Allu Arjun and Atlee’s Film Confirmed! Exciting Details Inside

Allu Arjun joins hands with director Atlee for a high-budget film. Get the latest details on story, music, and production updates!

Allu Arjun and Atlee’s Film Confirmed! Exciting Details Inside

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తాజాగా రిలీజ్ అయిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా సుకుమార్ దీనిని గ్రాండ్ గా తెరకెక్కించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పుష్ప 2 మూవీ 2024 డిసెంబర్ 5న గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ అయి పెద్ద విజయం సొంతం చేసుకున సంగతి తెలిసిందే. 

Allu Arjun and Atlee’s Big-Budget Film Confirmed

ఈ మూవీలో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ అద్భుత నటనకు అందరి నుండి మంచి ప్రసంశలు కురిసాయి. గతంలో పుష్ప 1 మూవీలో తన పాత్రలో సహజ నటన కనబరిచిన అల్లు అర్జున్ కు ఏకంగా భారత దేశ ప్రభుత్వం నుండి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు లభించింది. ఇక పుష్ప 2 లో ఆయన యాక్టింగ్ కి మరొక్కసారి పలు అవార్డులు లభించే అవకాశం కనపడుతోంది. 

రావు రమేష్, ఫహాద్ ఫాసిల్, బ్రహ్మాజీ, అనసూయ, సునీల్,  జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు చేసిన పుష్ప 2 ది రూల్ మూవీ రిలీజ్ అనంతరం వరల్డ్ వైడ్ గా రూ. 1800 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుని హీరోగా అల్లు అర్జున్ రేంజ్ తో పాటు మార్కెట్ వేల్యూ కూడా విపరీతంగా పెంచేసింది. అయితే దీని తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ చేయాల్సి ఉంది. 

Fans Excited for This Power-Packed Collaboration

ఈ మూవీని గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంస్థల పై అల్లు అరవింద్, సూర్యదేవర రాధాకృష్ణ గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్నారు. ఎంతో భారీ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందనుందని, అలానే ఈ కథ ఒకింత మైథలాజి టచ్ తో ఉంటుందని అలానే ఇండియాల ఎవరూ కూడా టచ్ చేయని పాయింట్ తో దర్శకుడు త్రివిక్రమ్ ఈ మూవీని అత్యంత గ్రాండ్ గా నిర్మించేందుకు ప్రస్తుతం కథ, కథనాల పై కసరత్తు చేస్తున్నట్లు ఇటీవల నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ చెప్పారు. 

దానితో కొన్నాళ్ల పాటు ఆ మూవీని ప్రక్కన పెట్టిన అల్లు అర్జున్ తాజాగా అట్లీ తో ఒక భారీ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ చేసందుకు సిద్ధమయ్యారు. ఈ మూవీ దాదాపుగా రూ. 600 కోట్ల వ్యయంతో రూపొందనుండగా దీనిలో బాలీవుడ్ అందాలా నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గానటించనున్నారు. 

అలానే తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు ఈ మూవీని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తతం ఈ మూవీకి సంబందించిన రెమ్యునరేషన్స్ విషయంలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో జవాన్ మూవీ తెరకెక్కించి అతి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్నారు అట్లీ. 

Speculations on Genre and Storyline

ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది. ప్రస్తుతం కథా చర్చలు జరుపుకుంటున్న ఈ మూవీ గురించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయట. ఈ మూవీలో అల్లు అర్జున్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని, అలానే తమిళ యువ సంగీత దర్శకుడు అభ్యంకర్ దీనికి సంగీతం సమకూర్చనున్నట్లు చెప్తున్నారు. 

Possible Shooting Schedule and Release Plans

వాస్తవానికి ఈ మూవీ కోసం అనిరుద్ ని తీసుకోవాలని భావించారు. అయితే ప్రస్తుతం వరుసగా ప్రాజక్ట్స్ తో అనిరుద్ బిజీగా ఉండడంతో అతడి స్థానంలోకి అభ్యంకర్ వచ్చాడు. మరి ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించిన మరిన్ని వివరాలు తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow