Chiranjeevi and Anil Ravipudi Movie Exciting Update: Great news for Mega Star Fans

Mega Star Chiranjeevi teams up with director Anil Ravipudi for a full-length mass entertainer. Here's the latest update on this much-awaited Tollywood movie

Chiranjeevi and Anil Ravipudi Movie Exciting Update: Great news for Mega Star Fans

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా ప్రస్తుతం విశ్వంభర (Vishwambhara) మూవీ సెట్స్ మీద ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీని బింబిసార (Bimbisara) దర్శకుడు మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తుండగా అందాల నటి త్రిష (Trisha Krishnan) హీరోయిన్ గా నటిస్తున్నారు. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీపై మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. 

ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీని యువి క్రియేషన్స్ సంస్థ పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, ప్రమోద్ రెడ్డి గ్రాండ్ గా భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇటీవల విశ్వంభర నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ అలానే ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకుని ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచాయి. 

మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్ కన్ఫర్మ్

త్వరలో విశ్వంభర మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే దీని తరువాత యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో తన నెక్స్ట్ మూవీ చేయనున్నారు మెగాస్టార్. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల గ్రాండ్ గా నిర్మించనున్న ఈ మూవీకి భీమ్స్ సిసిలోరియో సంగీతం అందించనుండగా దీనిని ఫ్యామిలీ యాక్షన్ తో కూడిన కామెడీ ఎంటర్టైనర్ గా దర్శకుడు అనిల్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 

తనకు ఎంతో ఇష్టమైన మెగాస్టార్ తో చేస్తున్న మూవీ కావడంతో కథ, కథనాల విషయమై అనిల్ రావిపూడి ఎంతో జాగ్రత్త తీసుకున్నారని టాక్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా సాగుతున్న ఈ మూవీ అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమైంది. కాగా ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) తో పాటు సరైనోడు (Sarrainodu) లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న క్యాథరీన్ త్రెసా (Catherine Tresa) హీరోయిన్స్ గా నటించనున్నారట. 

ఈ సినిమా కథపై ఆసక్తికర అప్‌డేట్!

ఇప్పటికే వారిద్దరినీ కలిసి దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కథని వినిపించి గ్రీన్ సిగ్నల్ కూడా అందుకున్నారట. తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు మెగాస్టార్ మార్క్ యాక్షన్ అంశాలు కూడా ఈ మూవీలో ఉండేలా చూసుకున్నారట అనిల్. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా దీనిని నిర్మాతలు సుస్మిత, సాహు ఇద్దరూ కూడా నిర్మించేందుకు సిద్దమయ్యారట. 

అన్ని కార్యక్రమాలు ముగించి మూవీని వచ్చే ఏడాది 2026 సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఇక ఇటీవల విక్టరీ వెంకటేష్ తో తీసిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) మూవీ ద్వారా ఎంతో పెద్ద విజయం తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి, ఖచ్చితంగా మెగా మూవీతో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అంటోంది మూవీ టీమ్. 

మూవీ విడుదల తేదీ మరియు ఫస్ట్ లుక్ ఎప్పుడంటే

మరోవైపు ఈ మూవీ కోసం సంగీత దర్శకుడు భీమ్స్ మూడు అద్భుతమైన ట్యూన్స్ కూడా ఇచ్చారట. త్వరలో ఈ క్రేజీ ప్రాజక్ట్ నుండి ఒక్కొక్కటిగా అప్ డేట్స్ రానున్నాయని, అలానే మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుండి ప్రత్యేక అప్ డేట్ కూడా సిద్ధం చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మరి అందరిలో ఈ రేంజ్ క్రేజ్ ఏర్పరిచిన అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి మూవీ రిలీజ్ అనంతరం ఏస్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరొక ఏడు నెలలవరకు వెయిట్ చేయాల్సిందే. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow