Rajinikanth Coolie Movie Shooting Completed – Latest Update

Rajinikanth's Coolie movie shooting is officially completed! Get the latest updates on the release date, cast, and more. Stay tuned for exciting details.

Rajinikanth Coolie Movie Shooting Completed – Latest Update

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇటీవల నెల్సన్ దిలీప్ కుమార్ తీసిన జైలర్ మూవీ పెద్ద విజయం సొంతం చేసుకుంది. తమన్నా, సునీల్, రమ్యకృష్ణ, వినాయకన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీలో మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్, కన్నడ స్టార్ యాక్టర్ శివ రాజ్ కుమార్ క్యామియో పాత్రల్లో నటించారు. 

Rajinikanth’s Coolie Release Date and Latest Details

త్వరలో దీనికి సీక్వెల్ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే జైలర్ భారీ విజయం అనంతరం టీజె జ్ఞానవేల్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన మూవీ వేట్టయాన్. ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలా పాత్రలో కనిపించారు. అయితే మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈమూవీ కూడా బాగానే సక్సెస్ సొంతం చేసుకుంది. 

ఇక ఈ రెండు సినిమాల అనంతరం తాజాగా కోలీవుడ్ యువ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో రజినీకాంత్ చేస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కూలీ. ఈ మూవీలో అందాల కథానాయిక శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో కింగ్ అక్కినేని నాగార్జున, కన్నడ స్టార్ నటుడు కం దర్శకుడు అయిన ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా క్యామియో పాత్రలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అమీర్ ఖాన్ కనిపించనున్నారు. 

Rajinikanth’s Coolie Movie Wraps Up Filming

యువ రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ పై సుభాస్కరన్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇటీవల కూలీ నుండి రిలీజ్ అయిన అనౌన్స్ మెంట్ గ్లింప్స్ టీజర్ తో పాటు ఫస్ట్ సాంగ్ కూడా అందరినీ ఆకట్టుకుని మూవీ పై బాగానే అంచనాలు ఏర్పరిచింది. 

ఇక ఈ మూవీలో సూపర్ స్టార్ పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉండడంతో పాటు ఆయన ఫ్యాన్స్ ని మాత్రమే కాదు నార్మల్ ఆడియన్స్ ని సైతం ఎంతో ఆకట్టుకుంటుందని టాక్. గత ఏడాది జూన్ చివర్లో ప్రారంభం అయిన కూలీ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ నిన్నటితో మొత్తంగా కంప్లీట్ అయింది. కాగా ఈ విషయాన్ని స్వయంగా మూవీ టీమ్ అనౌన్స్ చేసింది. 

వాస్తవానికి కూలీ మూవీ ఆగష్టు మధ్యలో రిలీజ్ అవుతుందని అందరూ భావించారు. అయితే అదే సమయానికి బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ యాక్టర్ ఎన్టీఆర్ ల కలయికలో యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న భారీ ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీ వార్ 2 రిలీజ్ ఫిక్స్ అవడంతో కూలీ టీమ్ తమ మూవీని మరికొన్నాళ్లు పాటు వాయిదా వేసినట్లు లేటెస్ట్ కోలీవుడ్ బజ్. 

Coolie Movie Release Date, Cast & Updates

అయితే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుపుకుంటున్న తమ మూవీ నుండి త్వరలో ఒక్కొక్కటిగా అప్ డేట్ అందించి, ఆతరువాత న్యూ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయాలనేది కూలీ మూవీ మేకర్స్ యొక్క ఆలోచన అట. ముఖ్యంగా ఈ మూవీలో తన అభిమాన సూపర్ స్టార్ ని దర్శకుడు లోకేష్ కనకరాజ్ అద్భుతంగా చూపిస్తున్నారని, మాస్ యాక్షన్ అంశాలతో పాటు డైలాగ్స్, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి అదిరిపోనున్నట్లు చెప్తున్నారు. మరి అందరిలో ఎంతో హైప్ ఏర్పరిచిన కూలీ మూవీ రిలీజ్ అనంతరం ఎంతమేర సక్సెస్ సాధిస్తుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow