Trisha in Saree Photos – Latest HD Images & Stunning Looks
Trisha in Saree Photos ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమలో నటిగా మంచి క్రేజ్ తో పాటు భారీ స్థాయిలో పలు భాషల ఆడియన్స్ నుండి విశేషమైన ఆదరణ తో కొనసాగుతున్న నటీమణుల్లో త్రిష కృష్ణన్

Trisha in Saree Photos – Latest HD Images & Gorgeous Looks
ఇక తొలిసారిగా 1999లో ప్రవీణ్ కాంత్ దర్శకత్వంలో ప్రశాంత్, సిమ్రాన్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన జోడి మూవీ ద్వారా సినీ ఎంట్రీ ఇచ్చారు త్రిష. అప్పట్లో పెద్ద విజయం సొంతం చేసుకుని ఆడియన్స్ ని అలరించిన ఈ మూవీలో గాయత్రి పాత్రలో నటించిన హీరోయిన్ సిమ్రాన్ స్నేహితురాలిగా చిన్న పాత్రలో కనిపించారు త్రిష.
Trisha Traditional Saree Photos – Ethnic Beauty Unleashed
ఆ తరువాత తొలిసారిగా హీరోయిన్ గా త్రిష నటించిన సినిమా మౌనం పెసియాదే. కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సూర్య హీరోగా అమీర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 2002లో ఆడియన్స్ ముందుకి వచ్చింది. అప్పట్లో మంచి విజయం అందుకున్న ఈ మూవీతో నటిగా ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు త్రిష. ఇక అక్కడి నుండి మనసెల్లామ్, సామి, లేస లేస సినిమాల్లో ఆమె నటించారు. ఆ విధంగా తమిళ ఆడియన్స్ నుండి బాగా క్రేజ్ అందుకున్నారు త్రిష.
Trisha in Saree Pics
అయితే తొలిసారిగా 2003లో తరుణ్ హీరోగా రూపొందిన నీమనసు నాకు తెలుసు మూవీ ద్వారా ఆమె టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. యూత్ఫుల్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ అప్పట్లో బాగానే విజయం అందుకుంది. అయితే అదే సమయంలో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ సరసన ఆమె హీరోయిన్ గా వర్షం మూవీలో నటించారు.
దివంగత దర్శకుడు శోభన్ తెరకెక్కించిన ఈ మూవీ అప్పట్లో భారీ విజయం సొంతం చేసుకుంది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ పై ఎం ఎస్ రాజు గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించిన ఈ మూవీలో శైలు పాత్రలో తన అందం, నటనతో తెలుగు ఆడియన్స్ ని కూడా అలరించారు. దానితో టాలీవుడ్ లో కూడా త్రిష కు బాగా పేరు వచ్చింది. అనంతరం తమిళ్ లో విజయ్ హీరోగా గిల్లి మూవీ చేసి మరొక భారీ విజయం అందుకున్నారు త్రిష.
Trisha Modern Saree Looks – A Blend of Style & Elegance
ఆపైన మన తెలుగులో సిద్దార్థ హీరోగా ప్రభుదేవ దర్శకత్వంలో ఎం ఎస్ రాజు నిర్మించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు త్రిష. అప్పట్లో ఈ మూవీ కూడా యువతని ఎంతో ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద విజయం సొంతం చేసుకుంది. ఆపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రిషణ చేసిన మూవీ అతడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన అతడు మూవీలో పూరి పాత్రలో ఆకట్టుకున్నారు. అనంతరం మరొక్కసారి ప్రభాస్ హీరోగా ప్రభుదేవా తీసిన పౌర్ణమి మూవీలో కూడా నటించి అలరించారు త్రిష. అలానే మెగాస్టార్ చిరంజీవి తో మురుగదాస్ తీసిన స్టాలిన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జయంత్ సి పరాన్జి తీసిన తీన్ మార్ మూవీలో కూడా నటించారు త్రిష.
Trisha in Saree Images
ఇక మరొక్కసారి సూపర్ స్టార్ మహేష్ తో కలిసి త్రిష చేసిన మూవీ సైనికుడు. గుణశేఖర్ ఈ మూవీని తెరకెక్కించారు. విక్టరీ వెంకటేష్ తో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, కింగ్ నాగార్జున సరసన కింగ్, యాక్షన్ హీరో గోపీచంద్ తో శంఖం మూవీస్ కూడా ఆమె చేసారు. మరొక్కసారి వెంకటేష్ తో శ్రీనువైట్ల తీసిన నమో వెంకటేశ, అలానే ఆయనతో మూడో సారి బాడీ గార్డ్ సినిమాలు చేసి తన ఆకట్టుకునే నటన తో అలరించారు త్రిష.
తొలిసారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో త్రిష చేసిన మూవీ దమ్ము, దీనిని బోయపాటి శ్రీను తెరకెక్కించారు. అలానే నందమూరి నటసింహం బాలకృష్ణ కి జోడీగా ఆమె చేసిన మూవీ లయన్. ఇక ఈ సినిమాలతో కెరీర్ పరంగా కొన్ని సక్సెస్ లతో పాటు మరికొన్ని పరాజయాలు కూడా మూటగట్టుకున్నారు త్రిష. ఇటీవల మరొక్కసారి చాలా గ్యాప్ అనంతరం ఇలయదళపతి విజయ్ తో త్రిషణ చేసిన మూవీ లియో, ఈ మూవీ మంచి విజయం అందుకుంది.
Trisha in Silk Saree – Timeless South Indian Charm
ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవికి జోడీగా యువ దర్శకుడు మల్లిడి వశిష్ట తీస్తున్న విశ్వంభర మూవీ లో కూడా ఆమెనే హీరోయిన్ గా చేస్తున్నారు. త్వరలో ఈ రెండు భారీ మూవీస్ ఆడియన్స్ ముందుకి రానున్నాయి. అయితే జయాపజయాలతో సంబంధం లేకుండా మన తెలుగు ఆడియన్స్ నుండి తనకంటూ ప్రత్యేకంగా పేరు, క్రేజ్ అందుకున్నారు అందాల కథానాయిక త్రిష కృష్ణన్.
కాగా లైఫ్ లో కష్ట నష్టాలు ఉంటాయని, ఎప్పుడైనా జయాపజయాలను ఒకేలా తీసుకుని సక్సెస్ వచ్చినపుడు కృంగిపోయి, ఫెయిల్యూర్ వచ్చినపుడు బాధపడ కూడదని అంటారు త్రిష. ఇక నటిగా తాను కెరీర్ పరంగా ఎంతో సంతృప్తిగా ఉన్నానని, ముఖ్యంగా తనకు జన్మనిచ్చిన తల్లితండ్రులతో పాటు మూవీ ఇండస్ట్రీ గురించి కూడా ఎప్పుడూ తన ఇంటర్వ్యూస్ లో గొప్పగా చెప్తూ ఉంటారు త్రిష.
Trisha in Saree Looks
లైఫ్ లో ప్రతి రోజు ఎన్నో విషయాలు తెలుస్తుంటాయని, అవి నేర్చుకుంటూ పాజిటివ్ గా ఆనందంగా సంతోషంతో ముందుకు సాగడమే జీవితం అని త్రిష అంటారు. అయితే త్రిష ఎక్కువగా స్టైలిష్ ట్రెండీ దుస్తులతో పాటు శారీలో కూడా పలు సందర్భాల్లో ఫంక్షన్స్ లో దర్శమిస్తూ ఉంటారు. నిజానికి వయసు పరంగా 40 ఏళ్ళని దాటినప్పటికీ కూడా ఎప్పకటికప్పుడు ఫిజిక్ పరంగా జాగ్రత్త తీసుకుంటూ ఉండే త్రిష ఇంకా యంగ్ గానే కనపడడం చూడవచ్చు.
Best Trisha Saree Photoshoot Moments & Social Media Trends
ముఖ్యంగా ఎప్పుడూ మనసుని పాజిటివ్ గా ఉంచుకుని నిత్యా కృత్యాలు అన్ని కూడా ఆనందంగా చేస్తూ కొనసాగమే అని, అలానే నిత్యం యోగ, మంచి ఆహారం, వ్యాయామం వంటివి మనిషి యొక్క ఆరోగ్యాన్ని మరింత పదిలంగా ఉంచుతాయని, తాను ఎల్లప్పుడూ అవి పాటిస్తానని అంటున్నారు. మొత్తంగా నటిగా దినదినాభివృద్ధి చెందుతూ కెరీర్ పరంగా కొనసాగుతున్న హీరోయిన్ త్రిష గారు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సొంతం చేసుకుని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం
Trisha in Saree Old Photos
What's Your Reaction?






