SSMB29 Latest Interesting Update about Next Schedule

SSMB29, the highly anticipated Mahesh Babu & SS Rajamouli movie, is set to be a global blockbuster! Get the latest updates on release date, cast, story, and more.

SSMB29 Latest Interesting Update about Next Schedule

టాలీవుడ్ స్టార్ యాక్టర్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తాజాగా ప్రముఖ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ SSMB29. ఈ మూవీ పై ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరిలో ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. 

SSMB29 Movie: What to Expect from Mahesh Babu & SS Rajamouli

ఈ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా ఆస్కార్ అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. వి విజయేంద్ర ప్రసాద్ కథ ని అందిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అలానే మలయాళ దర్శకుడు, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు చేస్తున్నారు. 

కాగా వారిద్దరూ ఈ మూవీలో నెగటివ్ రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు ఈ మూవీ కోసం ప్రత్యేకంగా ఫుల్ గా క్రాఫ్ తో పాటు గడ్డం, ఫుల్ బాడీ కూడా పెంచారు. లోకం చుట్టే వీరుడిగా అడ్వెంచర్ అంశాలతో రూపొందుతున్న ఈ మూవీ యొక్క అధికారిక పూజా కార్యక్రమాలు జనవరి 2న అధికారికంగా జరిగాయి. 

SSMB29 Release Date & Shooting Updates

అనంతరం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫాక్టరీ లో దీని ఫస్ట్ షెడ్యూల్ జరిగింది. అక్కడ పూర్తి అయిన అనంతరం సెకండ్ షెడ్యూల్ ని ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలోని కీలక ప్రాంతాల్లో చిత్రీకరించారు. కాగా నిన్నటితో ఆ షెడ్యూల్ కూడా పూర్తి అయింది. కొద్దిసేపటి క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళి సహా SSMB 29 టీమ్ మొత్తం హైదరాబాద్ చేరుకుంది. 

మరొక పదిరోజుల్లోపు ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్టింగ్ లో జరుగనుందట. కాగా ఈ షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుందట. మహేష్ తో పాటు ప్రధాన తారాగణం అందరూ పాల్గొననున్న ఈ షెడ్యూల్ ని కూడా వేగంగా పూర్తి చేసి ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా, కెన్యా, బల్గెరియా వంటి దేశాల్లో మరికొన్ని కీలక షెడ్యూల్స్ ఉంటాయట. 

పలువురు హాలీవుడ్ నటులు కూడా ఇందులో భాగం కానున్నారని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడవుతాయని అంటున్నారు. మరోవైపు ఈ ప్రతిష్టాత్మక మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ ని మార్చి 30న తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ఉంటుందని కూడా అంటున్నారు. 

SSMB29 Latest News & Social Media Buzz

లేదా అది మిస్ అయితే సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారి జయంతి రోజైన మే 31న ఉంటుందని టాక్. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఈమూవీ తెరకెక్కుతోందని, అలానే మైథలాజి టచ్ కూడా ఈ మూవీలో ఉంటుందని అంటున్నారు. మహేష్ బాబు ఈ మూవీలో తన పాత్ర తో అందరినీ ఆకట్టుకోవడంతో పాటు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి మరొక్కసారి తన అద్భుత దర్శకత్వ ప్రతిభని అందరికీ నిరూపణ చేయనున్నారట. 

మొత్తంగా షూటింగ్ తో పాటు వెంటనే విజువల్ ఎఫెక్ట్స్ వర్క్, ఆపైన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ భారీ మూవీ యొక్క విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయని, వరల్డ్ వైడ్ గా ప్రసిద్దిగాంచిన ఒక ప్రముఖ సంస్థ దీని యొక్క విజువల్స్ ని అద్భుతంగా రూపొందించేందుకు ఇప్పటికే జక్కన్న ఒప్పందం చేసుకున్నారట. 

Mahesh Babu’s Role in SSMB29

ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ గా దర్శకుడిగా పెద్ద పేరు సొంతం చేసుకున్న రాజమౌళి ఈ మూవీతో హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇమేజ్ ని ఆకాశం అంత ఎత్తుకి తీసుకెళ్లడంతో పాటు హాలీవుడ్ ఆడియన్స్ ని కూడా మరింత ఆకట్టుకుంటారని అంటోంది టీమ్. కాగా అన్ని కార్యక్రమాలు ముగించి ఈ మూవీని 2027 సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేస్తారట, అలానే రిలీజ్ విషయంలో కూడా ఈసారి వాయిదా పడదట. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఎంతమేర బాక్సాఫీస్ సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి.  

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow