Malavika Mohanan Steals Hearts in a Sultry White Saree – Latest Photoshoot

Explore Malavika Mohanan's latest photoshoot where she dazzles in a sultry white saree. Check out the stunning images and get inspired by her elegant style

Malavika Mohanan Steals Hearts in a Sultry White Saree – Latest Photoshoot

ప్రస్తుతం తెలుగుతో పాటు అటు కోలీవుడ్, మోలీవుడ్ లో కూడా మంచి అవకాశాలతో కొనసాగుతున్న నటీమణి మాళవిక మోహనన్ (Malavika Mohanan). ప్రముఖ ఫోటోగ్రాఫర్ కెయు మోహనన్ కుమార్తె అయిన మాళవిక తొలిసారిగా 2013లో మలయాళంలో రూపొందిన పట్టం పోలె సినిమా ద్వారా చిత్ర సీమకు నటిగా ఎంట్రీ ఇచ్చారు. 

ఆ సినిమాతో మంచి పేరు సొంతం చేసుకున్న మాళవిక మోహనన్, అనంతరం మలయాళంలోనే నిర్ణయకం అనే మూవీ చేసారు. ఇది కూడా ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది. ఆ తరువాత కన్నడలో నన్ను మట్టు వరలక్ష్మి సినిమాలో నటించారు. ఆ విధంగా అటు కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా బాగా పేరు అందుకున్నారు మాళవిక. 

మలవిక మోహనన్ తాజా వైట్ చీర లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది

ఆ తరువాత అటు బాలీవుడ్ (Bollywood) లోకి ఎంట్రీ ఇచ్చి బియాండ్ ది క్లౌడ్స్ సినిమా చేసారు. ఆ విధంగా అటు హిందీలో కూడా ఆకట్టుకున్నారు ఆమె. ఇక 2021లో యువ దర్శకుడు లోకేష్ కానగరాజ్ (Lokesh Kanagaraj) తీసిన మాస్టర్ (Master) సినిమాలో ఆమె ఏకంగా కోలీవుడ్ స్టార్ నటుడు ఇలయదళపతి విజయ్ (Vijay) కి జోడీగా నటించి అలరించారు. 

ఆ మూవీ యొక్క పెద్ద సక్సెస్ తమిళ్ లో కూడా మాళవికకి బాగా గుర్తింపుని తీసుకువచ్చింది. అక్కడి నుండి అటు తమిళ్ తో పాటు హిందీలో కూడా సినిమాలు చేస్తూ కొనసాగుతున్నారు. ఇక తాజాగా తెలుగులో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న  ది రాజా సాబ్ (The Rajasaab) మూవీలో ఆమె ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు. 

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈమూవీ పై ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్సు లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎప్పటినుండో తెలుగు సినిమా అవకాశం కోసం చూస్తున్న ఆమెకు ఏకంగా పాన్ ఇండియన్ సాసర్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా అవకాశం రావడంతో ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఫోటోషూట్ లో మలవిక గ్లామర్ కిరణాలు చిందించింది

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తున్న ది రాజా సాబ్ మూవీ ఈ ఏడాది ఆడియన్సు ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. అలానె అటు తమిళ్ లో కార్తీ హీరోగా తెరకెక్కుతున్న సర్దార్ పార్ట్ 2 (Sardaar 2) మూవీలో కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు మాళవిక మోహనన్. ఇక ఇటీవల ఆమె మాట్లాడుతూ, తెలుగులో దాదాపుగా అందరు నటుల సరసన నటించాలనే కోరికని తెలిపారు. 

అయితే తెలుగులో ఎక్కువగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ వస్తే ఏమాత్రం వదులుకోబోనని చెప్పుకొచ్చారు మాళవిక. ఇక మొదటి నుండి కూడా ఇతర నటీనటుల మాదిరిగా మాళవిక కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్, ఆడియన్స్ తో ఎంతో ఇంటరాక్ట్ అవుతూ తన సినిమా, వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. 

అలానే తన ఫోటోషూట్ తాలూకు ఫోటోలని కూడా మాళవిక తన ఇన్స్టాగ్రామ్ (Instagram), ట్విట్టర్ (Twitter) మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే విషయం ఏమిటంటే, తాజాగా కేరళని ఎక్స్ ప్లోర్ చేస్తూ అందులో భాగంగా వైట్ శారీతో చిన్న బోటు పై వెళ్తున్న ఫోటోలని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. 

ఈ ఫోటోషూట్ వెనక ఉన్న ప్రత్యేకత మీకు తెలుసా?

ముఖ్యంగా కేరళ అందాలు ఎంత చూసిన తనివితీరవని, అక్కడి బోట్ మీద షికారు చేస్తూ, అలానే పలు దర్శనీయ ప్రదేశాలు కూడా చూస్తూ గడపడం ఎంతో ఆనందంగా ఉందని తన పోస్ట్ లో తెలిపారు మాళవిక మోహనన్. మొత్తంగా మాళవిక పోస్ట్ చేసిన ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి నటిగా కెరీర్ పరంగా మాళవిక రాబోయే రోజుల్లో మరిన్ని సక్సెస్ లు సొంతం చేసుకోవాలని మా Telugu Movie Media సైట్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమెకు శుభాభినందనలు తెలియచేస్తున్నాం. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow