Top Telugu Heroines 2025 – Glamour & Fame List

Check out the top Telugu heroines of 2025. Movies, fame, social media following & latest glamour pics. Find your favorite actress now

Top Telugu Heroines 2025 – Glamour & Fame List

తెలుగు మూవీ (Telugu Movie) ఇండస్ట్రీలో ఇప్పటివరకు అనేకమంది హీరోయిన్స్ వచ్చారు అలానే ఆపై తమ నటనతో ఆకట్టుకున్న అనంతరం అందులో కొందరు వివాహం చేసుకుని తమ తమ లైఫ్ లో సెటిల్ కాగా అక్కడక్కడా మరికొందరు మాత్రం వివాహానంతరం కూడా సినిమాలు చేసారు. 

అయితే మన తెలుగు మూవీ ఇండస్ట్రీలో తొలితరం స్టార్ నటీమణులు అయిన సావిత్రి (Savitri), జామున (Jamuna), అంజలి దేవి (Anjali Devi), షావుకారు జానకి (Sowcar Janaki), కృష్ణకుమారి (Krishna Kumari), రాజశ్రీ (Rjashri), బి సరోజా దేవి (B Saroja Devi) మొదలుకుని ఆ తరువాత వచ్చిన శారదా (Sharada), వాణిశ్రీ (Vanisri), జయంతి (Jayanthi), లక్ష్మి (Lakshmi) అలానే ఆపైన జయసుధ (Jayasudha), జయప్రద (Jayaprada), శ్రీదేవి (Sridevi) విజయశాంతి (VijayaShanti), రాధ (Radha), రాధిక (Radhika Sharatkumar), మాధవి (Madhavi) ఇలాంటి నటీమణుల వరకు ఎవరికి వారు తమ యొక్క ఆకట్టుకునే అందం, అభినయంతో ఎందరో ప్రేక్షకాభిమానుల యొక్క మనసు దోచారు. 

ఇక ఆపైన అనగా 2000వ దశకం తరువాత వచ్చిన నటీమణుల్లో కొందరు ఇప్పటికే కూడా కొనసాగుతున్నారు. ఇక తాజాగా అనగా 2025 నాటికి ఉన్న హీరోయిన్స్ లో కొందరు మంచి క్రేజ్ తో వరుసగా అనేక సినిమా అవకాశాలతో కొనసాగుతున్నారు. ఇక వారిలో ముందుగా రష్మిక మందన్న (Rashmika Mandanna) తొలిసారిగా ఛలో మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద విజయం అందుకున్నారు. 

అంతకముందు కన్నడలో కిరిక్ పార్టీ మూవీ ద్వారా సినీ ఎంట్రీ ఇచ్చిన రష్మిక, ఆ తరువాత తెలుగు ఎంట్రీ తో  చేసుకున్నారు. తరువాత పరశురామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఆమె చేసిన గీతా గోవిందం మూవీ పెద్ద విజయం అందుకుని హీరోయిన్ గా రష్మిక కి విపరీతమైన పేరు తీసుకువచ్చింది. 

అనంతరం సూపర్ స్టార్ మహేష్ తో ఆమె చేసిన సరిలేరు నీకెవ్వరు విజయం కూడా బాగా పేరు తీసుకువచ్చింది. ఆపైన అల్లు అర్జున్ తో పుష్ప 1, పుష్ప 2 సినిమాలు రెండూ కూడా నేషనల్ వైడ్ గా భారీ విజయాలు సొంతం చేసుకున్నాయి. వాటిలో పుష్ప 2 ఏకంగా నేషనల్ వైడ్ గా భారీ కలెక్షన్ అందుకుంది. 

అక్కడి నుండి నేషనల్ క్రష్ గా పాపులర్ అయిన రష్మిక అట్లు తమిళ్ తో పాటు హిందీలో కూడా ఆనిమల్ మూవీతో భారీ విజయం తన ఖాతాలో వేసుకున్నారు. అనంతరం చెప్పుకోవాల్సింది అనుష్క శెట్టి (Anushka Shetty) గురించి. యోగా టీచర్ గా పాపులర్ అయిన అనుష్క తొలిసారిగా నాగార్జున హీరోగా పూరి తీసిన సూపర్ మూవీ ద్వారా తెలుగుకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. 

ఆ తరువాత మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకున్న ఆమెకు కోడిరామకృష్ణ తీసిన అరుంధతి మూవీ భారీ విజయం నటిగా ఆమెని వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది. ఆ తరువాత తెలుగు, తమిళ్ లో దాదాపుగా అందరు స్టార్ నటులతో సినిమాలు చేసిన అనుష్క శెట్టి, ఆపైన బాహుబలి సిరీస్ సినిమాలతో జాతీయ స్థాయిలో ఎంతో పేరు సొంతం చేసుకున్నారు.

ఆ తరువాత ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి విజయం అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఆమె క్రిష్ తో కలిసి ఘాటీ మూవీ చేస్తున్నారు. మరొక హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) గురించి మాట్లాడుకుంటే తొలిసారిగా ఏ మాయ చేసావే సినిమా ద్వారా టాలీవుడ్ ఆడియన్స్ ముందుకి వచ్చి ఫస్ట్ మూవీ తోనే బెస్ట్ హిట్ కొట్టారు సమంత. ఆ తరువాత దూకుడు, బృందావనం, ఈగ సినిమాల భారీ విజయాలు హీరోయిన్ గా సమంత కి స్టార్ స్టేటస్ ని అందించాయి. 

ఆ తరువాత నుండి తెలుగు తో పాటు అటు తమిళ్ లో కూడా స్టార్స్ తో సినిమాలు చేసారు సమంత రూత్ ప్రభు. ఇక అక్కడి నుండి తనకు వచ్చిన అవకాశాలు అన్ని కూడా సద్వినియోగం చేసుకున్న సమంత రూత్ ప్రభు, వాటితో విజయాలు అందుకుని టాలీవుడ్ గోల్డెన్ లెగ్ హీరోయిన్ అనే పేరు సొంతం చేసుకున్నారు. మధ్యలో పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసారు సమంత. 

ఆపైన అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ 2లో రాజీ పాత్రలో ఆకట్టుకున్న ఆమె హిందీలో కూడా పేరు సొంతం చేసుకున్నారు. ఇటీవల హిందీలోనే ఆమె చేసిన సిరీస్ సిటాడెల్ హానీ బన్నీ మంచి పేరు సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం చెప్పుకోబోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) గురించి. కాజల్ తొలిసారిగా లక్ష్మి కళ్యాణం మూవీ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అనంతరం చందమామ, మగధీర మూవీస్ భారీ విజయాలతో ఎంతో పేరు అందుకున్నారు. 

ఇక అక్కడి నుండి స్టార్ నటిగా ఎన్నో అవకాశాలు సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ మన టాలీవుడ్ స్టార్ హీరోస్ సరసన పలు సక్సెస్ఫుల్ సినిమాలని చేశారు. అటు తమిళ్ తో పాటు హిందీలో కూడా పలు అవకాశాలతో దూసుకెళ్లారు ఆమె. ఆ విధంగా తెలుగు, తమిళ్, హిందీలో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక పేరు సొంతం చేసుకున్నారు కాజల్. 

ఇక ఇప్పుడు చెప్పుకోబోతోంది శృతి హాసన్ (Shruti Haasan) గురించి. నటిగా అనగనగా ఒక ధీరుడు మూవీ ద్వారా టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శృతి, ఆపైన పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన గబ్బర్ సింగ్ మూవీతో పెద్ద విజయం అందుకుని అక్కడి నుండి తెలుగులో మంచి అవకాశాలు సొంతం చేసుకున్నారు. 

అనంతరం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తో ఆమె చేసిన శ్రీమంతుడు మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టి హీరోయిన్ గా మరింత విశేషమైన పేరు శృతి హాసన్ కి తీసుకువచ్చింది. ఇక అక్కడి నుండి తెలుగుతో పాటు తమిళ్, హిందీ లలో కూడా అనేక సినిమాలు చేస్తూ దూసుకెళ్లిన శృతి హాసన్ మరోవైపు సంగీత దర్శకురాలిగా అలానే సింగర్ గా కూడా పేరు సొంతం చేసుకున్నారు. 

ఇక చెప్పుకోవాల్సింది కీర్తి సురేష్ గురించి. తొలిసారిగా నేను శైలజ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే సక్సెస్ సొంతం చేసుకున్న కీర్తి సురేష్ (Keerthy Suresh), ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి, నానితో నేను లోకల్ సినిమాలు చేసి పేరు సొంతం చేసుకున్నారు. ఆ తరువాత తెలుగులోనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట వంటి మరొక విజయం అందుకుని దూసుకెళ్లారు. 

అటు తమిళ్ లో కూడా స్టార్స్ సరసన సినిమాలు చేసిన కీర్తి సురేష్ ఇటీవల బేబీ జాన్ మూవీ ద్వారా హిందీలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక సాయి పల్లవి గురించి చెప్పుకుంటే తొలిసారిగా ఫిదా సినిమా ద్వారా ఆమె హీరోయిన్ గా తెలుగుకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా అప్పట్లో పెద్ద విజయం అందుకోవడంతో పాటు అందులో సాయి పల్లవి (Sai Pallavi) చేసిన యాక్టింగ్, డ్యాన్స్ కి అందరి నుండి మంచి ప్రసంశలు లభించాయి. 

ఆ తరువాత తెలుగులో హీరో నానితో ఎం సి ఏ, శ్యామా సింగ రాయ్, అలానే అటు తమిళ్ లో సూర్య తో ఒక మూవీ చేసారు సాయి పల్లవి. ఇక ధనుష్ తో ఆమె చేసిన మారి 2 కూడా బాగా సక్సెస్ అయింది. అనంతరం తెలుగులోనే నాగ చైతన్యతో చేసిన లవ్ స్టోరీ, ఆపైన తమిళ్ లో చేసిన గార్గి సినిమాలు కూడా ఆమెకు నటిగా బాగా పేరు తీసుకువచ్చాయి. 

ఇక ఇటీవల నాగచైతన్య తో ఆమె మరొక్కసారి వర్క్ చేసిన మూవీ తండేల్ కూడా భారీ సక్సెస్ సాధించింది. అలానే అటు తమిళ్ లో శివ కార్తికేయన్ తో అమరన్ వంటి బ్లాక్ బస్టర్ లో కూడా నటించి మరింత మంచి పేరు సొంతం చేసుకున్నారు సాయి పల్లవి. ఇక ప్రస్తుతం తన కెరీర్ పరంగా పలు సినిమాలతో ఆమె కొనసాగుతున్నారు. 

నటిగా తొలిసారిగా నాగ చైతన్య హీరోగా రూపొందిన ఒక లైలా కోసం మూవీ ద్వారా తెలుగుకి పరిచయం అయిన పూజా హెగ్డే (Pooja Hegde) ఆ తరువాత హిందీలో ఏకంగా గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తో కలిసి మొహెంజెదారో మూవీలో నటించి అక్కడ కూడా ఆకట్టుకున్నారు. ఆపైన తెలుగులో అల్లు అర్జున్ తో డీజే, వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్ సినిమాలు చేసారు. 

ఇవి రెండు కూడా హీరోయిన్ గా ఆమెకు బాగానే పేరు తీసుకువచ్చాయి. ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో మహర్షి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత, మరొక్కసారి అల్లు అర్జున్ తో అలవైకుంఠపురములో సినిమాల భారీ విజయాలు స్టార్ హీరోయిన్ గా పూజా హెగ్డే క్రేజ్ విపరీతంగా పెంచేసాయి. 

అనంతరం తమిళ్ లో విజయ్ హీరోగా రూపొందిన బీస్ట్, రామ్ చరణ్ తో ఆచార్య సినిమాల చేసారు. అలానే హిందీలో కూడా పూజా హెగ్డే పలు సినిమాలు చేసారు. కిసి కా భాయ్ కిసి కి జాన్, సర్కస్ సినిమాలు చేసారు. తాజాగా సూర్య హీరోగా ఆమె చేసిన మూవీ రెట్రో బాగా విజయవంతం అయింది. 

ప్రస్తుతం ఇలయదళపతి విజయ్ తో ఆమె చేస్తున్న మూవీ జన నాయగన్ షూటింగ్ దశలో ఉంది. అలానే పలు ఇతర ప్రాజెక్ట్స్ కూడా చర్చల దశలో ఉన్నాయి. ఇక మరొక నటి శ్రీలీల (Sreeleela) గురించి చెప్పాలి అంటే తొలిసారిగా ఆమె పెళ్ళిసందడి మూవీ ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే తన నటన అందంతో అందరినీ మెప్పించారు. 

ఆ తరువాత రవితేజ తో ధమాకా, సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. ఆపైన నితిన్ తో రాబిన్ హుడ్, పంజా వైష్ణవ్ తేజ్ తో ఆదికేశవ సినిమాలు చేసి మెప్పించిన శ్రీలీల ప్రస్తుతం తమిళ్ లో శివకార్తికేయన్ సరసన పరాశక్తి మూవీ ద్వారా కోలీవుడ్ ఎంట్రీ కి సిద్ధమయ్యారు. 

అలానే అటు హిందీలో కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఆషికి 3 మూవీ కూడా ఆమె చేస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని సినిమాలు శ్రీలీల చేస్తున్నారు. కాగా ఈ సినిమాలతో మన టాలీవుడ్ హీరోయిన్స్ మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని మా Telugu Movie Media సైట్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow