Retro Movie Review (2025): Suriya Shines in a Stylish Gangster Drama
Read the full Telugu review of 'Retro' (2025), starring Suriya in a gritty gangster role under Karthik Subbaraj's direction. A complete analysis of performances, music, and visuals.

సినిమా పేరు : రెట్రో (Retro)
విడుదల తేదీ : 1 మే 2025
నటీనటులు : సూర్య శివ కుమార్, పూజా హెగ్డే, జయరాం, జాజు జార్జి, ప్రకాష్ రాజ్,శ్రియ శరన్
దర్శకుడు : కార్తీక్ సుబ్బరాజ్
నిర్మాతలు : సూర్య, జ్యోతిక, కార్తికేయన్ సంతానం
సంగీతం : సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ : శ్రేయాస్ కృష్ణ
రేటింగ్ : 3. 5 / 5
రెట్రో మూవీ సమీక్ష: సూర్య కొత్త గ్యాంగ్‌స్టర్ అవతారంలో మెప్పించాడు
కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య శివకుమార్ హీరోగా అందాల కథానాయిక పూజా హెగ్డే హీరోయిన్ గా యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ లవ్ డ్రామా మూవీ రెట్రో. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఈ మూవీని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ గ్రాండ్ గా రిలీజ్ చేసింది. మరి ఈ మూవీ ఎలా ఉందనేది మొత్తంగా కూడా పూర్తి రివ్యూలో చూద్దాం.
కథ :
1993 సమయంలో జరిగే ఈ కథలో చిన్నప్పుడే తన తల్లితండ్రుల నుండి వేరైన పారివేల్ కణ్ణన్ (Suriya) పెద్ద గ్యాంగ్ స్టర్ అయిన తిలక్ రాజ్ (Joju George) కి దొరుకుతాడు. అయితే తన భార్య కోరిక మేర పారిని పెంచుకుంటారు కానీ మొదటి నుండి అతడు అంటే తిలక్ రాజ్ కి ఇష్టం ఉండదు. అనంతరం పెరిగి పెద్దైన పారికి రుక్మిణి (Pooja Hegde) తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతుంది.
ఆ తరువాత అతడి కోపం, చిరునవ్వు వంటివి తన జీవితాన్ని ఏవిధంగా మార్చేశాయి. అసలు పారి తల్లితండ్రులు ఎవరు, అతడు ఏ ప్రాంతానికి చెందిన వాడు. అలానే అండమాన్ దీవిలో ప్రజలని బానిసలుగా చేసుకుని అరాచకపాలన చేస్తున్న దొరలూ రాజ్ వెల్, అతడి కొడుకు మైఖేల్ ఎవరు, వారి వద్దకు పారి ఎందుకు వెళ్ళాడు. వీటితో పాటు రాజ్ తిలకు కోరుకుంటున్న గోల్డ్ ఫిష్ కి పారికి ఉన్న సంబంధం ఏంటి అనే అంశాలు మొత్తం కూడా వెండితెరపై చోడాల్సిందే.
కథ, కథన నిర్మాణం – 90ల గ్యాంగ్ స్టైల్‌కు న్యాయం చేశారా?
ప్లస్ పాయింట్స్ :
ముందుగా ఈ మూవీలో పారివేల్ కణ్ణన్ పాత్రలో సూర్య నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సందర్భం మరియు సీన్స్ ని బట్టి పలు వేరియేషన్స్ లో ఆయన నటన అద్భుతం. ఇక తన పాత్ర యొక్క పరిధి మేరకు నాచురల్ గా హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఎంతో ఆకట్టుకుంటుంది. అలానే మేకర్స్ సినిమా టైటిల్ ప్రకటించిన సమయంలో దీనికి ఉప శీర్షికగా లవ్, లాఫ్టర్, వార్ అనే అంశాలు ఫస్ట్ హాఫ్ లో బాగా చూపించారు.
కథనం మొత్తం ఫస్ట్ హాఫ్ ఆకట్టుకుంటుంది. ఇక మలయాళ నటులు జాజు జార్జి, జయరాం కూడా విభిన్న పాత్రల్లో ఆకట్టుకునే నటన కనబరిచారు. నెగటివ్ పాత్ర చేసిన యువ నటుడు విదు కూడా అలరించాడు. దర్శకడు ఎంచుకున్న పాయింట్ తో ఫస్ట్ హాఫ్ లోని సింగిల్ టేక్ సీన్ బాగా వచ్చింది. ఓవరాల్ గా సెకండ్ హాఫ్ తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ ఆడియన్స్ ని సూర్య ఫ్యాన్స్ ని ఎంతో మెప్పిస్తుంది.
మైనస్ పాయింట్స్ :
గతంలో మాదిరిగా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రెట్రో మూవీ యొక్క సెకండ్ హాఫ్ విషయంలో చాలావరకు తడబడ్డాడు అని చెప్పకతప్పదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ఆకట్టుకునేలా సాగిన ఈ మూవీ సెకండ్ హాఫ్ లో కథ ఎటెటో వెళ్తున్నట్లు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో చాలావరకు సీన్స్ లో సూర్య నటన బాగున్నా సీన్స్ ఏమాత్రం మనకు కనెక్ట్ కావు సరికదా చాలా నార్మల్ గా అనిపిస్తాయి.
అలానే గత సినిమాల్లో చూసినట్లు అనిపిస్తాయి. మధ్యలో కొన్ని యాక్షన్ సీన్స్, ఫైట్స్ బాగున్నాయి. సూర్య ఫ్యాన్స్ కి అవి నచ్చుతాయి. అయితే ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అనంతరం మళ్ళి మూవీ పుంజుకుంటుంది. ఊహించే విధంగా సాగే కథనంతో పాటు క్లైమాక్స్ కూడా నార్మల్ గా ఉంటుంది, అది చాలా డ్రాబ్యాక్ అని చెప్పాలి. ముఖ్యంగా విలన్స్ ని ఎంతో పవర్ఫుల్ గా చూపించి వారు చివర్లో ఒక్కసారిగా మారి లొంగిపోయిన విధానం అంతగా ఎఫెక్టివ్ గా అనిపించదు.
సాంకేతిక విభాగాలు – సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విశ్లేషణ
సాంకేతిక వర్గం :
ముఖ్యంగా ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సాంగ్స్ తో పాటు కీలక సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అలరించే విధంగా ఇచ్చారు. ఫోటోగ్రఫి అందించిన శ్రేయాస్ కృష్ణ తెరకెక్కించిన తీరు ఆడియన్స్ ని అలరిస్తుంది. పలు సీన్స్ విజువల్ గా రిచ్ గా అనిపిస్తాయి. అయితే ఎడిటింగ్ విభాగం వారు మాత్రం మరింత శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేదనిపిస్తుంది.
వాస్తవానికి దర్శస్కుడు కార్తీక్ సుబ్బరాజ్ తీసుకున్న పాయింట్ బాగున్నప్పటికీ ఫస్ట్ హాఫ్ అలరించిన మూవీ సెకండ్ హాఫ్ చాలా వరకు చప్పగా సాగుతుంది. అయితే ప్రీ క్లైమాక్స్ అంశం ఆకట్టుకున్న క్లైమాక్స్ తో పాటు విలన్స్ చివరి సీన్స్ కూడా నార్మల్ గా అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే ఆయన మరింత ఇంట్రెస్టింగ్ గా సాగెలా రాసుకుని ఉండాల్సింది.
తీర్పు :
కాగా మొత్తంగా చెప్పాలి అంటే సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన లేటెస్ట్ లవ్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ రెట్రో సూర్య ఫ్యాన్స్ కి నచ్చుతుంది. కానీ నార్మల్ ఆడియన్స్ కి మాత్రం యావరేజ్ మూవీ అని చెప్పవచ్చు.
దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఫస్ట్ హాఫ్ కథనాన్ని ఆకట్టుకునే రీతిన నడిపిన విధంగా సెకండ్ హాఫ్ ని తీసుకెళ్లలేదు. సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్, విజువల్స్, యాక్షన్ సీన్స్ అయితే బాగున్నాయి. ఓవరాల్ గా మంచి గ్యాంగ్ స్టర్ మూవీస్ కోరుకునే వారికి అయితే ఈ మూవీ ఒక లుక్ వేయవచ్చు.
What's Your Reaction?






