Rajinikanth Coolie First Look Teaser | Release Date | Movie Updates

Rajinikanth’s Coolie first look is out! Check out the latest updates on the movie’s release date, teaser, trailer cast, and more. Stay tuned for all the exciting details.

Rajinikanth Coolie First Look Teaser | Release Date | Movie Updates

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో నటించిన మూవీ జైలర్. ఈ మూవీలో రమ్యకృష్ణ, వినాయకన్, విటివి గణేష్ ప్రధాన పాత్రల్లో కనిపించగా కన్నడ స్టార్ యాక్టర్ శివరాజ్ కుమార్, మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ క్యామియో పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. 

Rajinikanth Coolie First Look Teaser

రిలీజ్ అనంతరం జైలర్ పెద్ద విజయం అందుకుంది. ఇక తాజగా ఈ మూవీ యొక్క సీక్వెల్ అయిన జైలర్ 2 ని గ్రాండ్ గా లాంచ్ చేసారు టీమ్. మరోవైపు జైలర్ అనంతరం యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కూలీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రజినీకాంత్. ఈ మూవీ ఇప్పటికే చాలవరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. 

ఇటీవల దీనికి సంబంధించి రిలీజ్ అయిన అనౌన్స్ మెంట్ గ్లింప్స్ తో పాటు సాంగ్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై బాగా అంచనాలు ఏర్పరిచాయి. 

ఇక కూలీ మూవీలో అందాల నటి శృతి హాసన్, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, కన్నడ స్టార్ యాక్టర్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేంతిక విలువలతో భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ సంస్థ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. 

ఇక ఈ మూవీలో దేవా అనే మాస్ పవర్ఫుల్ పాత్రలో రజినీకాంత్ కనిపించనుండగా కొన్నాళ్ల క్రితం నాగార్జున కి సంబందించి ఒక చిన్న షూటింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ఇక అయి వైరల్ గా మారింది. అక్కడి నుండి షూటింగ్ సంబంధించి పూర్తిగా జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కిస్తోంది. 

Coolie Movie Release Date and Latest Updates

ఈ మూవీలో తన అభిమాన కథానాయకుడు రజినీకాంత్ హీరో కావడంతో కథ, కథనాలతో పాటు టేకింగ్, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా దర్శకుడు లోకేష్ కనకరాజ్ పూర్తిగా శ్రద్ధ పెట్టి తీస్తున్నారట. మరోవైపు త్వరలో ఈ మూవీ నుండి అఫీషియల్ ఫస్ట్ లుక్ టీజర్ రానుందని అంటున్నారు. 

ఈ టీజర్ రిలీజ్ అనంతరం కూలీ మూవీ పై ఇప్పటివరకు అందరిలో ముఖ్యంగా రజిని ఫ్యాన్స్ లో ఉన్న అంచనాలు అమాంతం పెరిగిపోడవం ఖాయం అని కోలీవుడ్ వర్గాల టాక్. గతంలో రజినీకాంత్ తో అనిరుద్ చేసిన పలు సినిమాలు అటు మ్యూజికల్ గా సూపర్ గ రెస్సాన్స్ సొంతం చేసుకోవడంతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి కూడా బాగా క్రేజ్ లభించింది. 

Rajinikanth’s Coolie Cast, Crew, and Story Details

దానితో కూలీ మూవీ పై మరింత శ్రద్ధ పెట్టరట యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్. గిరీష్ గంగాధరన్ ఫోటోగ్రఫి అందిస్తున్న ఈమూవీ ఈ ఏడాది అక్టోబర్ లో ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం గట్టిగా కనపడుతోంది. 

అలానే ఈ మూవీలో శృతి హాసన్ పాత్ర కూడా అందరినీ ఆకట్టుకుంటుందట. ఆ విధంగా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా తెరకెక్కుతున్న కూలీ మూవీ తప్పకుండా రిలీజ్ అనంతరం బాక్సాఫిస్ వద్ద అతి పెద్ద విజయం అందుకుని కెరీర్ పరంగా రజినీకాంత్ ఖాతాలో మరొక భారీ విజయంగా నిలవడం ఖాయం అంటున్నారు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow