ఈ మూవీ యొక్క ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగుంటుంది. అలానే ఆ సీన్ అనంతరం సెకండ్ హాఫ్ పై ఆడియన్స్ లో మంచి ఆసక్తి ఏర్పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ కూడా అలరిస్తుంది. అక్కడక్కడ చరణ్, ఎస్ జె సూర్య మధ్య వచ్చే సీన్స్ తో పాటు కథానుసారంగా సాగె సన్నివేశాలు ఆడియన్స్ ని అలరిస్తాయి. అయితే చరణ్, కియారాల మధ్య లవ్ ట్రాక్ అంత ఇంట్రెస్టింగ్ గా లేదు.

తీర్పు :

మొత్తంగా అందరిలో మొదటి నుండి మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీ ఆశించిన స్థాయిలో తెరకెక్కి ఆడియన్స్ ని మెప్పిస్తుందని చెప్పాలి. చరణ్ ఫ్యాన్స్ కి ఈ మూవీ మరింత నచుతుంది. అప్పన్న గా చరణ్, పార్వతిగా అంజలి ఎంతో ఆకట్టుకున్నారు. శంకర్ మార్క్ అలరించే కథనం, బ్యాక్ గ్రౌండ్ సాక్రె, ఫైట్స్ బాగున్నాయి. వీలైతే ఈ పండుగకు కుటుంబంతో కలిసి ఈ మూవీ చూసి ఆనందించండి.

Game Changer Review IMDB

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow