Wamiqa Gabbi Movies: From Grahan to Bhool Chuk Maaf

Check out the latest movies of Wamiqa Gabbi including her OTT releases and lead roles in upcoming films

Wamiqa Gabbi Movies: From Grahan to Bhool Chuk Maaf

ప్రస్తుతం బాలీవుడ్ (Bollylwood) చిత్ర పరిశ్రమలో మంచి పేరు, క్రేజ్ తో ఆడియన్స్ నుండి బాగా ఆదరణతో కొనసాగుతున్న వీరిలో యువ హీరోయిన్ వామికా గబ్బి (Wamiqa Gabbi) కూడా ఒకరు. అయితే ఎక్కువగా ఆమె పంజాబీ, హిందీ మూవీస్, సిరీస్ లో నటించి ఆకట్టుకున్నారు. 29 సెప్టెంబర్ 1993లో చండీగఢ్ లోని ఒక పంజాబీ ఫ్యామిలీ లో ఆమె జన్మించారు. 

కాగా ఆమె తండ్రి గోవర్ధన్ గబ్బి పంజాబీ (Punjabi), హిందీ (Hindi) భాషల్లో పలు పుస్తకాలు రాసిన రచయిత. ఇక తన ఉన్నత చదువుల అనంతరం తొలిసారిగా 2007లో హిందీలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ మూవీ జబ్ వుయ్ మెట్ (Jab We Met) మూవీ ద్వారా ఆమె చిత్రరంగ ప్రవేశం చేసారు. షాహిద్ కపూర్ (Shahid Kapoor), కరీనా కపూర్ (Kareena Kapoor) హీరో హీరోయిన్స్ గా రూపొందిన ఆ మూవీని ఇంతియాజ్ ఆలీ తెరకెక్కించారు. 

వామికా గబ్బి నటించిన సినిమాలు

అప్పట్లో బాగా విజయవంతం అయిన ఆ మూవీలో ఒక చిన్న పాత్ర చేసి ఆకట్టుకున్నారు వామికా. ఆ తరువాత 2009లో సైఫ్ ఆలీ ఖాన్, దీపికా పదుకొనె నటించిన లవ్ ఆజ్ కల్ (Love Aaj Kal) మూవీలో కూడా ఒక పాత్ర చేసారు. అనంతరం 2001లో షాహిద్ కపూర్, సోనమ్ కపూర్ (Mousam) కలిసి నటించిన మౌసమ్ మూవీలో వామికా నటించారు. 

ఆ మూవీ విజయం అందుకోవడంతో పాటు అందులోని లాలా దుర్గాదాస్ కూతురి పాత్ర చేసిన ఆమె మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇక అక్కడి నుండి ఒక్కొక్కటిగా వామికా కు అవకాశాలు రాసాగాయి. అనంతరం బిట్టూ బాస్, సిక్స్ టీన్ అనే హిందీ మూవీస్ తో పాటు ఇష్క్ బ్రాండీ, తూ మేర 22 మై తేరా 22 వంటి పంజాబీ సినిమాల్లో నటించి తన నటనతో ఆకట్టుకున్నారు. 

ఆ విధంగా హిందీ తో పాటు పంజాబీ సినిమాలు కూడా చేసిన వామికా, 2001లో సుధీర్ బాబు హీరోగా శ్రీరామ్ ఆదిత్య తీసిన తెలుగు మూవీలో భలే మంచి రోజు (Bhale Manchi Roju) లో వామికా పాత్రలోనే కొద్దిసేపు కనిపించి అలరించారు. ఆ తరువాత మాలై నేరతు మయక్కం అనే మూవీతో పాటు మలయాళం లో గోదా మూవీలో కూడా నటించి అలరించారు. 

ఆమె తాజా సినిమాల జాబితా

ఇక అక్కడి నుండి నటిగా వామియా సినీ ప్రయాణం మెల్లగా మరింత ఊపందుకుంది. అయితే తనకు వచ్చిన అవకాశాలను ఏమాత్రం మిస్ చేసుకోకుండా, నటిగా ఎంతో కష్టపడుతూ, తనకు తాను ప్రూవ్ చేసుకుంటూ ప్రతి సినిమాలో మెప్పించారు వామికా. ఇక ఇటీవల హిందీలో వచ్చిన 83, ఖుఫియా, బేబీ జాన్ సినిమాల్లో కూడా పలు కీలక పాత్రలు చేసి ఆమె మెప్పించారు. 

త్వరలో ఆడియన్సు ముందుకి వచ్చేందుకు సిద్దమవుతున్న కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ భూల్ ఛుక్ మాఫ్ (Bhool Chuk Maaf) మూవీలో కూడా కీలక పాత్ర చేసారు వామికా. ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ముందు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అనుకున్న ఈమూవీ ఇండియా, పాకిస్తాన్ పహాల్గమ్ యుద్ధం నేపథ్యంలో డైరెక్ట్ గా ఓటిటిలో రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. 

అయితే పివిఆర్ సంస్థ వారు దానికి అభ్యంతరం చెప్పి కోర్ట్ లో కేసు వేయడంతో ఆ మూవీ రిలీజ్ కొన్నాళ్ళు వాయిదా పడింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిండియా భాషలకు చెందిన పలు క్రేజీ ప్రాజక్ట్స్ వామికా గబ్బి చేతిలో ఉన్నాయి. తమిళ్ లో ఇరవాకలం, జెనీ, హిందీలో దిల్ కా దర్వాజా ఖోల్ నా డార్లింగ్, భూత్ బంగ్లా మూవీస్ చేస్తున్నారు. 

OTT ఫిలిమ్స్‌లో ఆమె పాత్రలు

అలానే తెలుగులో అడివిశేష్ (Adivi Sesh) హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియన్ మూవీ జీ 2 తో పాటు మలయాళంలో టికీ టాక సినిమాలు ఆమె లైనప్ లో ఉన్నాయి. ఇక ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సినీ, వ్యక్తిగత విషయాలు ఫ్యాన్స్ ఆడియన్స్ తో శ్రీ చేసుకునే అలవాటు గల వామికా కష్టాన్ని నమ్మి ముందుకు సాగితే మెల్లగా అయినావిజయం తప్పకుండా వరిస్తుందని చెప్తారు. మరి నటిగా వామికా గబ్బి రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని కోరుతూ మన తెలుగు మూవీ మీడియా డాట్ కామ్ టీమ్ ప్రత్యేకంగా ఆమెకు శుభాభినందనలు తెలుపుతోంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow