OTT Releases This Week Telugu - Interesting Movies Comingup

Latest Telugu movies releasing this week on Netflix, Prime, Hotstar & more.

OTT Releases This Week Telugu - Interesting Movies Comingup

ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఎక్కువగా ఆడియన్స్ అందరు కూడా థియేటర్స్ కంటే ఓటిటిలోనే సినిమాలు చూడడానికి ఇష్టపడుతున్నారు. ఏదైనా సినిమా రిలీజై అది బాగుందని సక్సెస్ టాక్ వస్తేనే చాలా మంది ఆడియన్స్ ఇంటి నుండి థియేటర్స్ కి వెళ్తున్నారు. కొందరేమో టికెట్స్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ఒక కుటుంబం మొత్తం కూడా వెళ్లి సినిమా ఒకసారి చూడడం కష్టం అవుతుందని అభిప్రాయపడుతున్న వారు కూడా ఉన్నారు. 

అందుకే ఎక్కువగా ఏదైనా సినిమా రిలీజ్ అయితే, అనంతరం అది ఓటిటిలోకి ఎపుడు వస్తుంది అనే ఆలోచన చేయడంతో పాటు ఎదురు చూస్తున్నారు కూడా . ముఖ్యంగా కోవిడ్ సమయంలో మెల్లగా ఓటిటి రంగం అభివృద్ధి చెందింది. అప్పట్లో ఆడియన్స్ అందరూ కూడా ఇంటి వద్దనే ఉండిపోవడంతో విపరీతంగా ఓటిటి కంటెంట్ చూడడం మొదలెట్టారు. 

అక్కడినుండి వీటికి  డిమాండ్ బాగా పెరిగింది. ఇక ఓటిటి రేట్స్ కూడా పలు సంస్థలు సాధారణ ఆడియన్స్ కి అందుబాటులోకి తీసుకురావడంతో మెజారిటీ ఆడియన్సు కూడా వాటి యొక్క సబ్ స్క్రిప్షన్ తీసుకుని వాడుకుంటున్నారు. ముఖ్యంగా మన ఇండియా లో అయితే నెట్ ఫ్లిక్స్ (Netflix) అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video) ఆహా (Aha) సోనీ లివ్ (Sony LIV) జిఓ హాట్ స్టార్ (JioHotsar) జీ 5 (Zee 5) వంటి మాధ్యమాలకు ఎక్కువమంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు, ఎప్పటికప్పుడు పెరుగుతున్నారు కూడాను . 

ఇక ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా పలు సినిమాలు ఆడియన్స్ ముందుకు రాగా, అందులో కొన్ని బాక్సాఫీస్ వద్ద హిట్ కాగా మరికొన్ని ఆశించిన స్థాయి సక్సెస్ కాలేదకపోయాయి. ఆ విధంగా థియేటర్స్ లో రిలీజ్ అనంతరం త్వరలో ఓటిటి ఆడియన్సు ముందుకి రానున్న సినిమాలు ఏవి అనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ వారం ఓటీటీలో విడుదలైన తెలుగు సినిమాలు

Jack (Netflix)

యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ జాక్. ఈ మూవీని తొలిసారిగా సరికొత్త జానర్ లో తీశారు భాస్కర్. ఇప్పటివరకు ఎక్కువగా ఫ్యామిలీ, లవ్ మూవీస్ తీసిన భాస్కర్, దీనితో స్పై యాక్షన్ జానర్ ఎంచుకున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ పై గ్రాండ్ గా రూపొందిన జాక్ ఇటీవల ఆడియన్సు ముందుకి వచ్చి ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. ఇక మే 8 న ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ద్వారా ఒత్తిడి ఆడియన్స్ ముందుకి రానుంది .  

Robinhood (Zee 5)

యువ నటుడు నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రాబిన్ హుడ్. ఈ మూవీలో అందాల కథానాయిక శ్రీలీల హీరోయిన్ గా నటించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై గ్రాండ్ గా రూపొందిన రాబిన్ హుడ్ మూవీ రిలీజ్ అనంతరం సక్సెస్ అందుకోలేకపోయింది. విషయం ఏమిటంటే మే 10న ఈ మూవీ జీ 5 ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకి రానుంది 

Akkada Ammayi Ikkada Abbayi (ETV Win) 

యువ యాంకర్ కం నటుడు అయిన ప్రదీప్ మాచిరాజు హీరోగా రూపొందిన లేటెస్ట్ రొమాంటిక్ లవ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. కమెడియన్ సత్య ఒక కీలక పాత్రలో కనిపించిన ఈ మూవీలో దీపికా పిల్లి కథానాయికగా నటించింది. ఏప్రిల్ 11న థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ పర్వాలేదనిపించే విజయం మాత్రమే అందుకుంది. ఇక ప్రముఖ తెలుగు ఓటిటి మాధ్యమం ఈటివి విన్ ద్వారా మే 8న ఓటిటి ఆడియన్స్ ముందుకి రానుంది. 

నెట్‌ఫ్లిక్స్ మరియు ప్రైమ్ వీడియో రిలీజ్‌లు

Odela 2 (Amazon Prime Video)

స్టార్ నటి తమన్నా భాటియా కీలక పాత్రలో వశిష్ట, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ సూపర్ నాచురల్ థ్రిలర్ మూవీ ఓదెల 2. సంపత్ నాని గ్రాండ్ గా నిర్మించిన ఈమూవీకి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 17న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఆశించిన స్థాయి రెస్సాన్స్ అయితే అందుకోలేకపోయింది. ఇక ఈమూవీ మే 16న ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. 

Mad Square (Netflix)

నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ ప్రధానపాత్రల్లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మించిన మూవీ మాడ్ స్క్వేర్. ఇటీవల మంచి అంచనాలతో థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈమూవీ అందరినీ ఆకట్టుకుని పెద్ద సక్సెస్ సాధించింది. అనంతరం ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా ప్రస్తుతం పలు భాషల్లో ఓటిటి ఆడియన్సు కి అందుబాటులోకి వచ్చింది. 

Hit The Third Case (Netflix)

నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన లేటెస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ హిట్ 3. ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా శైలేష్ కొలను దీనిని తెరకెక్కించారు. అయితే ఫస్ట్ డే నుండి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈమూవీలో నాని యాక్టింగ్ అదరహో అనే రేంజ్ లో ఉంది. ఇక ప్రస్తుతం థియేటర్స్ లో అదరగొడుతున్న ఈ మూవీ నాలుగు వారాల థియేట్రికల్ రన్ అనంతరం ఓటిటి ఆడియన్స్ ముందుకి రానుంది. కాగా ఈ మూవీ యొక్క ఓటిటి రైట్స్ ని ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. 

ప్రేక్షకుల అభిప్రాయాలు మరియు రేటింగ్స్

Thudarum (JioHotsar)

మోహన్ లాల్ హీరోగా తరుణ్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తుడరుమ్. ఈ మూవీలో శోభన హీరోయిన్ గ నటించారు. రేజపుత్ర విజువల్ మీడియా సంస్థ గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీ ప్రస్తుతం మలయాళంలో థియేటర్స్ లో అదరగొడుతోంది. ముఖ్యంగా మోహన్ లాల్ పెర్ఫార్మన్స్ కి అందరి నుండి మంచి ప్రసంశలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే బాగా కలెక్షన్ రాబడుతున్న ఈ మూవీ మే 23 నే లేదా మే 30న ప్రముఖ ఓటిటి మాధ్యమం జియో హాట్ స్టార్ ద్వారా ఓటిటి ఆడియన్సు ముందుకి వచ్చే అవకాశం ఉంది. 

కాగా ఇటువంటి మరిన్ని ఓటిటి మూవీ రిలీజ్ అప్ డేట్స్, లేటెస్ట్ టాలీవుడ్ మూవీ న్యూస్, బాక్సాఫీస్ కలెక్షన్స్, రివ్యూస్ కోసం ఎప్పటికప్పుడు మా Telugu Movie Media వెబ్ సైట్ ని బ్రౌస్ చేస్తూ ఉండండి, థాంక్యూ

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow