Sreemukhi Instagram Photos – Glamorous New Pics Viral
Sreemukhi's latest Instagram photos are going viral! See her new glamorous looks, stylish outfits, and trending pics shared on social media

తెలుగు పరిశ్రమలో ప్రస్తుతం అటు బుల్లితెరపై అలానే ఇటు వెండితెర పై మంచి నటిగా క్రేజీ యాంకర్ గా దూసుకెళ్తున్నారు శ్రీముఖి (Sreemukhi). మొదటి నుండి తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఎందరో ఫ్యాన్స్ ని సంపాదించిన శ్రీముఖి 10 మే 1993లో నిజామాబాద్ లో జన్మించారు.
Sreemukhi Instagram latest photos
తన చదువుల అనంతరం తొలిసారిగా టివి షో అదుర్స్ కి యాంకర్ గా పని చేసిన ఆమె అప్పటి నుండి తన యాక్టింగ్ టాలెంట్ తో అందరినీ అలరించారు. ఆ తరువాత సూపర్ సింగర్ 9 ప్రోగ్రాం కి హోస్ట్ గా పని చేసిన శ్రీముఖి మెల్లగా మంచి పేరు సొంతం చేసుకున్నారు.
శ్రీముఖి తాజా ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలు వైరల్
ఆపైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆకాం స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇలియానా హీరోయిన్ గా రూపొందిన యాక్షన్ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ జులాయిలో ఆమె హీరోకి చెల్లిగా రాజీ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. అలానే ప్రేమ ఇష్క్ కాదల్ మూవీలో మెయిన్ లీడ్ గా నటించారు.
Sreemukhi saree look Instagram
అనంతరం రామ్ పోతినేని హీరోగా కిశోర్ తిరుమల తీసిన నేను శైలజ మూవీలో హీరో రామ్ చెల్లెలిగా స్వేచ్ఛ పాత్రలో నటించారు. కీర్తి సురేష్ తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయిన ఆ మూవీ విజయం ఆమెకు మరింత మంచి పేరు తీసుకువచ్చింది. ఆ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అందరూ కొత్తవాళ్లతో రూపొందిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో చిన్న క్యామియో పాత్రలో మెరిశారు శ్రీముఖి.
స్టైలిష్ డ్రెస్‌లలో గ్లామర్ ఫోటోషూట్
నారా రోహిత్ హీరోగా రూపొందిన సావిత్రి తో పాటు ధనలక్ష్మి తలుపు తడితే సినిమాల్లో ఆమె ప్రధాన పాత్ర చేసి తెలుగు ఆడియన్స్ ని మెప్పించారు. అటు తమిళ్ లో కూడా ఒక మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి, ఆపైన కన్నడ తెలుగు బైలెంగ్యువల్ మూవీ చంద్రిక ద్వారా కన్నడ చిత్ర పరిశ్రమలోకి కూడా ఎంట్రీ ఇచ్చి అలరించారు.
Sreemukhi trending reels
2015లో దుబాయ్ లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ SIIMA వేడుకకి కో హోస్ట్ గా వ్యవహరించారు. ఆ తరువాత ఈటివి ప్లస్ లో ప్రసారం అయిన పటాస్ తో పాటు స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయిన భలే ఛాన్స్ లే షోస్ కి కూడా హోస్ట్ గా వ్యవహరించి మరింత మంచి పేరు సొంతం చేసుకున్నారు.
అలానే నాని హీరోగా ఇంద్రగంటి మోహన కృష్ణ తీసిన జెంటిల్ మ్యాన్ మోవి లో కూడా ఒక పాత్ర చేసారు శ్రీముఖి. ఇక 2019లో బిగ్ బాస్ సీజన్ 3 లో ఒక కాంటెస్ట్ గా అడుగుపెట్టి ఫైనల్ గా రన్నర్ గా నిలిచారు శ్రీముఖి. 2021లో తెరకెక్కిన క్రేజీ అంకుల్స్ మూవీలో ఆమె ప్రధాన పాత్ర చేసి ఆకట్టుకున్నారు. ఆ మూవీలో ఆమె నటనకు మంచి రివ్యూస్ లభించాయి.
అభిమానుల రెస్పాన్స్, కామెంట్లు, లైక్స్ డీటెయిల్స్
ఇక ఇటీవల నితిన్ హీరోగా రూపొందిన మాస్ట్రో తో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ తీసిన బోళా శంకర్ మూవీలో కూడా ఒక కీలక పాత్ర చేసి అలరించారు శ్రీముఖి. ఇక ప్రస్తుతం ఆ విధంగా టు పలు టివి షోస్ తో పాటు మరోవైపు అక్కడక్కడా పలు సినిమాలతో కూడా కెరీర్ పరంగా ఎంతో బిజీగ కొనసాగుతున్న శ్రీముఖి తరచు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు.
Anchor Sreemukhi new photoshoot
ముఖ్యంగా సోషల్ మీడియా మాద్యమాలైన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటిలో ఖాతాలని కల్గిన శ్రీముఖి ఎప్పటికప్పుడు తన షోస్, సినిమాలు, వ్యక్తిగత విషయాలు అందరితో పంచుకుంటూ ఉంటారు. అలానే తరచు తాను దిగేటువంటి లేటెస్ట్ ట్రెండీ స్టైల్ ఫోటోషూట్ ఫొటోస్ ని కూడా అందులో పోస్ట్ చేస్తుంటారు శ్రీముఖి.
మొత్తంగా నటిగా అటు వెండితెర, ఇటు బుల్లితెరపై అందరి నుండి మంచి క్రేజ్, పేరుతో కొనసాగుతున్న శ్రీముఖి కష్టాన్ని నమ్మి ఇష్టంతో పనిచేస్తే ఎప్పటికైనా పైకి వస్తాం అని చెప్తుంటారు. మరి నటిగా యాంకర్ గా శ్రీముఖి రాబోయే రోజుల్లో మరింత మంచి పేరు సొంతం చేసుకుని కెరీర్ పరంగా దూసుకెళ్లాలని మా టీమ్ కోరుకుంటూ ఆమెకు శుభాభినందనలు తెలుపుతోంది.
What's Your Reaction?






