Rashmika Mandanna Recent Video 2024 – Latest Viral Clips & Updates

Rashmika Mandanna Recent Video 2024 టాలీవుడ్ లేటెస్ట్ స్టార్ హీరోయిన్స్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఒకరు. ఈ కన్నడ భామ తొలిసారిగా తెలుగులోకి ఛలో మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీలో నాగశౌర్య హీరోగా నటించగా వెంకీ కుడుముల

Rashmika Mandanna Recent Video 2024 – Latest Viral Clips & Updates
టాలీవుడ్ లేటెస్ట్ స్టార్ హీరోయిన్స్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఒకరు. ఈ కన్నడ భామ తొలిసారిగా తెలుగులోకి ఛలో మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీలో నాగశౌర్య హీరోగా నటించగా వెంకీ కుడుముల తెరకెక్కించారు. మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో విజయం అందుకోవడంతో పాటు హీరోయిన్ గా ఫస్ట్ మూవీ ద్వారా తన ఆకట్టుకునే అందం, అభినయంతో అందరినీ మెప్పించారు రష్మిక. 

దాని అనంతరం యువ సెన్సేషనల్ యాక్టర్ విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో రూపొందిన గీతా గోవిందం మూవీలో హీరోయిన్ గా రష్మిక కు అవకాశం రావడం, రిలీజ్ అనంతరం ఆ మూవీ భారీ సెన్సేషనల్ సక్సెస్ సొంతం చేసుకోవడంతో యువతలో ఆమె భారీ క్రేజ్ అందుకోవడం జరిగిపోయాయి.

Rashmika Mandanna Recent Video 2024 – Latest Viral Moments

ఇక అక్కడి నుండి రష్మికకు ఇక్కడ అవకాశాలు మెల్లగా రాసాగాయి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో కింగ్ అక్కినేని నాగార్జున, నాచురల్ స్టార్ నానిల కలయికలో రూపొందిన దేవదాసు మూవీలో ఒక హీరోయిన్ గా నటించి మెప్పించారు రష్మిక. ఆ తరువాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన అనిల్ రవిడిపూడి తీసిన ఫ్యామిలీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ సరిలేరు నీకెవ్వరులో నటించి తద్వారా మరొక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు రష్మిక.

ఇక అక్కడి నుండి అటు తమిళ్ లో కూడా రష్మిక కు మంచి అవకాశాలు వచ్చాయి. కన్నడలో టాప్ స్టార్ అయిన పునీత్ రాజ్ కుమార్ సరసన కూడా ఒక మూవీ చేసి అక్కడి ఆడియన్స్ ని కూడా మరింతగా మెప్పించారు రష్మిక. ఇక ఆ తరువాత నితిన్ తో భీష్మ సినిమా చేసి మరొక సక్సెస్ అందుకున్నారు రష్మిక.

ఇక కోలీవుడ్ యాక్టర్ కార్తీ తో సుల్తాన్, దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ ల సీతారామం తో పాటు యువ నటుడు శర్వానంద్ తో ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీస్ చేసారు. ఇక వీటిలో చాలా వరకు సక్సెస్ సొంతం చేసుకున్న రష్మిక మరింతగా ఆడియన్స్ ని మెప్పించారు. మరోవైపు ఆమెకు తమిళ్ తో పాటు హిందీ లో కూడా మంచి అవకాశాలు లభించాయి.

Rashmika Mandanna Latest Public Appearances & Events

హిందీలో మెగాస్టార్ అమితాబ్ తో కలిసి గుడ్ బై, అలానే సిద్దార్థ మల్హోత్రా తో మిషన్ మజ్ను వంటి సినిమాలు చేసారు రష్మిక. వాటితో కూడా విజయాలు అందుకుని నేషనల్ వైడ్ క్రేజ్ అందుకున్న రష్మిక కు తెలుగులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తీసిన పాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రైజ్ భారీ విజయం నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చిపెట్టి ఆమెకు నేషనల్ క్రష్ అనే బిరుదు తీసుకువచ్చింది.

ఇక గత ఏడాది బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తీసిన ఆనిమల్ మూవీ చేసారు రష్మిక. పాన్ ఇండియన్ రేంజ్ లో గ్రాండ్ లెవెల్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఆ మూవీ రష్మిక మందన్న కు ఎంతో భారీగా పేరు తీసుకువచ్చింది. ముఖ్యంగా ఆ మూవీ కొంత విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద రూ. 950 కోట్ల వరకు వరల్డ్ వైడ్ కలెక్షన్ సొంతం చేసుకుంది.

Rashmika Mandanna Instagram & Twitter Trending Videos

ఇక ప్రస్తుతం రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్ తో పాటు అల్లు అర్జున్ తో పుష్ప 2 ది రూల్, కింగ్ నాగార్జున ధనుష్ ల కలయికలో శేఖర్ కమ్ముల తీస్తున్న కుబేర సినిమాలు చేస్తున్నారు రష్మిక మందన్న. ఈ క్రేజీ ప్రాజక్ట్స్ అన్నిటి పై అందరిలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక కెరీర్ బిగినింగ్ నుండి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్, ఆడియన్స్ ఏంటో ఎంతో ఇంటరాక్ట్ అయ్యే రష్మిక, ఎప్పటికప్పుడు తన సినీ, వ్యక్తిగత విషయాలు వారితో షేర్ చేసుకుంటూ ఉంటారు.

ఎప్పుడూ తన ఫిట్ నెస్ తో పాటు హెల్త్ పై ఎంతో దృష్టిపెడుతుంటారు రష్మిక. ఇక మధ్యలో తనకు హాజరయ్యే పలు ఫంక్షన్స్, అలానే సినీ వేడుకలు, ఏవైనా ప్రారంభోత్సవ కార్యక్రమాలకు సంబందించిన వీడియోస్ కూడా పోస్ట్ చేస్తుంటారు రష్మిక. ఎవరైనా సరే కష్టాన్ని నమ్ముకుని ఇష్టంతో పని చేసి ముందుకు సాగితే ఎంతటి విజయం అయినా సరే మెల్లగా వస్తుందని ఆమె అంటారు.

ముఖ్యంగా తన కెరీర్ ఈ స్థాయిలో ఉండడానికి కారణం అయిన ఫ్యాన్స్, ఆడియన్స్ ని ఎప్పటికీ మర్చిపోలేనని, అలానే తనకు జన్మనిచ్చిన తల్లితండ్రులకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని రష్మిక మందన్న అంటారు.తాను కూడా కెరీర్ పరంగా బిగినింగ్ లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని అయితే అన్నిటినీ ఓర్చుకుని కష్టం నమ్ముకుని ముందుకు సాగబట్టి మెల్లగా తనకు ఈ గుర్తింపు వచ్చిందని అంటారు రష్మిక.

Rashmika Mandanna Movie Promotions & Behind-the-Scenes Clips

ఇక ప్రతి ఒక్కరు తమ తమ కెరీర్ పై ఎక్కువగా దృష్టి పెట్టి ఫ్యామిలీస్ ని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతుంటారు రష్మిక. అయితే తన సినీ కెరీర్ బిగినింగ్ లో కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో కలిసి జీవితంలో ఏడడుగులు వేసేందుకు సిద్ధమైన రష్మిక, అప్పట్లో ఆయనతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు.

అయితే కొన్ని అనివార్య కారణాల వలన వారిద్దరి పెళ్లి అవ్వలేదు. ఇక అక్కడి నుండి పూర్తిగా కెరీర్ పైనే దృష్టి పెట్టనున్నట్లు మీడియా ముఖంగా తెలిపారు రష్మిక మందన్న. మరి రాబోయే రోజుల్లో నటిగా రష్మిక మరింత ఉన్నత స్థాయికి ఎదిగి మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

Rashmika Mandanna Gym, Travel & Personal Life Updates

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow