Who Is Rashmika Mandanna's Husband? Here's the Truth

Fans are curious to know Rashmika Mandanna's husband name. Is she married? Here's the real update about Rashmika’s relationship status in 2025

Who Is Rashmika Mandanna's Husband? Here's the Truth

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రస్తుతం ఇటు టాలీవుడ్ (Tollywood), అటు బాలీవుడ్ (Bollywood) తో పాటు పలు చిత్ర పరిశ్రమల్లో నటిగా ఎంతో మంచి క్రేజ్ తో పాటు పలు విజయాలతో దిగ్విజయంగా దూసుకెళ్తున్నారు. అయితే తొలిసారిగా టాలీవుడ్ కి ఛలో మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే మంచి సక్సెస్ సొంతం చేసుకున్నారు రష్మిక మందన్న. 

కాగా అంతకముందు ఆమె కన్నడ చిత్ర పరిశ్రమకి కిరిక్ పార్టీ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రక్షిత్ శెట్టి హీరోగా రూపొందిన ఆ మూవీ కూడా విజయవంతం అయింది. ఆ విధంగా అటు కన్నడ తో పాటు ఇటు తెలుగులో కూడా డెబ్యూ మూవీస్ తో విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు రష్మిక. 

రష్మిక మందన్న భర్త పేరు ఎవరంటే?

ఇక తెలుగులో ఆమెకు మెల్లగా అవకాశాలు రాసాగాయి. నాచురల్ స్టార్ నాని సరసన దేవదాసు సినిమా చేసిన రష్మికకి, అనంతరం ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) సరసన సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru) మూవీలో నటించే అవకాశం లభించింది. అప్పట్లో ఈ మూవీ అతిపెద్ద విజయం సొంతం చేసుకుని నటిగా రష్మిక క్రేజ్ ఇంకా పెంచింది. 

ఆపైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 1 ది రైజ్ (Pushpa The Rise) మూవీ చేసారు రష్మిక .ఆ మూవీ నేషనల్ వైడ్ గా సంచలనం సృష్టించింది. ఆపైన తెలుగుతో పాటు తమిళ్ కూడా అవకాశం అందుకున్నారు రష్మిక మందన్న. 

ఇలయదళపతి విజయ్ (Vijay) హీరోగా వంశీ పైడిపల్లి తీసిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వరిసు (Varisu)లో నటించి దానితో కూడా విజయం అందుకున్నారు. ఇక ఇటీవల బాలీవుడ్ అగ్ర కథానాయకుడు రణబీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపొందిన ఆనిమల్ (Animal) మూవీలో నటించి అతి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్నారు. 

వివాహం అయిందా? నిజం ఏంటి?

ఆ తరువాత ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప సీక్వెల్ అయిన పుష్ప 2 మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. ఆ మూవీ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సంచలనం సృష్టించి పెద్ద విజయం అందుకున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ సహా అటు నార్త్ లో కూడా టాప్ స్థానంలో నిలిచింది పుష్ప 2 (Pushpa The Rule). ఇక దాని అనంతరం తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సికందర్ మూవీ చేసారు. 

అయితే ఆ మూవీ యావరేజ్ గా మాత్రమే ఆడింది. ఇక ప్రస్తుతం నేషనల్ క్రష్ చేతిలో పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాలు ఉన్నాయి. మొదటి నుండి కూడా గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా వరుసగా పలు అవకాశాలతో కొనసాగుతున్న రష్మిక మందన్న అటు సోషల్ మీడియాలో సైతం ఎల్లప్పుడూ ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన సినిమాలు, పర్సనల్ విషయాలను అందరితో పంచుకుంటూ ఉంటారు. 

అయితే రష్మిక సినిమా రంగ ప్రవేశం అనంతరం న తొలి చిత్ర కథానాయకుడు రక్షిత్ శెట్టితో ఆమె నిశ్చితార్ధం జరిగింది. అయితే పెళ్లి వరకు వెళ్లకుండా కొన్ని కారణాల రీత్యా నిలిచిపోయింది. అనంతరం తన పెళ్లి గురించి రష్మిక ఎక్కడా కూడా ప్రస్తావించలేదు, ఆపైన్ పూర్తిగా తన ధ్యాస మొత్తం సినిమాల మీదనే అంటూ ప్రకటించారు రష్మిక. 

ఫ్యాన్స్‌ లో చర్చకేంద్రంగా మారిన రష్మిక పెళ్లి విషయాలు

అయితే మధ్యలో రష్మిక పెళ్లి చేసుకోనున్నారు అంటూ పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అయ్యాయి. కానీ వాటి పై ఆమె స్పందించలేదు. ఇక ఆమె భర్త ఫలానా అంటూ మరికొందరు ప్రచారం చేయసాగారు. అయితే అటువంటి సెలబ్రిటీస్ యొక్క పర్సనల్ లైఫ్ గురించి రాసేటపుడు పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకుని రాయాలని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

వాస్తవానికి రష్మిక అవివాహిత అనేది తెలిసిందే. కాబట్టి ఆమె పెళ్లి, భర్తకుసంబంధించి వస్తున్న కథనాలు ఎవరూ కూడా నమ్మవద్దు, ఒకవేళ ఆమె పెళ్లి నిశ్చయం అయితే వారే అధికారికంగా ప్రకటిస్తారని రష్మిక టీమ్ ఇటీవల తెలిపారు. 

కాబట్టి మన మీడియా వ్యక్తులం కూడా సెలబ్రిటీస్ యొక్క వ్యక్తిగత విషయాలకు సంబందించిన విషయాలు వాటికి సంబంధించి పూర్తి వాస్తవాలు తెలుసుకుని ఆర్టికల్స్ రాద్దాం. నటిగా రష్మిక రాబోయే రోజుల్లో మరింత భారీ విజయాలు, పేరుతో కొనసాగాలని మా తెలుగు మూవీ మీడియా డాట్ కామ్ టీమ్ మనస్పూర్తిగా కోరుతోంది. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow