Vijay Deverakonda’s Kingdom First Review by Anirudh Ravichander

Anirudh Ravichander shares his first review of Vijay Deverakonda’s Kingdom, calling it superb. The movie is set for a grand release this July

Vijay Deverakonda’s Kingdom  First Review by Anirudh Ravichander

యువ నటుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తొలిసారిగా పెళ్లిచూపులు (Pelli Choopulu) సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వాస్తవానికి అంతకముందు అక్కడక్కడా పలు సినిమాల్లో చిన్న పాత్రలు చేసి ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ, అనంతరం తన స్నేహితుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో చేసిన పెళ్లి చూపులు మూవీతో మంచి విజయం అందుకున్నారు. 

రీతూ వర్మ (Ritu Varma) అందులో హీరోయిన్ గా నటించింది. అనంతరం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో విజయ్ చేసిన బోల్డ్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అర్జున్ రెడ్డి (Arjun Reddy). ఈ మూవీలో షాలిని పాండే (Shalini Pandey) హీరోయిన్ గా నటించారు. అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ పెద్ద విజయం సొంతం చేసుకుంది. 

విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్'పై అనిరుధ్ రవిచందర్ సమీక్ష

ముఖ్యంగా యువతని విశేషంగా ఆకట్టుకున్న అర్జున్ రెడ్డి విజయంతో నటుడిగా ఒక్కసారిగా టాలీవుడ్ లో మంచి పేరు సొంతం చేసుకున్నారు విజయ్ దేవరకొండ. అనంతరం ఆయన చేసిన మూవీ గీతా గోవిందం (Geetha Govindham). నేషనల్ క్రష్ రష్మిక ,మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటించిన ఈ మూవీని పరశురామ్ పెట్ల తెరకెక్కించారు. 

అప్పట్లో భారీ విజయం అందుకున్న ఈ మూవీ నుండి కెరీర్ పరంగా పెద్ద స్టార్ స్టేటస్ అందుకున్నారు విజయ్. అక్కడి నుండి ఎంతో జాగ్రత్తగా కెరీర్ ని ప్లాన్ చేసుకుంటూ కొనసాగుతున్న విజయ్ ఇటీవల ది ఫ్యామిలీ స్టార్ (The Family Star) మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. దీనిని కూడా పరశురామ్ పెట్ల తీశారు. 

అలానే దిల్ రాజు నిర్మించిన ఈమూవీలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా నటించారు. అయితే ఆశించిన స్థాయి విజయం మాత్రం ఈ మూవీ అందుకోలేకపోయింది. వాస్తవానికి అంతకముందు పూరి జగన్నాథ్ తో విజయ్ దేవరకొండ చేసిన లైగర్ (Liger) పరాజయం పాలయినప్పటికీ అనంతరం వచ్చిన ఖుషితో విజయం అందుకున్నారు విజయ్. 

అనిరుధ్: "చాలా బాగుంది, సూపర్బ్" – మ్యూజిక్ డైరెక్టర్ అభిప్రాయం

ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కింగ్డమ్ (Kingdom). ఈ మూవీలో మిస్టర్ బచ్చన్ మూవీ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే (Bhagyasri Borse) హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రలో సత్య దేవ్ నటిస్తున్నారు. 

రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న కింగ్డమ్ మూవీ జులై 4న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. 

కాగా ఈ పాన్ ఇండియన్ యాక్షన్ మూవీని గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తుండగా గిరీష్ గంగాధరన్, జొమోన్ టి జాన్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ తో పాటు హృదయం లోపల అనే పల్లవితో సాగే మెలోడియస్ సాంగ్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై బాగానే అంచనాలు ఏర్పరిచింది. 

ఈ మూవీలో విజయ్ దేవరకొండ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నట్లు టాక్. అయితే విషయం ఏమిటంటే, ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ మాట్లాడుతూ తాను కింగ్డమ్ మూవీలో కొంత భాగం చూశానని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఎంతో సూపర్ గా తీస్తున్నారని అన్నారు. 

'కింగ్‌డమ్' సినిమా విడుదల తేదీ మరియు ఇతర వివరాలు

అలానే విజయ్ యాక్టింగ్ కూడా సూపర్ గా ఉంటుందని, ఓవరాల్ గా మూవీ తప్పకుండా రిలీజ్ అనంతరం పెద్ద విజయం ఖాయం అంటూ తన ఫస్ట్ రివ్యూ అందించారు. మొదటి నుండి తాను పనిచేసే సినిమాలకు తన ట్విట్టర్ (Twitter) ద్వారా రివ్యూ ఇస్తుంటారు అనిరుద్. 

అయితే ఇంకా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న కింగ్డమ్ మూవీకి అనిరుద్ అప్పుడే పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో విజయ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆకట్టుకునే కథ, కథనాలనో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక మూవీకి సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి కూడా మంచి స్కోప్ ఉందని, ఇందులో బీజీఎమ్ తో పాటు విజువల్స్ కూడా గ్రాండియర్ గా ఉండనున్నాయని మా Telugu Movie Media టీమ్ కి సమాచారం ఉంది. మరొక నెలన్నరలో ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow