Thug Life Telugu Movie Review – Kamal Haasan & Maniratnam Shocking Comeback
Thug Life Telugu review: Kamal Haasan’s action drama with Mani Ratnam promises a cinematic experience. Read full Telugu analysis, cast, and verdict.

'థగ్ లైఫ్' మూవీ రివ్యూ : అలరించే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ
సినిమా పేరు : థగ్ లైఫ్ (Thug Life)
విడుదల తేదీ : 5 జూన్ 2026
Telugu Movie Media Rating : 3 / 5
నటీనటులు : కమల్ హాసన్, శింబు, త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, జోజూ జార్జి తదితరులు
దర్శకత్వం : మణిరత్నం
నిర్మాతలు : కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంత్, ఉదయనిధి స్టాలిన్
సినిమాటోగ్రఫీ : రవి కె చంద్రన్
సంగీతం : ఏ ఆర్ రహమాన్
Kamal Haasan Mani Ratnam movie
చాలా ఏళ్ళ అనంతరం కమల్ హాసన్, మణిరత్నం ల కలయికలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ థగ్ లైఫ్. ఈ మూవీలో శింబు కీలక పాత్ర చేయగా త్రిష హీరోయిన్ గా నటించారు. మొదటి నుండి అందరిలో ఎంతో మంచి క్రేజ్ ఏర్పరిచిన ఈ మూవీకి ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించగా రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. ఇటీవల రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ తో అందరిలో బాగా హైప్ ఏర్పరిచిన థగ్ లైఫ్ మూవీ నేడు ఆడియన్స్ ముందుకి వచ్చి ఎటువంటి రెస్పాన్స్ అందుకుందో చుద్ద్దాం.
కథ :
ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే రంగరాయ శక్తిరాజు (Kamal Haasan) అలానే మాణిక్యం (Nasser) ఇద్దరూ కూడా న్యూ ఢిల్లీలో పేరుమోసిన గ్యాంగ్ స్టర్స్. అనంతరం ఒకానొక షూటౌట్ లో భాగంగా అతడు అమర్ (Silambarasan TR) ని చేరదీసి పెంచి పెద్ద చేస్తాడు. అయితే సంవత్సరాలు గడిచిన అనంతరం శక్తిరాజు జైలుపాలవడంతో అతడి గ్యాంగ్ స్టర్ సామ్రాజ్యాన్ని అమర్ చూసుకుంటుంటాడు.
కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ తెలుగు మూవీ రివ్యూ
అయితే అనుకోకుండా అతడికి ఒక విషయం తెలిసి తనను పెంచిన శక్తిరాజు మీద రివెంజ్ తీసుకునే ప్రయత్నం చేస్తాడు అమర్. అతడి సామ్రాజ్యంలోని ఒక్కొక్కరి పై గట్టిగా దృష్టి పెడతాడు అమర్. మరి అతడి సడన్ రివెంజ్ కి కారణం ఏమిటి, అమర్ నుండి శక్తిరాజ్ తప్పించుకున్నాడా. ఫైనల్ గా వారిద్దరి మధ్య ఏమి జరిగింది. అనేది మొత్తం కూడా వెండితెర పై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
చాలా ఏళ్ళ తరువాత కమల్ తో మణిరత్నం చేస్తున్న మూవీ కావడంతో వీరి కాంబో పై అందరిలో ఉన్న అంచనాలు ట్రైలర్ రిలీజ్ అనంతరం విపరీతంగా పెరిగాయి. ఇక ఈ మూవీలో శక్తిరాజు పాత్రలో మరొక్కసారి తన అద్భుత నటనతో ఆకట్టుకున్నారు హీరో కమల్ హాసన్. పలు కీలక సీన్స్ లో ఆయన యాక్టింగ్ మరింత సూపర్.
Thuglife Kamal Haasan Telugu
అలానే కీలక అమర్ పాత్రలో కనిపించిన శింబు యాక్టింగ్ కూడా అదరహో అనే రేంజ్ లో ఉంది. మణిరత్నం మార్క్ టేకింగ్ కి వీరిద్దరి యాక్టింగ్ స్క్రీన్ మీద ఎంతో బాగుంది. నటి అభిరామి తో పాటు నాజర్ వంటి వారి పాత్రలు కూడా బాగున్నాయి. ఇతర కీలక పాత్రధారుల నటన కూడా బాగుంది.
మైనస్ పాయింట్స్ :
ఎన్నో ఏళ్ళ అనంతరం కమల్, మణిరత్నం చేసిన ఈ మూవీలో స్టోరీ లైన్ బాగున్నప్పటికీ చాలావరకు పేలవంగా సాగె స్క్రీన్ ప్లే ఆడియన్స్ ని ఆకట్టుకోదు. ఎంతో ఫ్రెష్ గా రాసుకోవాల్సిన స్క్రీన్ ప్లే తో పాటు సీన్స్ ని ఎంతో ఈజీగా ఊహించదగినవిగా రాసుకున్నారు. సినిమాలో ఎమోషనల్ డెప్త్ కూడా మిస్ అయింది.
కథ, నటన, టెక్నికల్ అంశాలు – పూర్తిగా విశ్లేషణ
ఫస్ట్ హాఫ్ బాగున్న ఈ మూవీ సెకండ్ హాఫ్ డిజప్పాయింట్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఎంతో స్ట్రాంగ్ గా సాగె శింబు పాత్ర సెకండ్ హాఫ్ లో పేలవంగా పెద్దగా ఎమోషనల్ కనెక్షన్ లేకుండా సాగుతుంది. త్రిష (Trisha Krishnan) తన పాత్రలో ఆకట్టుకున్నప్పటికీ ఆమె పాత్రకి సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేదు. ముఖ్యంగా అశోక్ సెల్వన్, జోజూ జార్జి వంటి స్టార్ క్యాస్ట్ ని తీసుకున్నప్పటికీ కథనాన్ని ఇంట్రెస్టింగ్ గా నడపలేకపోయారు దర్శకుడు మణిరత్నం
Thug Life movie release date Telugu
సాంకేతిక విభాగం :
ముఖ్యంగా ఈ సినిమాలో దర్శకుడు మణిరత్నం వీక్ స్క్రీన్ ప్లే సినిమాకి మైనస్. ఇక సంగీత దర్సకుడు ఏ ఆర్ రహమాన్ అందించిన్స్ సాంగ్స్ బెటర్ అనిపించినా కీలక సీన్స్ లో ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంట్రెస్టింగ్ గా లేదు. ఎడిటింగ్ విభాగం అక్కడక్కడా కొన్ని అనవసర సీన్స్ కట్ చేస్తే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. సీన్స్ ఎంతో గ్రాండ్ గా ఉన్నాయి. అలానే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
మన అభిప్రాయం, హైలైట్స్ మరియు రేటింగ్
తీర్పు :
ఇక ఫైనల్ గా చాలా ఏళ్ళ తరువాత కమల్ హాసన్ తో మణిరత్నం తీసిన థగ్ లైఫ్ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగుతుంది. అయితే ఫస్ట్ హాఫ్ బాగానే ఆకట్టుకున్న ఈ మూవీ సెకండ్ హాఫ్ నీరసరం సాదాసీదాగా సాగుతుంది. కమల్, శింబు ల యాక్టింగ్ అదిరిపోయినప్పటికీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకోదు. అయితే కమల్, శింబు ల ఫ్యాన్స్ కి బాగానే నచ్చే ఈ మూవీ సాధారణ ఆడియన్స్ కి పర్వాలేదనిపిస్తుంది అంతే.
What's Your Reaction?






