Amaran OTT Release Date Telugu – Streaming Platform & Watch Online

Amaran OTT Release Date Telugu గత ఏడాది దీపావళి పండుగకి పలు క్రేజీ కాంబినేషన్ మూవీస్ ఆడియన్స్ ముందుకి వచ్చాయి. వాటిలో బయోగ్రఫికల్ యక్షన్ ఎంటర్టైనర్ మూవీ అమరన్ కూడా ఆడియన్స్ ముందుకి వచ్చి ప్రస్తుతం బాక్సాఫీస్

Amaran OTT Release Date Telugu – Streaming Platform & Watch Online

గత ఏడాది దీపావళి పండుగకి పలు క్రేజీ కాంబినేషన్ మూవీస్ ఆడియన్స్ ముందుకి వచ్చాయి. వాటిలో బయోగ్రఫికల్ యక్షన్ ఎంటర్టైనర్ మూవీ అమరన్ కూడా ఆడియన్స్ ముందుకి వచ్చి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం దిశగా కొనసాగుతోంది. కోలీవుడ్ స్టార్ నటుడు శివ కార్తికేయన్ హీరోగా అందాల నటి సాయి పల్లవి హీరోయిన్ గా రాజ్ కమల్ ఇంటర్నేషనల్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఇండియా లిమిటెడ్ సంస్థల పై అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ వ్యయంతో నిర్మితం అయిన మూవీ అమరన్.

కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్, వివేక్ కృష్ణాని గ్రాండ్ గా ఈ మూవీని నిర్మించారు. ముఖ్యంగా ప్రారంభం నాటి నుండి ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఆ తరువాత అమరన్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ మొదలుకొని టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఇలా అన్ని కూడా అందరినీ ఆకట్టుకుని మూవీ పై మరింతగా అంచనాలు ఏర్పరిచాయి. కాగా అక్టోబర్ 31న దీపావళి పండుగ కానుకగా ఆడియన్స్ ముందుకి వచ్చిన అమరన్ మూవీ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

Amaran OTT Release Date Telugu – When & Where to Watch

ముఖ్యంగా అటు తమిళ్ తో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. దేశం కోసం అశువులు బాసిన సైనిక వీరుడు మేజర్ వరదరాజన్ ముకుందన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ మూవీలో టైటిల్ పాత్రలో నటించిన హీరో శివ కార్తికేయన్ నటించారు అనడం కంటే జీవించారు అని చెప్పాలి. ముఖ్యమైన కీలక యాక్షన్ ఎమోషనల్ సీన్స్ లో ఆయన నటనకు హ్యాట్సాఫ్ చెప్పాలి. అలానే ఈ సినిమాలోని తన పాత్ర కోసం ప్రత్యేకంగా బాడీ కూడా బల్క్ గా పెంచిన శివ కార్తికేయన్ నటనకు అందరి నుండి మంచి ప్రసంశలు అందుతున్నాయి.

ఇక అమరన్ లో మరొక కీలక పాత్ర సాయి పల్లవిది. వరదరాజన్ ముకుందన్ భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో ఆమె కనిపించారు. స్వతహాగా మంచి డ్యాన్స్ తో పాటు అద్భుతమైన నటిగా కూడా క్రేజ్ సంపాదించిన సాయి పల్లవి కూడా రెబెకా పాత్రలో జీవించారు. ఇక మరీ ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆమె కనబరిచిన నటనకు మన మనసు కదలిపోతుంది. సినిమాలోని క్లైమాక్స్ సీన్స్ లో సాయి పల్లవి నటనకు ఆడియన్స్ నుండి విశేషమైన స్పందన లభిస్తోంది. ఈ మూవీతో ఆమె నటిగా మరింత ఉన్నత స్థాయికి చేరుకున్నారు.

Amaran Movie OTT Release Date & Streaming Platform

హీరో హీరోయిన్స్ అనంతరం ఈమూవీ యొక్క దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి గురించి చెప్పుకోవాలి. ప్రధానంగా ఇటువంటి బయోగ్రఫికల్ స్టోరీలను తీయడం దర్శకులకు ఒకింత ఛాలెంజ్ అని చెప్పాలి. ఎందుకంటే వాస్తవికతని ఎక్కడా కూడా మిస్ కాకుండా దానిని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా తీయాల్సి ఉంటుంది. ఆ విధంగా అటు వరదరాజన్ ముకుందన్ వాస్తవ కథని తీసుకుని దానికి కొద్దిపాటి కమర్షియల్ హంగులు జోడించి దర్శకుడు రాజ్ కుమార్ పెరియాసామి అమరన్ మూవీని ఎంతో బాగా తెరకెక్కించారని చెప్పాలి.

సినిమా యొక్క ప్రారంభ సన్నివేశం మొదలుకొని చివరి క్లైమాక్స్ సీన్ వరకు కూడా ఆడియన్స్ ని ఈ మూవీ అలానే కట్టిపడేస్తుంది. సిహెచ్ సాయి ఫోటోగ్రఫి అందించిన ఈ మూవీకి యువ సంగీత తరంగం జివి ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. పలు కీలక సన్నివేశాల్లో జివి ప్రకాష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ ఆకట్టుకోవడంతో పాటు సాంగ్స్ కూడా ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రంగులే సాంగ్ అయితే విశేషమైన రెస్పాన్స్ ని థియేటర్స్ లో సొంతం చేసుకుంటోంది.

Amaran Telugu Digital Rights & Online Availability

వరదరాజన్ ముకుందన్ జీవితంలోని ప్రధాన ఘట్టాలను తీసుకుని దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కించిన తీరు ఎంతో బాగుంది. ఇక హీరో హీరోయిన్స్ తో పాటు ఇతర కీలక పాత్రల్లో నటించిన భువన్ అరోరా, రాహుల్ బోస్, లల్లూ, శ్రీ కుమార్, శ్యామా ప్రసాద్, శ్యామ్ మోహన్ తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. సినిమా ముగిసిన అనంతరం చివరి సన్నివేశాల్లో మేజర్ వరదరాజన్ కుటుంబం ని చూపించి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించింది టీమ్.

అటువంటి మహోన్నత గొప్ప త్యాగమూర్తులు భౌతికంగా మన మధ్యన లేకున్నా వారి త్యాగాలు మన మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నిజానికి అమరన్ మూవీ చాలావరకు ఆకట్టుకునే రీతిన సాగినప్పటికీ అక్కడక్కడా కథనం కొద్దిగా నెమ్మదించినట్లు అనిపిస్తుంది. అయితే ఎక్కడికక్కడ మూవీని ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే విధంగా తెరకెక్కించారు దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి.

Amaran Movie Cast, Story & Box Office Performance

ముఖ్యంగా ఎడిటర్ కలైవనన్ చాలావరకు సినిమాని ఎంతో జాగ్రత్తగా ఎడిట్ చేశారు. ఇక ఫోటోగ్రఫి అందించిన సిహెచ్ సాయి అద్భుత విజువల్స్ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటాయి. పలు సీన్స్ ని అయన తెరకెక్కించిన తీరు అద్భుతం. ఇలా అమరన్ మూవీలో ప్రతి ఒక్క అంశం, విభాగం ఎంతో ఆకట్టుకోవడం ఈ మూవీకి ప్లస్ పాయింట్స్.

ఫైనల్ గా నిర్మాతలైన రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా వారు ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా గ్రాండ్ లెవెల్లో టెక్నీకల్ గా భారీ రూపొందించారు. ఇప్పటికే అమరన్ మూవీ తమిళనాడులో రూ. 200 కోట్ల గ్రాస్ దిశగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ. 30 కోట్ల మేర గ్రాస్ దిశగా కొనసాగుతోంది. ముఖ్యంగా అన్ని వర్గాల ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది అమరన్ మూవీ.

కాగా మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ నవంబర్ చివరిలో లేదా డిసెంబర్ మొదటి వారంలో పలు భాషల్లో ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ మూవీ యొక్క ఓటిటి రైట్స్ ని ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు రూ. 60 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్. తాజాగా అమరన్ సూపర్ సక్సెస్ తో తెలుగులో కూడా మేకర్స్ ప్రత్యేకంగా సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసి ఇక్కడి ఆడియన్స్ కి కృతజ్ఞతలు తెలిపారు. మరి రాబోయే రోజుల్లో బయోగ్రఫికల్ యాక్షన్ మూవీ ఎంతమేర కలెక్షన్ రాబడుతుందో చూడాలి.

Amaran vs Other Recent Telugu OTT Releases – Comparison

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow