Saiyaara Movie Review Telugu – A Raw Emotional Drama That Surprises
Saiyaara Telugu movie delivers a gripping emotional drama with solid performances and unexpected twists. Read full review, rating & highlights now.

సయ్యారా (Saiyaara) మూవీ రివ్యూ : హృద్యమైన ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్
సినిమా పేరు : Saiyaara
రేటింగ్ : 3. 5 / 5
విడుదల తేదీ : 2025 జులై 18
నటీనటులు : అహాన్ పాండే, అనీత్ పడ్డా తదితరులు
దర్శకుడు : మోహిత్ సూరి
నిర్మాత : అక్షయ్ విధాని
సంగీత దర్శకులు : సచేత్ పరంపర, మిథూన్, రిషబ్ కాంత్, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్చీ, ఫహీమ్ అబ్దుల్లా, అర్స్లాన్ నిజామి
ఫోటోగ్రఫీ : వికాస్ శివారామన్
సయ్యారా సినిమా సమీక్ష – మనసును తాకే ఎమోషనల్ డ్రామా
బాలీవుడ్ లో లవ్ యాక్షన్ ఎమోషనల్ సినిమాల దర్శకుడు మోహిత్ సూరి దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ సయ్యారా. అహాన్ పాండే, అనీత్ పడ్డా హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ మూవీ నిన్న గ్రాండ్ గా బాలీవుడ్ ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి ఈ మూవీ యొక్క పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం.
కథ :
అంతకముందు ప్రేమలో పడి విఫలం అయిన వాణి బత్రా (Aneet Padda) ఆ ఘటనతో డిప్రెషన్ లోకి వెళ్తుంది. మరోవైపు తనకు కెరీర్ పరంగా మ్యూజికల్ ప్రొఫెషన్ లో స్థిరపడి అందులో తనకంటూ ప్రత్యేక పేరుతో సెన్సేషన్ సృష్టించాలని క్రిష్ కపూర్ (Ahaan Panday) ఎంతో కష్టపడుతూ ఉంటాడు. అయితే లవ్ ఫెయిల్యూర్ డిప్రెషన్ నుండి మెల్లగా బయటపడ్డ వాణీ, ఒక ఉద్యోగంలో చేరి తనకు ఎంతో ఇష్టమైన కొన్ని రైటింగ్స్ ని ఒక పుష్టకంలో రాసుకుంటుంది. అనంతరం ఒకానొక సందర్భంలో క్రిష్ కపూర్ కి వాణీ ఒక చక్కటి పాటని రాసి ఇవ్వడం, ఆపై వారిద్దరూ కూడా ఒకరిపట్ల మరొకరు మంచి ఇష్టాన్ని ఏర్పరుచుకుని చివరికి ప్రేమలో పడడం జరుగుతుంది.
అయితే అదే సందర్భంలో జరిగిన ఒక ఘటన కారణంగా తనకు వచ్చిన మంచి అవకాశాన్ని వదులుకుంటాడు క్రిష్. కాగా అదే సమయంలో ఊహించని విధంగా వాణీకి ఒక భయంకర వ్యాధి ఉందని డాక్టర్లు కన్ఫర్మ్ చేస్తారు. మరి అనంతరం వాణిని ఎంతో ప్రేమించిన క్రిష్ ఏమి చేసాడు, ఆమె కోసం తన ప్యాషన్ ని వదిలేసుకున్నాడా, ఆమెకు ఏవిధంగా తోడున్నాడు, అసలు వాణీకి వచ్చిన జబ్బు ఏమిటి, చివరకు కథ ఏవిధంగా మలుపులు తిరిగింది అనేది మొత్తం కూడా మనం వెండి తెరపై చూడాల్సిందే.
Saiyaara Movie Review in Hindi
ప్లస్ పాయింట్స్ :
ముందుగా యువ నటీనటులు అయిన అహాన్ పాండే అలానే అనీత్ పడ్డా ఇద్దరూ కూడా తమ తమ పాత్రల్లో ఎంతో అద్భుతంగా ఒదిగిపోయి నటించారు. ముఖ్యంగా లవ్, రొమాంటిక్ సీన్స్ తో పాటు హృద్యమైన ఎమోషనల్ సీన్స్ లో కూడా వారిద్దరి నటన మెచ్చుకోవాల్సిందే.
ఇక దర్శకుడిగా లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్స్ యొక్క స్పెషలిస్ట్ అయిన మోహిత్ సూరి మరొక్కసారి సయ్యారా మూవీ ద్వారా తన ఆకట్టుకునే దర్శకత్వ ప్రతిభని చాటుకున్నారు. గతంలో ఆయన తీసిన ఆషీకీ 2 లైన్స్ లోనే కొంత ఈ మూవీ యొక్క కథ సాగినప్పటికీ మరికొంత అయితే విభిన్నంగా సాగుతుంది. ఇక ఇటువంటి మెలోడ్రామాలకు కావాల్సినంత పుష్కలమైన లవ్ రొమాంటిక్ సీన్స్ తో పాటు ఎమోషన్స్ ని కూడా ఆయన బాగా రాసుకున్నారు.
ముఖ్యంగా కథకు సందర్భానికి తగ్గట్లుగా వచ్చే సాంగ్స్ అందరినీ ఆకట్టుకోవడంతో పాటు యువతని ఎంతో ఆకర్షిస్తాయి. ముఖ్యంగా మనం ఎంతో ప్రాణంగా ప్రేమించి ఇష్టపడ్డ వారి జీవితంలో ఎంతో కష్టం ఏర్పడితే చివరి వరకు వారికి తోడుగా ఉంటూ నిలబడాలని ఇద్దరి జీవితాల్లో చూపించిన కోణం, విధానం ఎంతో బాగుంది. అలానే మనకు ఇష్టమైన వారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతుంటే అందుకోసం మనం ఎటువంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు అనే పాయింట్ కూడా ప్రేక్షకులని ఎంతో మెప్పిస్తుంది.
కథ, నటుల ప్రదర్శన, డైరెక్షన్ విశ్లేషణ
మైనస్ పాయింట్స్ :
ముఖ్యంగా ఇటువంటి లవ్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా మూవీస్ లో బలమైన ఎమోషన్స్ ని పండించి వాటితో ప్రేక్షకులని రంజింప చేయడం దర్శకుడి పెద్ద టాస్క్. ఇక ఈ మూవీ రొమాంటిక్ లవ్ సీన్స్ బాగా చూపించినప్పటికీ ఎమోషనల్ డెప్త్ అయితే కొంత మిస్ అయినట్లు అనిపిస్తుంది. అక్కడక్కడా కొన్ని సీన్స్ మనకు బోరింగ్ గా అనిపించడంతో పాటు గత సినిమాల్లో చూసిన భావన కలిగిస్తాయి. సినిమాలో ఇతర పాత్రలను కూడా మరింత సేపు చూపించాల్సింది. ముఖ్యంగా హీరో తండ్రి పాత్ర నిడివి ఇంకొంత ఉండాల్సింది. అలానే బీజీఎమ్ పరంగా కూడా రిపీటెడ్ గా మనకు అనిపిస్తుంది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు మోహిత్ సూరి తన మార్క్ రొమాంటిక్ యాక్షన్ లవ్ సీన్స్ బాగా తీశారు, ఓవరాల్ గా మూవీ బాగానే ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ కూడా ఎంతో బాగుంది. కొన్ని సీన్స్ అయితే ఎంతో రిచ్ గా అనిపిస్తాయి. ముఖ్యంగా సంగీతం ఈ సినిమాకి పెద్ద బలం అని చెప్పకతప్పదు. చాలా సాంగ్స్ యూత్ ని ఎంతో అట్రాక్ట్ చేయడంతో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని ఎంతో రంజింపచేస్తాయి. ఎడిటింగ్ విభాగం మాత్రం కొన్ని సాగతీత సీన్స్ కట్ చేయాల్సింది. ఇక నిర్మాణ విలువలు అయితే ఎంతో అద్భుతం అని చెప్పాలి.
Saiyaara Movie Review Telugu
సాంకేతిక విలువలు, ప్లస్ మైనస్ పాయింట్లు, ఫైనల్ వెర్డిక్ట్
తీర్పు :
మొత్తంగా యువ నటులు అహాన్ పాండే, అనీత్ పడ్డా ల కలయికలో మోహిత్ సూరి తీసిన లేటెస్ట్ లవ్, రొమాంటిక్, ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ సయ్యారా అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పాలి. ఆయన దర్శకత్వ ప్రతిభతో పాటు ప్రధాన పాత్రధారుల నటన, సాంగ్స్, సినిమాటోగ్రఫీబాగున్నాయి. అయితే అక్కడక్కడా సాగతీతగా అనిపించడంతో పాటు ఎమోషనల్ డెప్త్ కొంత మిస్ అయినట్లు అనిపిస్తుంది. మొత్తంగా వీలైతే ఈ వారాంతంలో తప్పకుండా Saiyaara మూవీని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి థియేటర్స్ లో మిస్ అవ్వకుండా చూడండి.
ఇటువంటి లేటెస్ట్ టాలీవుడ్ మూవీస్ లేటెస్ట్ అప్ డేట్స్, రివ్యూస్, గాసిప్స్, బాక్సాఫీస్, గ్యాలరీ వంటి వాటి కోసం తరచూ మా Telugu Movie Media సైట్ ని ఫాలో అవుతూ ఉండండి, ధన్యవాదాలు
Saiyaara Review Rating
What's Your Reaction?






