Tamanna Photos Latest – Stunning HD Images & Photoshoot Pics

Tamanna Photos Latest నేటి టాలీవుడ్ స్టార్ నటీమణుల్లో తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఆడియన్స్ మెప్పు అందుకుని దూసుకెల్తూ తనకంటూ ప్రత్యేకత కలిగి ఉన్నారు తమన్నా భాటియా. ముఖ్యంగా తన అందంతో ఆకట్టుకునే

Tamanna Photos Latest – Stunning HD Images & Photoshoot Pics
నేటి టాలీవుడ్ స్టార్ నటీమణుల్లో తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఆడియన్స్ మెప్పు అందుకుని దూసుకెల్తూ తనకంటూ ప్రత్యేకత కలిగి ఉన్నారు తమన్నా భాటియా. ముఖ్యంగా తన అందంతో ఆకట్టుకునే ఫోజుల్లో ఎప్పటికప్పుడు దిగిన ఫొటోలు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు తమన్నా. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్ తాలూకు ఫోటోలని సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో షేర్ చేస్తూ ఉంటారు తమన్నా. ముఖ్యంగా అప్పట్లోనే తన ఆకట్టుకునే అందంతో అందరినీ ఆకర్షించారు తమన్నా. తొలిసారిగా మంచు మనోజ్ హీరోగా రూపొందిన శ్రీ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి విజయం అందుకుని ఫస్ట్ మూవీతోనే ఆడియన్స్ ని ఆమె ఆకట్టుకున్నారు.

Tamanna Photos Latest – HD Images & Gorgeous Looks

అయితే ఆ తరువాత శేఖర్ కమ్ముల అప్పట్లో అందరూ కొత్తవారితో తీసిన హ్యాపీ డేస్ మూవీలో వరుణ్ సందేశ్ కి జోడిగా నటించారు తమన్నా భాటియా. ఆ మూవీలో వరుణ్ సందేశ్ కి జోడీగా కనిపించారు తమన్నా. ముఖ్యంగా తన మార్క్ పెర్ఫార్మన్స్ తో ఆమె యువతని విశేషంగా ఆకట్టుకున్నారు. ఆ మూవీలో ట్రెండీ అవుట్ ఫిట్స్ తో పాటు ట్రెడిషనల్ శారీలో కూడా ఆ మూవీలో తమన్నా కనిపించి అలరించారు.

Tamanna Latest Photoshoot Pics – Trending Looks

ఆ తరువాత నుండి తెలుగులో మరిన్ని మంచి అవకాశాలు అందుకుంటూ కొనసాగారు తమన్నా. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో బద్రీనాథ్ మూవీ చేసారు తమన్నా. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై వివి వినాయక్ గ్రాండ్ గా తీసిన ఈమూవీ మంచి విజయం అందుకుంది. ఇక మరొక టాలీవుడ్ హీరో నాగచైతన్యతో సుకుమార్ తీసిన 100% లవ్ మూవీ అప్పట్లో యువతని విశేషముగా ఆకట్టుకుని ఫ్యాన్స్ లో మరింత జోష్ నింపింది.

ముఖ్యంగా ఆ మూవీలో తమన్నా అందం, నటన కు బాగా పేరు లభించింది. అలానే సిద్దార్థ తో తమన్నా చేసిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం, రామ్ తో చేసిన ఎందుకంటే ప్రేమంట సినిమాలు చేసి అలరించారు. ఆపైన టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆగడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు, రెబల్ స్టార్ ప్రభాస్ తో రెబల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఊసరవెల్లి సినిమాలు చేసి అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ఆడియన్స్ ని అలరించారు.

Tamanna Traditional & Saree Photos – Ethnic Beauty

ఇక ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్, రవితేజ తో బెంగాల్ టైగర్, నందమూరి కళ్యాణ్ రామ్ తో 118, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో రచ్చ సినిమాలు చేసారు. అయితే కెరీర్ పరంగా పలు సక్సెస్ లతో పాటు కొన్ని ఫ్లాప్ లని కూడా అందుకున్నారు తమన్నా. అయితే ప్రతి సినిమాల్లో తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ఎప్పటికప్పుడు బాగా క్రేజ్ తో టాలీవుడ్ లో కొనసాగిన తమన్నా, అటు తమిళ్ లో కూడా స్టార్స్ సరసన నటించారు. కోలీవుడ్ తలా అజిత్ కుమార్ తో వీరం మూవీ ఆమెకు బాగా పేరు తీసుకువచ్చింది.

Tamanna Casual & Western Outfit Photos – Stylish Avatars

అటు హిందీలో స్టార్ నటుడు అజయ్ దేవగన్ తో తమన్నా చేసిన హిమ్మత్ వాలా బాగానే ఆడడంతో పాటు హీరోయిన్ గా ఆమెకు అక్కడ కూడా బాగానే క్రేజ్ తీసుకువచ్చింది. ఆపైన దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాల్లో ఒక హీరోయిన్ గా అవంతిక పాత్రలో నటించి మేప్ప్పించారు తమన్నా.

అలానే వెంకటేష్, వరుణ్ తేజ్ లతో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తీసిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాల్లో కూడా ఒక హీరోయిన్ గా ఆమె మెప్పించారు. అలానే హిందీలో ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన బబ్లీ బౌన్సర్ మూవీ కూడా ఆకట్టుకుంది. గోపీచంద్ తో సంపత్ నంది తీసిన సీటీమార్, ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ఒక సిరీస్ లో కూడా ఆమె ప్రధాన పాత్రలో కనిపించారు.

కొన్నాళ్ల క్రితం కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ మూవీలో కూడా ఒక చిన్న పాత్రలో కనిపించి కావాలయ్యా సాంగ్ ద్వారా మరింత విశేషంగా క్రేజ్ అందుకున్నారు తమన్నా. అలానే ఇటీవల కొన్నాళ్ల క్రితం ఆడియన్స్ ముందుకి వచ్చిన బాలీవుడ్ మూవీ స్త్రీ 2, కోలీవుడ్ మూవీ అరన్ మనై 4 లో కూడా నటించి అలరించారు ఆమె.

Tamanna Photos in Saree

కాగా వీటితో పాటు ప్రస్తుతం హిందీలో రూపొందుతోన్న సికందర్ గా ముకద్దర్ తో పాటు టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది తీస్తున్న ఓదెల 2 మూవీలో కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. తరచు ఎప్పటికపుడు ట్రెండీ వెర్ తో పాటు ట్రెడిషినల్ వెర్ తో కూడా కనిపిస్తుంటారు తమన్నా. ముఖ్యంగా మనసుతో పాటు శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలని, అందుకే ఎప్పటికప్పుడు నిత్యం వ్యాయామం, యోగా వంటివి చేస్తూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటానని అంటారు తమన్నా.

ముఖ్యంగా వీటితో పాటు ప్రధానంగా నిత్యం తీసుకుని డైట్ విషయంలో కూడా జాగ్రత్తగా ఎంపిక చేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటానని అంటారు. ఇక తమన్నా తన యొక్క లేటెస్ట్ ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో షేర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తన సినీ, వ్యక్తిగత విషయాలు కూడా పంచుకుంటారు తమన్నా.

తాను నేడు ఇంతటి గొప్ప స్థాయిలో ఉన్నాను అంటే అది కుటుంబంతో పాటు ఎందరో దర్శకనిర్మాతలు, నటుల యొక్క ప్రోత్సాహం అని, ముఖ్యంగా ఫ్యాన్స్ అందించే తోడ్పాటు ఎప్పటికీ మరువలేను అని ఆమె అంటారు. కాగా రాబోయే రోజుల్లో నటిగా తమన్నా మరిన్ని సక్సెస్ లు సొంతం చేసుకోవాలని కోరుకుంటూ ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ అప్ డేట్స్, న్యూస్, ఫొటోస్, రివ్యూస్ కోసం మా సైట్ ఎప్పటికప్పుడు చూస్తూ ఫాలో అవుతూ ఉండండి

Tamanna Instagram & Social Media Viral Pics

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow