Shocking Updates: Megastar Chiranjeevi’s New Movie Plans Revealed!
Get the latest updates on Megastar Chiranjeevi's upcoming movies, shooting schedules, and more.

టాలీవుడ్ స్టార్ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా రూపొందుతోన్న లేటెస్ట్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ మూవీ విశ్వంభర (Vishwambhara). ఈ మూవీని యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తుండగా హీరోయిన్ గా త్రిష నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి మరోవైపు వేగంగా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా జరుగుతోంది.
ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి యొక్క వింటేజ్ లుక్ తో పాటు అప్పటి మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ పాత్రని చూడవచ్చని అంటున్నారు దర్శకుడు వశిష్ట. అప్పటి జగదేక వీరుడు అతిలోక సుందరిలోని మెగాస్టార్ పోషించిన రాజు పాత్ర అందరినీ ఎలా ఆకట్టుకుందో ఈ మూవీలోని భీమవరం దొరబాబు పాత్ర కూడా మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరినీ అలరిస్తుందని టాక్.
మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా సమాచారం
ఈ మూవీకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యువి క్రియేషన్స్ సంస్థ దీనిని గ్రాండ్ లెవెల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది సమ్మర్ కి రిలీజ్ కావాల్సిన ఈ మూవీ మరికొన్ని నెలలు వాయిదా పడింది. ఇప్పటికే విశ్వంభర నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ తో పాటు రామ రామ సాంగ్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.
ఇక దీని తరువాత షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై యువ నిర్మాత సాహు గారపాటి నిర్మించనున్న మూవీలో నటించనున్నారు మెగాస్టార్. ఈ మూవీని అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కించనుండగా సాహు తో కలిసి మెగాస్టార్ పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల కూడా ఈ మూవీలో నిర్మాతగా భాగస్వామి కానున్నారు.
తాజా వార్తలు మరియు షూటింగ్ వివరాలు
ఇప్పటికే మెగాస్టార్ కోసం ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో కూడిన మాస్ యాక్షన్ డ్రామా స్టోరీ ని సిద్ధం చేసే పనిలో నిమగ్నం అయి ఉన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇటీవల విక్టరీ వెంకటేష్ తో ఆయన తీసిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
దానితో మెగాస్టార్, అనిల్ రావిపూడిల క్రేజీ కాంబినేషన్ మూవీ అందరిలో ఎంతో హైప్ ఏర్పరిచింది. కాగా ఈ మూవీ జూన్ నెలాఖరులో పట్టాలెక్కి పక్కాగా 2026 జనవరిలో సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి రానుంది. అయితే ఈ రెండు సినిమాల అనంతరం యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఒక మూవీ చేయనున్నారు మెగాస్టార్.
అభిమానులు ఎదురుచూస్తున్న అప్‌డేట్స్
ఇటీవల ఈ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. దీనిని నాచురల్ స్టార్ నాని గ్రాండ్ గా నిర్మించనుండగా ఇందులో వింటేజ్ మాస్ మెగాస్టార్ లుక్ ని చూడనున్నట్లు టాక్. ఇక తాను చిన్నప్పటి నుండి ఎంతో అభిమానిస్తున్న మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక అద్భుతమైన స్టోరీ సిద్ధం చేసిన శ్రీకాంత్ ఓదెల, ప్రస్తుతం నాని హీరోగా ది ప్యారడైజ్ (The Paradise) మూవీ చేస్తున్నారు.
అది పూర్తి కాగానే మెగా మూవీని పట్టాలెక్కించనున్నారు. ఈలోపు అనిల్ రావిపూడితో మెగాస్టార్ తన మూవీని పూర్తి చేయనున్నారు. అయితే వీటితో పాటు ఇటీవల చిరంజీవితో వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) వంటి సక్సెస్ఫుల్ సినిమా తీసిన బాబీ మరొక్కసారై ఆయనతో జతకట్టేందుకు సిద్ధమవుతున్నారని టాక్.
ఇప్పటికే మెగాస్టార్ కోసం ఒక పవర్ఫుల్ స్టోరీ రాసుకున్న బాబీ, త్వరలో ఆయనకు వినిపించనున్నారట. అలానే మరికొన్ని ప్రాజక్ట్స్ ప్రస్తుతం మెగాస్టార్ యొక్క కెరీర్ లైనప్ లో సిద్ధంగా ఉన్నాయి. కాగా త్వరలో ఒక్కొక్కటిగా వాటి యొక్క వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.
What's Your Reaction?






