War 2 Release Date, Trailer, Cast, Plot & Teaser Latest Updates
War 2 release date confirmed! Check out the latest updates on the cast, plot, trailer, and more about Jrntr Hrithik Roshan’s upcoming action thriller.

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం మంచి క్రేజ్ కలిగిన భారీ పాన్ ఇండియన్ మూవీస్ లో తాజాగా జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వార్ 2 మూవీ కూడా ఒకటి. ఈ మూవీ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ హృతిక్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి.
War 2 Release Date & Latest News
ఇప్పటికే చాలా వేగంగా షూటింగ్ జరుపుఉంటున్న ఈ మూవీని యువ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తుండగా హీరోయిన్ గా యువ బాలీవుడ్ అందాల నటి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. 2019లో హృతిక్, టైగర్ ష్రాఫ్ ల కలయికలో వచ్చిన వార్ మూవీ అప్పట్లో పెద్ద విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఆ మూవీ తరువాత వార్ 2 సీక్వెల్ ని అనౌన్స్ చేసారు. ఆ తరువాత ఆర్ఆర్ ఆర్ మూవీ తో పాన్ ఇండియన్ స్టార్ గా జూనియర్ ఎన్టీఆర్ అదిరిపోయే క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆ మూవీ లోని నాటు నాటు సాంగ్ ఏకంగా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుని తెలుగు చిత్ర పరిశ్రమ యొక్క ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది.
War 2 Cast & Crew Details
ఇక ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా అదిరిపోయే నటనని కనబరచగా కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ అదరగొట్టారు. ఇక ఈ ఇద్దరు కూడా తమ తమ పెర్ఫార్మన్స్ తో అందరినీ ఆకట్టుకోవడంతో పాటు ఆర్ఆర్ఆర్ మూవీ తో అతిపెద్ద విజయం సొంతం చేసుకుని కెరీర్ పరంగా గ్లోబల్ గా తిరుగులేని క్రేజ్ అందుకున్నారు.
ఇక ఆ తరువాత అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ ఇద్దరికీ కూడా భారీ స్థాయిలో పలు బడా ఆఫర్స్ రా సాగాయి. అయితే వార్ 2 మూవీలో ఎన్టీఆర్ పాత్ర కూడా ఎంతో అదిరిపోనుందని అంటున్నారు. ఇప్పటికే తన పాత్ర కోసం పూర్తిగా మేకోవర్ చేంజ్ చేసిన ఎన్టీఆర్, చాలావరకు షూటింగ్ లో పాల్గొన్నారు.
War 2 Trailer & Teaser Updates
వాస్తవానికి ఇటీవల ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల పై ఒక క్రేజీ డ్యాన్స్ నెంబర్ ని చిత్రీకరించాల్సి ఉంది. అయితే సెట్స్ లో హృతిక్ కి గాయం అవడంతో ఆ సాంగ్ యొక్క షూట్ వాయిదా పడింది. కాగా ఆ సాంగ్ ని ప్రీతం కంపోజ్ చేశారు. అటు హృతిక్ ఇటు ఎన్టీఆర్ ఇద్దరూ కూడా డ్యాన్స్ అదరగొడతారు కనుక ఈ సాంగ్ విషయమై టీమ్ ఎంతో శ్రద్ధ తీసుకుంటోందట.
త్వరలో ఈ సాంగ్ షూట్ ని మరింత గ్రాండ్ గా జరుపనున్నారట. ఇక ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత స్థాయి మేకింగ్ తో యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే వార్ 2 మూవీ యొక్క ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ రిలీజ్ కానుందని అంటున్నారు.
War 2 Budget & Box Office Predictions
కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి ఆగష్టు 14న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవానికి అదే సమయానికి సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ మూవీ కూడా రిలీజ్ కానుండగా, వార్ 2 వస్తున్న నేపథ్యంలో కొన్నాళ్లపాటు ఆ మూవీని వాయిదా వేసినట్లు టాక్. మొత్తంగా అయితే ఇటు ఇండియాతో పాటు పలు ఇతర దేశాల ఆడియన్స్ లో కూడా భారీ యాక్షన్ మూవీ వార్ 2 లో ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.
What's Your Reaction?






