Best Anushka Shetty Movies You Must Watch
Explore the most popular and critically acclaimed Anushka Shetty movies of all time. From Arundhati to Bhaagamathie, here’s the must-watch list

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం కథానాయికలుగా మంచి క్రేజ్, పాపులారిటీ తో కొనసాగుతున్న వారిలో లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి (Anushka Shetty) కూడా ఒకరు.
మొదటిగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, కింగ్ నాగార్జున ల కలయికలో రూపొందిన సూపర్ మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బెంగళూరు భామ, ఆ మూవీలో తన ఆకట్టుకునే అందం, నటనతో తెలుగు ఆడియన్స్ నుండి మంచి పేరు దక్కించుకున్నారు.
అనుష్క శెట్టి బెస్ట్ మూవీస్ – టాప్ 10 జాబితా
అనంతరం సుమంత్ హీరోగా శ్రీహరి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మహానంది మూవీలో నటించిన అనుష్క, దాని ద్వారా మరింత మంచి పేరు దక్కించుకున్నారు. ఇక అక్కడి నుండి ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ కొనసాగిన అనుష్క, ఆపై సీనియర్ డైరెక్టర్ దివంగత కోడిరామకృష్ణ తీసిన అరుంధతి (Arundhati) మూవీ లో నటించారు.
మొదట ఆ సినిమా చేయలేనని, పెర్ఫార్మన్స్ కి ఎంతో స్కోప్ ఉన్న ఆ మూవీలోని అరుంధతి పాత్రకు తాను న్యాయం చేయలేనని భావించిన అనుష్క, ఆపై కోడిరామకృష్ణ సలహాతో సినిమా చేయడానికి చివరిగా ఒప్పుకున్నారు.
అరుంధతి – పవర్‌ఫుల్ లేడీ ఓరియెంటెడ్ మూవీ
లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన అరుంధతి మూవీ అప్పట్లో అతిపెద్ద సంచలన విజయాన్ని అందుకుని హీరోయిన్ గా అనుష్కకు అతి పెద్ద స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చిపెట్టింది. అందులోని రెండు పాత్రల్లో అనుష్క నటనకు విమర్శకుల నుండి సైతం మంచి ప్రశంసలు దక్కాయి.
ఇక అక్కడి నుండి వరుసగా తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో కూడా ఛాన్స్ లు అందుకుంటూ దూసుకెళ్లిన అనుష్క, ఆపై చాలా మంది స్టార్ హీరోల సరసన నటించి భారీ విజయాలు సొంతం చేసుకున్నారు. దానితో హీరోయిన్ గా అనుష్కకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా లభించింది.
ఇటీవల దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి, పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ ల కలయికలో రూపొందిన బాహుబలి సిరీస్ రెండు సినిమాల్లో దేవసేన పాత్రలో అద్భుతంగా నటించి ఆ సినిమాల భారీ సక్సెస్ ద్వారా ఏకంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నటిగా మరింత గొప్ప గుర్తింపు దక్కించుకున్నారు అనుష్క శెట్టి.
ఇక దాని తరువాత అశోక్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఆమె చేసిన భాగమతి మూవీ కూడా సూపర్ హిట్ కొట్టింది. ఇక దాని అనంతరం ఇటీవల నిశ్శబ్దం అనే థ్రిల్లర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క ఆ మూవీ తో ఆశించిన రేంజ్ సక్సెస్ ని అయితే అందుకోలేకపోయారు.
బాహుబలి సిరీస్ – దేవసేన పాత్రలో చక్కటి నటన
దానితో కొంత ఆలోచనలో పడ్డ అనుష్క, చివరికి ఇటీవల పి. మహేష్ అనే దర్శకుడు చెప్పిన కథకు ఓకే చెప్పారు. ఆ మూవీని మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ మూవీలో యువ నటుడు నవీన్ పోలిశెట్టి హీరోగా నటించారు. కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన ఈమూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సొంతం చేసుకుంది.
ప్రస్తుతం యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఘాటీ (Ghaati) మూవీ చేస్తున్నారు అనుష్క శెట్టి. ఈ మూవీని క్రిష్ జాగర్లమూడి గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ ఏడాదే ఈ మూవీ ఆడియన్సు ముందుకి రానున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్.
అయితే ఇప్పటివరకు స్టార్ హీరోయిన్ గా కమర్షియల్ సినిమాలు, అలానే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా చేసిన అనుష్క, తొలిసారిగా మంచి పవర్ఫుల్ యాక్షన్ పాత్రలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నటిస్తున్నారు.
ప్రేక్షకాభిమానులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలోని కొన్ని యాక్షన్ సీన్స్ లో అనుష్క శెట్టి నటన అద్భుతంగా ఉంటుందని, తప్పకుండా ఈ సినిమా రిలీజ్ తరువాత అనుష్కకి మరింత మంచి పేరు వస్తుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు టాక్.
ఇక అనుష్క చేస్తున్న ఈ పాత్ర ఆమె ఫ్యాన్స్ కి కొంత షాకింగ్ గా ఉన్నప్పటికీ, తప్పకుండా వారికి నచ్చుతుందని అంటున్నారు. కాగా ఈ సినిమాకి సంబందించిన అధికారిక ఫస్ట్ లుక్ గ్లింప్స్ అనౌన్స్ మెంట్ న్యూస్ అతిత్వరలో రానున్నట్లు తెలుస్తోంది.
మరి తొలిసారిగా తన రూటు మార్చి సినిమా చేస్తున్న అనుష్క దీని ద్వారా ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో చూడాలి. మరోవైపు ఘాటీతో పాటు మలయాళంలో Kathanar - The Wild Sorcerer మూవీ కూడా చేస్తున్నారు.
ఈ మూవీ గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొందుతున్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్. ఈ మూవీలో అనుష్క Kalliyankattu Neeli పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ మలయాళంలో అనుష్కకు ఎంత మేర పేరు తీసుకువస్తుందో చూడాలి.
అలానే ప్రస్తుతం పలువురు దర్శకుల నుండి కూడా కథలు వింటున్న అనుష్క శెట్టి ఇక పై మరింత సెలెక్టీవ్ గా సినిమాలు చేసెనుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా ఆమె చేస్తున్న ఈ సినిమాలు మరింత భారీ విజయాలు సొంతం చేసుకుని నటిగా అనుష్క శెట్టికి మరింత మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుందాం. స్టార్ నటి అనుష్క శెట్టి గారికి మా Telugu Movie Media టీమ్ తరపున ముందస్తు అభినందనల.
What's Your Reaction?






