Brahmanandam Comedy Scenes, Age & Movie List
Explore Brahmanandam’s legendary comedy, his current age, and a list of iconic Telugu movies that made him the king of laughter in Tollywood

టాలీవుడ్ (Tollywood) సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు అనేకమంది కామెడియన్స్ వచ్చారు, తమ హాస్యపు జల్లులతో మనల్ని అలరించి అందులో కొందరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇంకొందరు మనల్ని ఇంకా నవ్విస్తూనే ఉన్నారు. అటువంటి అరుదైన టాలీవుడ్ కమెడియన్స్ లో బ్రహ్మానందం ఒకరు అనేది అందరికీ తెలిసిందే.
ముఖ్యంగా తెలుగు సినిమాల్లో దాదాపుగా మూడు దశాబ్దాలకు పైగా ఎన్నో వందల సినిమాలు చేసిన బ్రహ్మానందం తన కామెడీతో మనల్ని అందరినీ కడుపుబ్బా నవ్వించారు. అయితే ఇటీవల అనారోగ్యం కారణంగా ఆయనకు హృదయ శస్త్ర చికిత్స జరుగడంతో ఎంతో సెలెక్టివ్ గా మాత్రమే ఆయన సినిమాలు చేస్తున్నారు.
బ్రహ్మానందం కామెడీ జోక్స్, వయస్సు మరియు సినిమాల జాబితా
ఇక తొలిసారిగా బ్రహ్మానందాన్ని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమా పరిశ్రమకు నటుడిగా పరిచయం చేసారు. 1956 ఫిబ్రవరి 1 న సత్తెనపల్లి లోని చాగంటి వారి పాలంలో జన్మించారు. అటు కెరీర్ పరంగా లెక్చరర్ గా పనిచేసిన బ్రహ్మానందం మరోవైపు పలు స్టేజ్ నాటకాల్లో కూడా పాల్గొని మంచి పేరు సొంతం చేసుకున్నారు.
ఇక అత్తిలిలో లెక్చరర్ గా పనిచేస్తున్న సమయంలో ఆయన హాస్యపు వ్యాఖ్యలు మెచ్చిన మెగాస్టార్ చిరంజీవి, ఆయన అనంతరం హైదరాబాద్ తీసుకువచ్చి దర్శకుడు జంధ్యాలకు పరిచయం చేసారు. తొలిసారిగా జంధ్యాల దర్శకత్వంలో బ్రహ్మానందం చేసిన మూవీ అహ నా పెళ్ళంట.
Brahmanandam Biography
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, రజిని హీరో హీరోయిన్స్ గా రూపొందిన ఈమూవీలో అరగుండు బ్రహ్మానందంగా ఆయన పోషించిన పాత్ర అందరినీ ఎంతో ఆకట్టుకోవడంతో పాటు విపరీతంగా నవ్వులు పూయించింది. పరమ బోరింగ్ మొహం, పోతావ్ రారేయ్ నాశనమైపోతావ్ అంటూ హాస్యపు జల్లులతో ఆయన పలికిన డైలాగ్స్ ఇప్పటికీ ఎప్పటికీ మన మదిలో గుర్తుండిపోతాయి.
కోట శ్రీనివాస రావు ప్రధాన పాత్ర చేసిన ఆ సినిమా అప్పట్లో పెద్ద విజయం అందుకోవడంతో పాటు నటుడిగా బ్రహ్మానందానికి మంచి పేరు తీసుకువచ్చింది. ఇక ఆ విధంగా తన సినిమా ప్రయాణాన్ని ప్రారంభించి అక్కడి నుండి మెల్లగా తనకు వచ్చిన అవకాశాలు అన్ని కూడా అందిపుచ్చుకుని ముందుకి సాగారు బ్రహ్మానందం.
తెలుగులో బ్రహ్మానందం కామెడీ పాఠాలు – శ్రేష్టమైన సన్నివేశాలు
ముఖ్యంగా రాను రాను కామెడీ లో ఒకప్పటి దిగ్గజ కమెడియన్స్ అయిన రాజబాబు, రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం ల మాదిరిగా తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకుని ఆడియన్స్ లో విశేషమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు బ్రహ్మానందం. నాటి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ దగ్గరి నుండి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు దాదాపుగా అందరు స్టార్స్ తో పాటు చిన్న నటులతో సైతం నటించిన ఘనత బ్రహ్మానందం గారిది.
ఆ విధంగా కెరీర్ పరంగా వేయికి పైగా సినిమాల్లో కామెడీ పాత్రలు చేసి మనల్ని అలరించిన బ్రహ్మానందం కెరీర్ లో ఎన్నో ఎన్నెన్నో ఆయనకు గుర్తింపు తెచ్చిన పాత్రలు ఉన్నాయి. నిజానికి తాను పోషించిన ప్రతి ఒక్క పాత్ర తనకు ఎంతో ఇష్టం అని, అందరు దర్శకులు, నటీనటులతో తనకు ఎంతో మంచి ర్యాపో ఉండడంతో పాటు అందరూ తనని ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారని చెప్తారు బ్రహ్మానందం.
Brahmanandam Movie
అయితే 90వ దశకంలో బ్రహ్మానందం లేని సినిమా దాదాపుగా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఆ విధంగా రెండు దశాబ్దాల పాటు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో తిరుగులేని స్టార్ కమెడియన్ గా ఆయన ఎంతో గొప్పగా దూసుకెళ్లారు. వాస్తవానికి తనతో పాటు వచ్చిన మరికొందరు కమెడియన్స్ సైతం ఎంతో మంచి పేరు, గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ బ్రహ్మానందం ఆడియన్స్ మనసులో సంపాదించిన ప్రత్యేక స్థానం వేరు.
బ్రహ్మానందం వయస్సు మరియు అతని కెరీర్లో ముఖ్యమైన సినిమాలు
అది ఎంతలా అంటే అప్పట్లో స్టార్ హీరో హీరోయిన్స్ తో పాటు స్క్రీన్ పై బ్రహ్మానందం కనపడితే జాలు అనేకమంది ఫ్యాన్స్, ఆడియన్స్ విజిల్స్ తో థియేటర్స్ హోరెత్తించేవారు. ఆ విధంగా తన హాస్యంతో అలరించారు బ్రహ్మానందం. ఇక ఇటీవల భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు సొంతం చేసుకున్న బ్రహ్మానందం, అత్యధిక సినిమాల్లో నటించిన నటుడిగా ఏకంగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ సొంతం చేసుకున్నారు.
అలానే కెరీర్ పరంగా అనేక అవార్డులు ఆయనకు లభించాయి. కొన్నాళ్ల క్రితం కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రంగమార్తాండ మూవీలో బ్రహ్మానందం ఒక హృద్యమైన పాత్రని పోషించి, తన అద్భుత నటనా కౌశలంతో ఆడియన్స్ కంట కన్నీరు తెప్పించి మెప్పించారు.
Brahmandam Age
తాజాగా తన కుమారుడు రాజా గౌతమ్ హీరోగా రూపొందిన బ్రహ్మ ఆనందం మూవీలో ఆయనకు తాతయ్య పాత్ర చేసి అలరించారు. ఇక ప్రస్తుతం బ్రహ్మానందం చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. అయితే మంచి ఆకట్టుకునే కామెడీ పాత్రలని ఎంచుకుంటూ ఆయన కొనసాగుతున్నారు. మరి నటుడిగా బ్రహ్మానందం మరింతగా ముందుకు సాగాలని, అలానే ఆయన మరింత ఆరోగ్యంతో ఆనందంగా జీవించి మనకు మరిన్ని నవ్వులు పంచాలని మా Telugu Movie Media మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
What's Your Reaction?






