Allu Arjun Reacts to National Award Win

Allu Arjun’s emotional reaction after winning the National Award for Pushpa. Fans celebrate the historic moment.

Allu Arjun Reacts to National Award Win

టాలీవుడ్ స్టార్ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల తన కెరీర్ పరంగా రిలీజ్ అయిన అలవైకుంఠపురములో అలానే పుష్ప, పుష్ప 2 సినిమాలతో హీరోగా మంచి బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే. 

ముందుగా 2020లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అలవైకుంఠపురములో మూవీ పెద్ద విజయం అందుకోవడంతో పాటు అందులోని సాంగ్స్ ఏకంగా నేషనల్ వైడ్ పాపులర్ అయి అల్లు అర్జున్ కు మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. అనంతరం సుకుమార్ తో అల్లు అర్జున్ తొలిసారిగా చేసిన పాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రైజ్. 

జాతీయ అవార్డు గెలిచిన అల్లు అర్జున్

ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో ఫహాద్ ఫాసిల్, రావురమేష్, అనసూయ భరద్వాజ్, కల్పలత, సునీల్ తదితరులు నటించారు. అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన పుష్ప మూవీ మంచి బాక్సాఫీస్ విజయం అందుకోవడంతో పాటు ఆ మూవీలో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ నటనకు అందరి నుండి ప్రసంశలు కూడా లభించాయి. 

ముఖ్యంగా అల్లు అర్జున్ ని విమర్శకులు సైతం మెచ్చుకోవడం, అనంతరం అదే ఆయనకు ఏకంగా జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. అయితే ఆ అవార్డు సొంతం చేసుకున్న అల్లు అర్జున్ మాట్లాడుతూ, కెరీర్ పరంగా తనకు మొదటి నుండి తోడునీడగా ఉన్న తన ఫ్యాన్స్ యొక్క ప్రేమాభిమానాలని తాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. 

ముఖ్యంగా నేషనల్ అవార్డు వచ్చిన అనంతరం నటుడిగా తన రేంజ్, మార్కెట్ తో పాటు బాధ్యత కూడా మరింతగా పెరిగిందని, ఇకపై మరింతగా ఆడియన్స్ ని అలరించే మంచి సినిమాల ద్వారా అందరి ముందుకు వచ్చేందుకు బాగా కష్టపడతానని అన్నారు. 

అయితే నేషనల్ అవార్డు అనంతరం పుష్ప మూవీ సీక్వెల్ అయిన పుష్ప 2 పై దేశవ్యాప్తంగా మరింత అంచనాలు ఏర్పడ్డాయి. ఇక గత ఏడాది భారీ స్థాయిలో రిలీజ్ అయిన పుష్ప 2 మూవీ అంచనాలకు మించి భారీ విజయం సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద రూ. 1800 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుని హీరోగా అల్లు అర్జున్ క్రేజ్ ని మరొక్కసారి దేశవ్యాప్తంగా చాటి చెప్పింది. 

అల్లు అర్జున్ ఫ్యాన్స్ రియాక్షన్స్ & సోషల్ మీడియా ట్రెండ్స్

ఆ మూవీలో కూడా అల్లు అర్జున్ మరొక్కసారి పుష్పరాజ్ గా తన అలరించే పవర్ఫుల్ యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్నారు. సుకుమార్ టేకింగ్ తో పాటు రష్మిక అందం అభినయం, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ వంటివి పుష్ప 2 ది రూల్ మూవీ యొక్క భారీ విజయానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. 

ఇక ఈ సినిమాల తరువాత కొద్దిపాటి కెరీర్ పరంగా బ్రేక్ తీసుకున్న అల్లు అర్జున్ ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక మూవీ అనౌన్స్ చేసారు. మైథలాజికల్ జానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ మూవీ ద్వారా తొలిసారిగా పాన్ ఇండియన్ మార్కెట్ లోకి దర్శకుడు త్రివిక్రమ్ అడుగుపెట్టనున్నారు. 

కాగా ఈ మూవీ భారతీయ చిత్ర పరిశ్రమలో మైథలాజి సందర్భంగా ఎవరూ కూడా టచ్ చేయని ఒక పాయింట్ తో దర్శకుడు త్రివిక్రమ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని నిర్మాత నాగవంశీ ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ చెప్పారు. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్నారు. 

అయితే తాజాగా కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ కుమార్ తో ఒక భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అనౌన్స్ చేసారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ మూవీ దాదాపుగా ఏడు వందల కోట్ల వ్యయంతో రూపొందనుందనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. 

అల్లు అర్జున్ కు ఇండస్ట్రీ నుండి శుభాకాంక్షలు

ఇటీవల ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ వీడియో ని గ్రాండ్ గా రూపొందించి రిలీజ్ చేసారు. కోలీవుడ్ యువ సంగీత తరంగం సాయి అభ్యంకర్ దీనికి సంగీతం అందించనుండగా అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు దీనిని నిర్మించనున్నారు. 

కాగా ఈ సినిమాల అనంతరం టిసిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థల పై ఆనిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో కూడా ఒక మూవీ చేయనున్నారు అల్లు అర్జున్. అయితే ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేసేందుకు సిద్దమవుతున్న సందీప్, దాని అనంతరం ఆనిమల్ పార్క్ మూవీ తీయనున్నారు. వాటి రెండిటి తరువాత అల్లు అర్జున్, సందీప్ మూవీ రూపొందనుంది. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow