Mrunal Thakur Latest Photos: Stunning HD Images & New Photoshoots

Mrunal Thakur Latest Photos తెలుగు సినిమా పరిశ్రమలోని నేటి యువ కథానాయికల్లో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. మహారాష్ట్ర లోని ధులే ప్రాంతానికి చెందిన ఈ భామ మరాఠీలో తొలిసారిగా 2014లో వచ్చిన హలో నందన్ మూవీ ద్వారా చిత్ర రంగ ప్రవేశంక్ చేసారు

Mrunal Thakur Latest Photos: Stunning HD Images & New Photoshoots

తెలుగు సినిమా పరిశ్రమలోని నేటి యువ కథానాయికల్లో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. మహారాష్ట్ర లోని ధులే ప్రాంతానికి చెందిన ఈ భామ మరాఠీలో తొలిసారిగా 2014లో వచ్చిన హలో నందన్ మూవీ ద్వారా చిత్ర రంగ ప్రవేశంక్ చేసారు. ఆ తరువాత మరాఠీ తో పాటు హిందీలో కూడా కొన్ని సినిమాలు చేసారు. 

Mrunal Thakur Latest Photos – New HD Images & Stylish Looks

ముఖ్యంగా హృతిక్ రోషన్ హీరోగా రూపొందిన సూపర్ 30, షాహిద్ కపూర్ హీరోగా రూపొందిన జెర్సీ తో పాటు ఫర్హాన్ అక్తర్ నటించిన తూఫాన్ సినిమాలు నటీమణిగా బాలీవుడ్ లో ఆమెకు మంచి పేరు తీసుకువచ్చాయి. అనంతరం 2022లో మలయాళ యువ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం మూవీలో ఆమెకు అవకాశం లభించింది. 

ఆ మూవీతో ఆమె తెలుగు చిత్ర సీమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో రిలీజ్ అనంతరం తెలుగుతో పాటు అన్ని భాషల్లో కూడా సీతారామం పెద్ద విజయం అందుకుని ఫస్ట్ మూవీతోనే తెలుగు ఆడియన్స్ లో మృణాల్ కు మంచి పేరు తీసుకువచ్చింది. 

ఆ తరువాత కూడా అటు హిందీలో కూడా మరికొన్ని ప్రాజక్ట్స్ చేసిన మృణాల్, అనంతరం నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ హాయ్ నాన్నలో హీరోయిన్ గా నటించి మరొక విజయం సొంతం చేసుకున్నారు. ఇక గత ఏడాది రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఆమె చేసిన మూవీ ది ఫ్యామిలీ స్టార్. 

ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించగా పరశురామ్ పెట్ల తెరకెక్కించారు. రిలీజ్ అనంతరం బాగానే విజయం అందుకున్న ఈ మూవీ హీరోయిన్ గా మృణాల్ పేరు మరింతగా పెంచింది. 

Mrunal Thakur Recent Photoshoot Pictures & Glamorous Avatars

ఆ తరువాత ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ తీసిన భారీ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ కల్కి 2898 ఏడి (Kalki 2898 AD) మూవీలో ఒక చిన్న కీలక పాత్ర చేసారు మృణాల్. ఇక ప్రస్తుతం పూజ మేరీ జాన్, సన్ ఆఫ్ సర్దార్ 2, హై జవానీ తో ఇష్క్ హోనా హై, తుమ్ హో తో హిందీ మూవీస్ తో పాటు యువ టాలీవుడ్ నటుడు అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ డెకాయిట్ ఏ లవ్ స్టోరీ మూవీ కూడా చేస్తున్నారు. 

వాస్తవానికి తెలుగులో ఫస్ట్ మూవీ సీతారామంలో సీత పాత్రలో మృణాల్ తన ఆకట్టుకునే అందం అభినయంతో ఆడియన్స్ మనసు గెలుచుకున్నారు. ఈ మూవీ అటు హిందీలో కూడా పెద్ద విజయం అందుకోవడంతో అక్కడ కూడా ఆమె క్రేజ్ అమాంతంగా పెరిగింది. ఇక లేటెస్ట్ టాలీవుడ్ అప్ డేట్స్ ప్రకారం మృణాల్ ఇప్పటికే మరికొన్ని క్రేజీ ప్రాజక్ట్స్ ని కూడా లైన్లో పెట్టారని, త్వరలో వాటి గురించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయని తెలుస్తోంది. 

Mrunal Thakur in Traditional & Western Outfits – Best Looks

Unseen Mrunal Thakur HD Images – Exclusive Gallery

మరోవైపు ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ఫ్యాన్స్ తో పలు సినీ, వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు మృణాల్ ఠాకూర్. అలానే తనకు సంబందించిన పలు ఫోటో షూట్ ఫోటోలని కూడా ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూ ఉంటారు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow