Double Surprise for Jr NTR Fans on the Special Day – Official Hints Out!
Jr NTR fans are in for a double treat on a special day soon. Makers tease two back-to-back surprises. Full details here

తెలుగు మూవీ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా బాలనటుడిగా బాలరామాయణం సినిమా ద్వారా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. తాతయ్య విశ్వవిఖ్యాత సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు, బాబాయ్ నందమూరి బాలకృష్ణ, తండ్రి నందమూరి హరికృష్ణల ఆశీస్సులతో ఆ విధంగా బాలనటుడిగా పరిచయమై ఆ మూవీ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు జునియర్ ఎన్టీఆర్.
అనంతరం హీరోగా 2001లో నిన్ను చూడాలని మూవీతో హీరోగా పరిచయమయ్యారు. అప్పట్లో మంచి విజయాన్ని అందుకున్న ఆ మూవీ అనంతరం దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా చేశారు ఎన్టీఆర్. అప్పట్లో పెద్ద సక్సెస్ అందుకున్న ఆ సినిమా, హీరోగా జూనియర్ ఎన్టీఆర్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది.
తారక్ అభిమానులకు ఒకే రోజు రెండు సర్‌ప్రైజులు – అదిరే అప్‌డేట్
ఆ తరువాత ఆయన కెరీర్ నాలుగవ సినిమాగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆది మూవీ సెన్సేషనల్ హిట్ కొట్టి ఎన్టీఆర్ కి హీరోగా మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆపై మరొక్కసారి రాజమౌళి తో ఎన్టీఆర్ చేసిన సింహాద్రి మూవీ ఆల్ టైం భారీ హిట్ గా నిలిచి అప్పట్లో అత్యధిక కేంద్రాల్లో శతదినోత్సవం, జూబిలీ జరుపుకున్న సినిమాగా సరికొత్త రికార్డ్స్ సృష్టించింది.
దానితో మాస్ హీరోగా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ స్థాయి ఇమేజ్ ని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్న ఎన్టీఆర్ అక్కడి నుండి కెరీర్ పరంగా మరింత వేగవంతంగా సినిమాలు చేస్తూ కొనసాగారు. ఇక తదుపరి సినిమాలతో మరిన్ని బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకుని ప్రస్తుతం వరుసగా విజయాలతో కొనసాగుతున్న యంగ్ టైగర్ ఇటీవల తన ఫ్రెండ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఫస్ట్ టైం చేసిన సినిమా ఆర్ఆర్ఆర్.
ఈ స్పెషల్ డేట్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఎలాంటి గిఫ్ట్స్ రాబోతున్నాయంటే?
జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ పేట్రియాటిక్ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేయాగా ఎన్టీఆర్ కొమురం భీం గా కనిపించి ఇద్దరూ కూడా తమ తమ పాత్రల్లో అదరగొట్టే పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని మెప్పించారు. కీరవాణి సంగీతాన్ని, సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందించిన ఈ మూవీకి విజయేంద్రప్రసాద్ కథని అందించారు.
అన్ని వర్గాల ప్రేక్షకుల తో పాటు ముఖ్యంగా మెగా, నందమూరి ఫ్యాన్స్ ని ఆకట్టుకునే విధంగా దర్శకధీరుడు రాజమౌళి ఈ మూవీని ఎంతో భారీ రేంజ్ లో తెరకెక్కించారు. డివివి ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దానయ్య గ్రాండియర్ గా నిర్మించిన ఈ సినిమా 2022 మార్చి 25న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా రూ. 1350 కోట్ల మేర కలెక్షన్ సొంతం చేసుకుంది.
ఇక ఇందులోని నాటు నాటు సాంగ్ ఏకంగా ఆస్కార్ అవార్డు దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే దీని తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన మాస్ యాక్షన్ ఎమోషనల్ మూవీ దేవర పార్ట్ 1. గత ఏడాది ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈమూవీ పెద్ద విజయం సొంతం చేసుకుంది. ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించారు.
ఇక తాజాగా హృతిక్ రోషన్ తో కలిసి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వార్ 2 తో పాటు కెజిఎఫ్ సిరీస్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ అనే మూవీ చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ రెండు సినిమాల పై అందరిలో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇటీవల వార్ 2 గురించి ఒక ఈవెంట్ లో భాగంగా హృతిక్ రోషన్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ వంటి మంచి మనసున్న కోస్టార్ ని చూడలేదని, తాను మంచి యాక్టర్, డ్యాన్సర్ మాత్రమే కాదు మంచి కుక్ అంటూ ఆయన పై ప్రసంశలు కురిపించారు.
ఇక వార్ 2 మూవీ ఈ ఏడాది ఆగష్టు 14న గ్రాండ్ గా రిలీజ్ కానుందని అన్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీకి అయాన్ ముఖర్జీ దర్శకుడు. అలానే ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేస్తున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.
తారక్ బర్త్‌డేకు డబుల్ ట్రీట్ ఫిక్స్ చేసుకోవచ్చా
విషయం ఏమిటంటే రానున్న మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ రెండు సినిమాల నుండి ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ లభించనున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా వార్ 2 నుండి ఫస్ట్ లుక్ గ్లింప్స్ తో పాటు ప్రశాంత్ నీల్ మూవీ యొక్క టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ ఉండొచ్చు అనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. మరి ఈ రెండు సినిమాలతో హీరోగా ఎన్టీఆర్ మరింత భారీ విజయాలు సొంతం చేసుకోవాలని కోరుకుందాం.
What's Your Reaction?






