KGF Chapter 3 Budget Will Shock You – Bigger Than Ever Before
The budget of KGF Chapter 3 iwas Totally Shocking! Find out how much is being spent on Yash’s next big action drama.

ప్రస్తుతం భారతీయ సినిమా ఇండస్ట్రీలో రానున్న భారీ పాన్ ఇండియా సినిమాల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ సినిమాగా కెజిఎఫ్ చాప్టర్ 3 ని చెప్పవచ్చు. గతంలో కన్నడ సహా పలు ఇతర భారతీయ భాషల్లో రిలీజ్ అయి అన్ని భాషల్లో కూడా భారీ విజయాలని అందుకున్న కెజిఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 సినిమాల గురించి మనదేశ సినిమా ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి.
కోలార్ గనుల నేపథ్యంలో మంచి ఎమోషనల్, మాస్ యాక్షన్ కమర్షియల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాల్లో కన్నడ స్టార్ నటులేదు యష్ హీరోగా నటించగా యువ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. యువ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎంతో అద్భుతంగా తీసిన ఈ సినిమాలని కన్నడ భారీ నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ వారు ఎంతో భారీ వ్యయంతో నిర్మించారు.
కేజీఎఫ్ చాప్టర్ 3 బడ్జెట్ తెలిస్తే షాక్ అవుతారు!
ఇక ఆ సినిమాలకి సీక్వెల్ గా త్వరలో కెజిఎఫ్ చాప్టర్ 3 మరింత అత్యద్భుతంగా భారీ వ్యయంతో నిర్మితం కానుంది. కాగా ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకాభిమానుల్లో ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. మొదటి రెండు భాగాలని మించేలా మరిన్ని భారీ యాక్షన్ సన్నివేశాలు ఇందులో ఉండనున్నట్లు తెలుస్తోంది.
కన్నడతో పాటు పలు ఇతర ఇతర భాషల నటులు ఈ మూవీలో కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు చెప్తున్నారు. ఈ మూవీ కోసం ఇప్పటికే ఒక అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధం చేశారట దర్శకుడు ప్రశాంత్ నీల్.
టాలీవుడ్ విలక్షణ నటుడు రావు రమేష్, అలానే అద్భుత నటుడు ప్రకాష్ రాజ్ లు కూడా ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారని టాక్. ఇక ప్రస్తుతం గీతూ మోహన్ దాస్ తో నటుడు యష్ చేస్తున్న సినిమా టాక్సిక్. ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ చాలావరకు పూర్తి చేసుకున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ కొద్దిరోజుల క్రితం యూట్యూబ్ లో రిలీజ్ అయి ఎంత పెద్ద సంచలనాన్ని క్రియేట్ చేసిందనేది మనకు తెలిసిందే.
కేవలం గ్లింప్స్ టీజర్ తోనే ఈ స్థాయి రెస్పాన్స్ దక్కించుకున్న ఈ సినిమా రేపు రిలీజ్ అనంతరం పెద్ద విజయం ఖాయం అంటోంది టీమ్. ఇక ప్రస్తుతం ఈ సినిమా యొక్క రైట్స్ కోసం దాదాపుగా అన్ని ప్రాంతాల నుండి ఎంతో భారీ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయని అంటున్నారు.
ఈ సారి ఖర్చు ఊహించదగ్గ దానికంటే ఎక్కువే అంటారా?
అయితే ప్రస్తుతం తెరకెక్కుతున్న టాక్సిక్ అనంతరం హీరో యష్ కొంత గ్యాప్ తీసుకుని కెజిఎఫ్ చాప్టర్ 3 చేయనున్నారనేది లేటెస్ట్ కన్నడ సినీ వర్గాల టాక్. ఈ సినిమాకి హోంబలె ఫిలిమ్స్ వారు దాదాపుగా రూ.400 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారని, అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న కెజిఎఫ్ చాప్టర్ 3 తప్పకుండా రిలీజ్ తరువాత ఈ సినిమా అన్ని భాషల్లో కూడా మొదటి రెండు భాగాలని మించేలా గొప్ప విజయాన్ని అందుకుని బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు కూడా అందిస్తుందని యూనిట్ ఇప్పటినుండే ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా కోసం హీరో యష్ మరింత బల్క్ గా బాడీని పెంచడంతో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా దీనిని గ్రాండియర్ గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇక దీనిని బట్టి చూస్తుంటే రాబోయే రోజుల్లో ఎంతో గ్రాండ్ లెవెల్లో రూపొంది, మరింత గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ కెజిఎఫ్ చాప్టర్ 3 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్స్ అన్నిటినీ కూడా తిరగరాయడం ఖాయంగా కనపడుతోందని పలువురు విశ్లేషకులు ఇప్పటినుండే అభిప్రాయపడుతున్నారు.
యష్ మళ్లీ బ్లాక్‌బస్టర్ కొట్టేందుకు మేకర్స్ భారీగా వెచ్చిస్తున్నారా?
ముఖ్యంగా అన్ని భాషల ఆడియన్స్ లో అలానే యువత, మాస్ ఆడియన్స్ లో కెజిఎఫ్ సిరీస్ పై మరింత క్రేజ్ ఉందనేది తెలిసిందే. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి భువన్ గౌడ కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు కెజిఎఫ్ అభిమానులు కూడా ఈ మూవీ పై ఎన్నో అంచనాలు పెట్టుకోవడంతో నిర్మాతలు సినిమాని వీలైనంత ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు ఇప్పటినుండే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తంగా ఇంకా ప్రారంభం కూడా కాకముందే దేశవ్యాప్తంగా సినిమా ఆడియన్స్ లో ఎంతో ఆసక్తిని రేపుతున్న కెజిఎఫ్ చాప్టర్ 3 మూవీ త్వరలో పట్టాలెక్కి, ఆపై రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ పై ఏవిధంగా దండయాత్ర చేస్తుందో చూడాలి.
What's Your Reaction?






