Anushka Shetty Instagram Official Profile: Latest Photos & Updates
Explore Anushka Shetty's official Instagram profile. Stay updated with her latest photos, videos, and stories.

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం మంచి పేరు, క్రేజ్ తో కొనసాగుతున్న హీరోయిన్స్ లో స్వీటీ అనుష్క శెట్టి కూడా ఒకరు. బెంగళూరుకి చెందిన ఆమె మొదట భూమిక చావ్ల భర్త అయిన భరత్ ఠాకూర్ వద్ద యోగా శిక్షకురాలిగా పని చేసారు. ఆ విధంగా యోగలో మంచి నిపుణత సంపాదించిన అనుష్క శెట్టి అనంతరం తొలిసారిగా తెలుగులో సూపర్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు.
ఈ మూవీలో అక్కినేని నాగార్జున హీరోగా నటించగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మూవీని గ్రాండ్ గా తెరకెక్కించారు. బాలీవుడ్ నటుడు సోను సూద్ కీలక పాత్ర చేసిన ఈ మూవీలో అయేషా టాకియా హీరోయిన్ గా నటించారు. సందీప్ చౌతా మ్యూజిక్ అందించిన ఈ మూవీ 2005లో రిలీజ్ అయి బాగానే సక్సెస్ సాధించింది.
అనుష్క శెట్టి ఆఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్
ఈ మూవీలో షాషా అనే పాత్రలో నటించి అలరించారు అనుష్క. అయితే అక్కడి నుండి మెల్లగా కెరీర్ పరంగా వచ్చిన అవకాశాలు వినియోగించుకున్న అనుష్క శెట్టి. అనంతరం కొన్నాళ్ళకు దివంగత దర్శకుడు కోడిరామకృష్ణ తీసిన హర్రర్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అరుంధతిలో అవకాశం అందుకున్నారు.
మొదట అంతటి పవర్ఫుల్ పాత్ర చేయడానికి కొంత సంకోచించిన అనుష్కని రామకృష్ణ చివరికి ఒప్పించి ఆమెతో నటింపచేసారు. అయితే రిలీజ్ అనంతరం అప్పట్లో అతి పెద్ద సంచలన విజయం సొంతం చేసుకుంది ఆ మూవీ. అలానే ఆ తరువాత పంచాక్షరీ సినిమాలో నటించిన అనుష్క, మెగాస్టార్ చిరంజీవి హీరోగా మురుగదాస్ తీసిన స్టాలిన్ తో పాటు నాగార్జున హీరోగా రూపొందిన కేడి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి ఆకట్టుకున్నారు.
అక్కడి నుండి మరింత జోరుగా కొనసాగిన అనుష్క, ఆపైన ప్రభాస్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి సిరీస్ సినిమాల్లో కీలకమైన దేవసేన పాత్రలో నటించి అవకాశం అందుకున్నారు. ఇక దేశవిదేశాల్లో బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాలు ఎంతటి ప్రభంజనాలు సృష్టించాయి మనకు తెలిసిందే కదా.
తాజా ఫోటోలు మరియు వీడియోలు
ఆ తరువాత భాగమతి, నిశ్శబ్దం సినిమాలు చేసిన అనుష్క, ఇటీవల నవీనీ పోలిశెట్టి హీరోగా యువ దర్శకుడు పి. మహేష్ బాబు తీసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీలో నటించి విజయం అందుకున్నారు. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి తీస్తున్న ఘాటీ తో పాటు మరొక మళయాళ మూవీ కూడా ఆమె చేస్తున్నారు.
ఆ విధంగా కెరీర్ పరంగా అవకాశాలతో కొనసాగుతున్న అనుష్క అటు పలు సమజైక సేవా కార్యక్రమాలు కూడా గుప్తంగా చేస్తుంటారని టాక్. తనకు వీలైనంతలో కరోనా సమయంలో ఎందరో పేదసాదలకు ఆమె భోజనం తోపాటు ధన సహాయం కూడా చేసి తన మానవత్వం చాటుకున్నారు.
అనుష్క శెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యే విధానం
ఇక అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా అనుష్క కు అకౌంట్స్ ఉన్నాయి. అటు ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటిలో అకౌంట్స్ కలిగి ఉన్న అనుష్క శెట్టి తరచూ తన సినీ, వ్యక్తిగత విషయాలు ఫ్యాన్స్, ఆడియన్స్ తో షేర్ చేసుకుంటుంటారు. అయితే ఇకపై మరింత జాగ్రత్తగా పాత్రల ఎంపిక పై అనుష్క దృష్టి పెట్టినట్లు టాక్.
ఇక తాను దిగిన లేటెస్ట్ ట్రెండీ పర్సనల్ ఫోటోషూట్స్ తో పాటు పలు కార్యక్రమాలు, వేడుకలకు హాజరైన విదులు కూడా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తుంటారు అనుష్క. ఆకట్టుకునే అందం, అభినయంతో పాటు అంతే అందమైన మనసు గల నటి అనుష్క అని పలువురు సినీ సెలెబ్రిటీస్ ఆమెను కొనియాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి నటిగా అనుష్క శెట్టి రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
What's Your Reaction?






