Mahesh Babu Wax Statue at Madame Tussauds Singapore

Superstar Mahesh Babu becomes the first Telugu actor to get a wax statue at Madame Tussauds Singapore. See the full story here

Mahesh Babu Wax Statue at Madame Tussauds Singapore

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తన కెరీర్ ని బాలనటుడిగా నీడ మూవీ ద్వారా ఆరంభించారు. తండ్రి లెజెండరీ యాక్టర్ నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) ని ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో సినిమాలు చేస్తూ కొనసాగిన మహేష్ బాబు, ఆపైన 1999లో రాఘవేంద్రరావు తీసిన రాజకుమారుడు (Rajakumarudu) మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి హీరోగా తొలి చిత్రం తోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు. 

ఆ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఆకట్టుకునే లుక్స్, అభినయం ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని ఎంతో ఉర్రూతలూగించాయి. అనంతరం యువరాజు (Yuvaraju), వంశీ (Vamsi), మురారి (Murari), ఇలా ప్రతి ఒక్క చిత్రంతో ఎన్నో మంచి విజయాలతో పాటు ప్రతి చిత్రంతో కోట్లాది ఫ్యాన్స్ ని సంపాదించినా మహేష్ బాబు కెరీర్ లో మధ్యలో కొన్ని ఒడిదుడుకులు కూడ ఎదుర్కొన్నారు.

మహేష్ బాబు మైనపు విగ్రహం

కెరీర్ లో కొన్ని పరాజయాలు కూడా వచ్చినప్పటికీ ఏమాత్రం భయపడకుండా మొక్కవోని దీక్షతో ముందుకి సాగిన మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కి తగ్గ తనయుడిగా ప్రస్తుతం టాలీవుడ్ లో తిరుగులేని స్టార్డం ఆకాశమంతటి క్రేజ్ తో దూసుకెళ్తున్నారు. ఇక మహేష్ బాబు చేసిన కెరీర్ 28 సినిమాల్లో ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ కాగా మరికొన్ని అతి పెద్ద బ్లాక్ బస్టర్స్, మరికొన్ని ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. 

ముఖ్యంగా మహేష్ బాబు నుండి సినిమా వస్తుంది అంటే ఆయన ఫ్యాన్స్ లోనే కాదు సాధారణ ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంటుంది. ఇక మహేష్ సినిమా రిలీజ్ అయ్యే థియేటర్స్ లో పెద్ద పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. 

మేడమ్ టుస్సాడ్స్‌లో చరిత్ర సృష్టించిన తెలుగు హీరో

మహేష్ బాబు ఆ విధంగా కోట్లాదిమంది ప్రేక్షకాభిమానుల్లో నటుడిగా ఎప్పటికీ మరువలేని ఒక గొప్ప సుస్థిర స్థానాన్ని సంపాదించారు. ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు తండ్రి కృష్ణ బాటలో ఎన్నో సామజిక సేవా కార్యక్రమాలు కూడా చెప్పట్టారు మహేష్ బాబు. 

తాను చేసిన సూపర్ డూపర్ ఇండస్ట్రీ హిట్ మూవీ శ్రీమంతుడు అనంతరం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని బుర్రిపాలెం, తెలంగాణ (Telangana) లోని సిద్దాపురం గ్రామాలను స్వయంగా దత్తత తీసుకున్న సూపర్ స్టార్, ఎప్పటికప్పుడు తనకు వీలైనంతలో పలు అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేపడుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. 

విగ్రహం ఎప్పుడు, ఎక్కడ ఆవిష్కరించబడింది?

వీటితో పాటు మరోవైపు ఆంధ్ర హాస్పిటల్స్ (Andhra Hospitals) వారి సౌజన్యంతో మహేష్ బాబు ఫౌండేషన్ (Mahesh Babu Foundation) తరపున కొన్ని వేల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయిస్తూ తన దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు. 

అయితే విషయం ఏమిటంటే, ఇంతటి క్రేజ్ కలిగిన సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క వాక్స్ స్టాట్యూ 2019లో సింగపూర్ మేడం టుస్సాడ్స్ (Madame Tussauds) వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ (Hyderabad) లోని ఏఎంబి సినిమాస్ (AMB Cinemas) లో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఎందరో సూపర్ స్టార్ ఫ్యాన్స్, ఆడియన్సు తో పాటు నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్ మీడియా కూడా ప్రత్యేకంగా విచ్చేసింది. 

కాగా అంతకముందు తెలుగులో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhs) యొక్క వాక్స్ స్టాట్యూ ఏర్పాటు చేయగా, అనంతరం ఆ ఘనత సూపర్ స్టార్ మహేష్ బాబుకే దక్కింది. నటుడిగా ఎంతో పేరు సంపాదించి తాను ఈ స్థానంలో నిలవడానికి తల్లితండ్రులతో పాటు ఎందరో ఫ్యాన్స్ ఆడియన్స్ యొక్క ఆదరణ కారణం అని, ఈ స్టాట్యూ ప్రత్యేకంగా తయారు చేసిన మేడం టుస్సాడ్స్ వారికి కృతజ్ఞతలు తెలిపారు మహేష్ బాబు.  

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow