Highest Grossing Telugu Movies List – All-Time Box Office Records
Highest Grossing Telugu Movies List భారతీయ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం తెలుగు సినిమా రోజు రోజుకు తన పరిధిని మరింతగా విస్తరిస్తూ కొనసాగుతోంది. వరుసగా అనేక భారీ పాన్ ఇండియన్ మూవీస్ సౌత్ లో మరీ ముఖ్యంగా తెలుగులో

భారతీయ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం తెలుగు సినిమా రోజు రోజుకు తన పరిధిని మరింతగా విస్తరిస్తూ కొనసాగుతోంది. వరుసగా అనేక భారీ పాన్ ఇండియన్ మూవీస్ సౌత్ లో మరీ ముఖ్యంగా తెలుగులో రూపొందుతున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమా మార్కెట్ తో పాటు హీరోల యొక్క క్రేజ్ కూడ మన దేశంతో పాటు ఇతర అనేక దేశాలకు మెల్లగా విస్తరిస్తోంది.
Highest Grossing Telugu Movies List – All-Time Record Breakers
తెలుగు సినీ దర్శకులు కూడా పలువురు తమ అద్భుత ప్రతిభతో పలు సినిమాల ద్వారా టాలెంట్ ని నిరూపించుకుంటూ మన సినీ కీర్తిని మరింతగా ముందుకు తీసుకెళ్తున్నారు. ముందుగా 2015లో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ మూవీతో తొలిసారిగా జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి టాలీవుడ్ నుండి పాన్ ఇండియన్ మూవీస్ ని ఇండియా లోని ఇతర భాషలకు పరిచయం చేసారు.
ఆ మూవీ అప్పట్లో రిలీజ్ అనంతరం అత్యద్భుత విజయం సొంతం చేసుకుని తెలుగు సినిమా యొక్క పేరుని మరింతగా చాటింది. ప్రభాస్ హీరోగా అనుష్క శెట్టి, తమన్నా హీరోయిన్స్ గా రూపొందిన బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాలు కూడా ఒక దానిని మించేలా మరొకటి ఎంతటి ఘన విజయాలు సొంతం చేసుకున్నాయి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బాహుబలి 2 మూవీ నెలకొల్పిన రికార్డులు ప్రస్తుతం ఇంకా పలు చోట్లా అలానే నిలిచి ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక తెలుగు సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన లిస్ట్ ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం.
Highest Grossing Telugu Movies
బాహుబలి 2 : ది కంక్లూజన్ (Baahubali 2 The Conclusion)
2017 లో భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ భారీ పాన్ ఇండియన్ మూవీ బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద సంచలన విజయం అయితే నమోదు చేసింది. జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈమూవీలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా రెండు పాత్రల్లో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ అద్భుత నటన, ఇతర నటీనటుల అభినయంతో పాటు దర్శకధీరుడు జక్కన్న తెరకెక్కించిన విధానానికి కోట్లాది ఆడియన్స్ నీరాజనాలు పట్టారు.
Top 10 Highest Grossing Telugu Movies Worldwide
ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన ఈమూవీలో నాజర్, రమ్యకృష్ణ, సత్యరాజ్, సుబ్బారాజు, రోహిణి, రానా దగ్గుబాటి కీలక పాత్రలు పోషించారు. ఇక బాహుబలి 2 మూవీ మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలోని పలు ఇతర ప్రాంతాలు, అలానే ఓవర్సీస్ లో సైతం కలెక్షన్స్ మోత మోగించింది. ఇక ఈమూవీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 1810 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుని తిరుగులేని స్థానం దక్కించుకుంది. ముఖ్యంగా ఈ మూవీస్ తో హీరోగా ప్రభాస్ తో పాటు ఇతర నటులు, దర్శకుడు రాజమౌళి ఎనలేని కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకున్నారు.
Highest Grossing Telugu Movies
ఆర్ఆర్ఆర్ : RRR
టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తొలిసారిగా వారిద్దరితో మల్టీస్టారర్ తెరకెక్కించారు జక్కన్న. ఆ మూవీని ఆర్ఆర్ఆర్. రెండేళ్ల క్రితం మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ భారీ పాన్ ఇండియన్ పేట్రియాటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సొంతం చేసుకుంది. ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన ఈమూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ స్థాయిలో నిర్మించారు.
అలియా భట్, ఆలిసన్ డూడి, రే స్టీవెన్సన్, రాజీవ్ కనకాల, రాహుల్ రామకృష్ణ, సముద్రఖని, ఒలీవియా మోరిస్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 1350 కోట్ల మేర కలెక్షన్ సొంతం చేసుకుంది. ఇందులో కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ కనిపించగా అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్ నటించారు. ఈ మూవీ భారీ విజయంతో ఈ ఇద్దరు స్టార్స్ కి గ్లోబల్ ఇమేజ్ లభించింది.
కల్కి 2898 ఏడి : Kalki 2898 AD
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ మెగాస్టా అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ స్టార్ యాక్టర్ కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ భామ దీపికా పదుకొనె హీరోయిన్ గా యువ దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ ఎంటెర్టైనర్ మూవీ కల్కి 2898 ఏడి. ఈ మూవీలో దిశా పటాని, శోభన, రాజేంద్ర ప్రసాద్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు.
Highest Grossing Telugu Movies in India – Box Office Collection
సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీని బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ భారీ వ్యయంతో నిర్మించారు. ఇక రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ వద్ద గొప్ప విజయం సొంతం చేసుకున్న కల్కి 2898 ఏడి మూవీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 1150 కోట్ల వరకు గ్రాస్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీలో ప్రభాస్ భైరవగా, కర్ణుడిగా కనిపించగా కీలకమైన అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ నటించారు. యువ దర్శకుడు నాగ అశ్విన్, ఈ మూవీని అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా గ్రాండ్ గా తెరకెక్కించారు.
Highest Grossing Telugu Movies List
సలార్ 1 సీజ్ ఫైర్ : (Salaar Part 1 Ceasefire)
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా అందాల నటి శృతి హాసన్ హీరోయిన్ గా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్. ఈ మూవీలో ఈశ్వరి రావు, మైమ్ గోపి, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రీయారెడ్డి, ఝాన్సీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కెజిఎఫ్ సిరీస్ సినిమాలతో దర్శకుడిగా నేషనల్ వైడ్ గుర్తింపు సంపాదించిన ప్రశాంత్ నీల్ సలార్ మూవీతో కూడా మరొక విజయం తన ఖాతాలో వేసుకున్నారు.
రవి బాస్రూర్ సంగీతం అందించిన ఈ మూవీని ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. ఇక సలార్ మూవీ రిలీజ్ అనంతరం మంచి విజయం సొంతం చేసుకుని ఓవరాల్ గా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 700 కోట్ల మేర కలెక్షన్ సొంతం చేసుకుంది. ఇక దీనికి సీక్వెల్ గా సలార్ శౌర్యంగపర్వం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ మూవీ మరింత విజయం సొంతం చేసుకుంటుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
బాహుబలి ది బిగినింగ్ : (Baahubali The Beginning)
తొలిసారిగా టాలీవుడ్ తో పాటు ఇండియన్ స్క్రీన్ పై పాన్ ఇండియా మూవీ తెరకెక్కించి దీనితో తన సత్తా చాటారు జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి. ఇక బాహుబలి పార్ట్ 1 మూవీ 2015 లో మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చింది. అయితే ఫస్ట్ డే ఒకింత నెగటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈమూవీ మెల్లగా ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. వాస్తవానికి తొలిసారిగా చేసిన భారీ ప్రయత్నం కావడంతో తప్పకుండా తమ ఈ ప్రయత్నం అందరికీ నచ్చుతుందని భావించిన బాహుబలి మేకర్స్, ఫైనల్ గా అది జరగడంతో ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.
Biggest Blockbusters in Tollywood – Industry Hits & Records
ముఖ్యంగా బాహుబలి 1 మూవీలో ప్రభాస్ నటనతో పాటు జక్కన్న రాజమౌళి మూవీని తెరకెక్కించిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక శివగామి గా రమ్యకృష్ణ, కట్టప్ప గా సత్యరాజ్ కూడా అదరగొట్టారు. బాహుబలి లో సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈమూవీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 650 కోట్లని సొంతం చేసుకుంది.
Highest Grossing Telugu Movies
సాహో : (Saaho)
బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాలు కూడా ఒకదానిని మించేలా మరొకటి ఎంతటి గొప్ప విజయాలు సొంతం చేసుకున్నాయి మనకు తెలిసిందే. వాటి అనంతరం యువ దర్శకుడు సుజీత్ తో ప్రభాస్ చేసిన మూవీ సాహో. ఈ స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో బాలీవుడ్ అందాల కథానాయిక శ్రద్ధ కపూర్ ప్రభాస్ కి జోడిగా కనిపించగా కీలక పాత్రల్లో నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్ కనిపించారు. యువి క్రియేషన్స్ సంస్థ పై ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం నమోదు చేసింది.
ముఖ్యంగా ప్రభాస్, శ్రద్ధ కపూర్ ల జోడీతో పాటు భారీ యాక్షన్ సీన్స్, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, దర్శకుడు సుజీత్ స్టైలిష్ టేకింగ్ వంటివి సాహో ప్రధాన హైలైట్స్ గా చెప్పుకోవచ్చు. ఇక ఈ మూవీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 450 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుంది. ఇక అక్కడి నుండి పాన్ ఇండియన్ స్టార్ గా ప్రభాస్ ఒక్కో మెట్టు ఎక్కుతూ తన క్రేజ్ ని మార్కెట్ ని విస్తరిస్తూ కొనసాగుతున్నారు.
దేవర పార్ట్ 1 : (Devara Part 1)
టాలీవుడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీలో వర, దేవర అనే రెండు పాత్రల్లో ఎన్టీఆర్ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుంది. బాలీవుడ్ అందాల నటి జాన్వీ కపూర్ ఈ మూవీ ద్వారా తెలుగుకి హీరోయిన్ గా పరిచయం అయ్యారు.
Highest Grossing Telugu Movies by Year – Annual Top Earners
రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన ఈమూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. కొరటాల శివ ఆకట్టుకునే కథ, కథనాలతో దీనిని చక్కగా తెరకెక్కించారు. ఇక ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకున్న మూవీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 425 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుంది. ఇక దీని అనంతరం త్వరలో ఈ మూవీకి సీక్వెల్ గా దేవర పార్ట్ 2 సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
Highest Grossing Telugu Movies
పుష్ప ది రైజ్ : Pushpa The Rise
టాలీవుడ్ పాన్ ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో గ్రాండ్ గా రూపొంది 2021 డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకి వచ్చిన భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రైజ్. ఈ మూవీలో రావు రమేష్, ఫహాద్ ఫాసిల్, సునీల్, ధనుంజయ, అజయ్ ఘోష్, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీలో పుష్ప రాజ్ గా అద్భుత నటన కనబరిచి అందరినీ ఆకట్టుకున్న అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు సొంతం చేసుకున్నారు.
ముఖ్యంగా పుష్ప మూవీలో అల్లు అర్జున్ క్యారెక్టర్, మ్యానరిజమ్స్ తో పాటు సాంగ్స్ కూడా అద్భుతంగా నేషనల్ వైడ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. ఇక పుష్ప ది రైజ్ మూవీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 375 కోట్ల మేర కలెక్షన్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీకి సీక్వెల్ గా రూపొందిన పుష్ప ది రూల్ మూవీ ఈ ఏడాది డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్ ముందుకి రానుంది.
హను మాన్ : Hanu-Man
యువ నటుడు తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా రూపొందిన లేటెస్ట్ మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ హను మాన్. ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సొంతం చేసుకుంది. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తీసిన హను మాన్ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, వినయ్ రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించగా దీనిని గ్రాండ్ లెవెల్లో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై నిరంజన్ రెడ్డి నిర్మించారు.
Highest grossing Telugu movies list
ముఖ్యంగా ఈ మూవీలో హీరో తేజ సజ్జతో పాటు ప్రతి ఒక్క పాత్రధారి నటన, క్లైమాక్స్ సన్నివేశాలతో పాటు ప్రశాంత్ వర్మ టేకింగ్ కి మంచి పేరు లభించింది. కాగా ఓవరాల్ గా హను మాన్ మూవీ వరల్డ్ వైడ్ రూ. 350 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం దీనికి సీక్వెల్ గా జై హనుమాన్ మూవీని రూపొందించేందుకు సిద్ధమయ్యారు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
Highest Grossing Telugu Movies 2024
అల వైకుంఠపురములో (Ala Vaikunthapurramuloo)
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ అల వైకుంఠపురములో. 2020 సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించగా యువ సంగీత తరంగం తమన్ మ్యూజిక్ అందించారు. గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీ రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సొంతం చేసుకుంది.
ముఖ్యంగా ఈమూవీలో బంటుగా అల్లు అర్జున్ నటనతో పాటు త్రివిక్రమ్ టేకింగ్, అలానే థమన్ అందించిన సాంగ్స్ కి బాగా క్రేజ్ లభించింది. ముఖ్యంగా అల వైకుంఠపురములో మూవీ సాంగ్స్ కి నేషనల్ వైడ్ క్రేజ్ లభించి, యూట్యూబ్ లో వందల మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్ సృష్టించాయి. కాగా ఓవరాల్ గా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా రూ. 280 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది. కాగా ఈ మూవీ అనంతరం నేషనల్ వైడ్ గా బాగా క్రేజ్ అందుకున్నారు అల్లు అర్జున్.
Highest Grossing Telugu Movies 2025
What's Your Reaction?






