Balakrishna Akhanda 2 Mind-Blowing Update – Latest News
Nandamuri Balakrishna's Akhanda 2 gets a mind-blowing update! Check out the latest news, release details, and cast information. Don't miss this exciting update.

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుసగా విజయాలతో మంచి జోరు మీదున్నారు అని చెప్పాలి. నాలుగేళ్ళ క్రితం మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన సినిమా అఖండ.
Akhanda 2 Movie Latest Update & Exciting News
ఈ మూవీ రిలీజ్ అనంతరం అతి పెద్ద అఖండ విజయం సొంతం చేసుకుని గతంలో బాలకృష్ణ, బోయపాటి సక్సెస్ ల రేషియో, క్రేజ్ ని మరింతగా పెంచేసింది అని చెప్పాలి. అయితే అఖండ తరువాత బాలకృష్ణ చేసిన మూవీ వీర సింహారెడ్డి.
ఈ మూవీని బాలకృష్ణకు వీరాభిమాని అయిన గోపీచంద్ మలినేని తెరకెక్కించగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. అయితే వీర సింహారెడ్డి కూడా బాగానే సక్సెస్ అయింది. ఇక ఆపైన సక్సెస్ఫుల్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన మూవీ భగవంత్ కేసరి. ఈ మూవీ కూడా రిలీజ్ అనంతరం పెద్ద విజయం సొంతం చేసుకుంది.
ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ప్రధాన పాత్రలో యువ అందాల నటి శ్రీలీల కనిపించారు. ఆ తరువాత బాలకృష్ణ ఇటీవల చేసిన మూవీ డాకు మహారాజ్. యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈమూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చి బాగా సక్సెస్ అయింది.
ఈ మూవీలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా, టాలీవుడ్ నటి చాందిని చౌదరి కీలక పాత్రలు చేయగా గతంలో బాలకృష్ణతో అఖండలో జోడీ కట్టిన ప్రగ్య జైస్వాల్ మెయిన్ హీరోయిన్ గా నటించారు. మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన డాకు మహారాజ్ లో బాలకృష్ణ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్, గ్రాండియర్ విజువల్స్, థమన్ అందించిన సాంగ్స్, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి అదిరిపోయాయి.
Nandamuri Balakrishna’s Akhanda 2 Release & Cast Details
ఇక ప్రస్తుతం బాలకృష్ణ చేస్తున్న మూవీ అఖండ 2. గతంలో బోయపాటి శ్రీను తో ఆయన చేసిన అఖండ మూవీకి ఇది సీక్వెల్. ఇందులో యువ అందాల నటి సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈమూవీని 14 రీల్స్ ప్లస్ సంస్థ పై ప్రముఖ నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట గ్రాండ్ గా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
అయితే విషయం ఏమిటంటే, అఖండ పార్ట్ 1 ని మించేలా మరింత అద్భుతంగా ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ ని సిద్ధం చేసి తెరకెక్కిస్తున్నారట దర్శకుడు బోయపాటి. కాగా ఇటీవల హిమాలయాల్లోని పలు కీలక ప్రదేశాల్లో ఈ మూవీలోని అఖండ యొక్క ఇంట్రడక్షన్ సీన్ తీసారట.
Balakrishna’s Akhanda 2 Latest News
కైలాస నాథుడైన పరమశివుని అభిషేకిస్తూ పవర్ఫుల్ రేంజ్ లో సాగే ఈ సీన్ రేపు థియేటర్స్ లో అందరినీ ఆకట్టుకుంటుందనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ముఖ్యంగా మాస్ యాక్షన్ అంశాలకు పెట్టింది పేరైన బోయపాటి శ్రీను ఈమూవీలో కూడా అదిరిపోయే యాక్షన్ సీన్స్ కంపోజ్ చేస్తున్నారట.
ఇక ఈమూవీలో నటిస్తున్న ఇతర నటీనటుల వివరాలు త్వరలో పూర్తిగా వెల్లడి కానున్నాయి. కాగా ఈ ప్రతిష్టాత్మక మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి ఈ ఏడాది సెప్టెంబర్ 25న భారీ స్థాయిలో పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరొక్కసారి రిలీజ్ అనంతరం బాలకృష్ణ, బోయపాటి ల క్రేజీ కాంబో ఏ రేంజ్ లో బాక్సాఫీస్ సంచలనం సృష్టిస్తుందో తెలియాలి అంటే మరికొన్ని నెలలు ఓపిక పట్టాల్సిందే.
What's Your Reaction?






