Thudarum Movie Review (Telugu): Public Talk, Highlights, and Rating
Read the complete Thudarum movie review in Telugu! Get audience opinions, key highlights, and the official rating of the latest film

'తుడరుమ్' (Thudarum Movie Review) మూవీ రివ్యూ
విడుదల తేదీ : 2025 ఏప్రిల్ 26
తెలుగు మూవీ మీడియా రేటింగ్ : 3.5 / 5
నటీనటులు : మోహన్ లాల్, శోభన, ప్రకాష్ వర్మ, బిను పప్పు, థామస్ మాత్యు, ఫర్హాన్ ఫాసిల్, మణియన్ పిల్లరాజు
దర్శకుడు : తరుణ్ మూర్తి
నిర్మాత : ఎం రెంజిత్
సంగీతం : జేక్స్ బిజోయ్
మోహన్ లాల్ హీరోగా శోభన ప్రధాన పాత్రలో తరుణ్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన తాజాగా యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తుడరుమ్ మూవీ ఆడియన్స్ ముందుకి వచ్చింది. అంతకుముందు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ చేసిన ఎంపురాన్ మూవీ హిట్ అయింది. మరి తాజాగా మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన తుడరుమ్ మూవీ ఏ విధంగా రెస్పాన్స్ అందుకుంది, దాని యొక్క కథ, కథనాలు మొత్తం కూడా పూర్తి రివ్యూలో ఇప్పుడు చూద్దాం.
తుడరుమ్ మూవీ సమీక్ష - పూర్తి వివరాలు
కథ :
కేరళలోని ఒక చిన్న మధ్యతరగతి కుటుంబానికి చెందిన కార్ డ్రైవర్ అయిన షణ్ముగం అలియాస్ బెంజ్ (Mohanlal) తనకున్న బ్లాక్ కలర్ అంబాసిడర్ కారుని తరచు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. తన భార్య లలిత (Sobhana) కొడుకు పవన్ (Thomas Mathew) కూతురు అమృత వర్షిణి (Amritha Varshini) లతో కలిసి ఆనందంగా జీవితం గడుపుతూ ఉంటాడు బెంజ్.
అయితే ఒకరోజున అతడి కారుకి యాక్సిడెంట్ జరుగడంతో దానిని రేపేరుకి ఇస్తాడు షణ్ముగం. అయితే ఆ కారుని రిపేరు చేయడానికి తీసుకున్న షాపు వ్యక్తి దానిని పలు చట్టవిరుద్ధమైన పనుల కోసం వినియోగిస్తాడు. కాగా ఎలాగైనా రిపేరు చేసే వ్యక్తి నుండి తన కారుని తిరిగి తీసుకోవాలని నిర్ణయించుకున్న బెంజ్, ఎస్సై బెన్ని (Binu Pappu) ని ఆశ్రయిస్తాడు.
అనంతరం ఈ కేసుని సిఐ అయిన జార్జి మాథెన్ (Prakash Varma) టేకప్ చేయడం జరుగుతుంది. మరి అయితే చివరికి బెంజ్ యొక్క అంబాసిడర్ కారు దొరికిందా, ఏవిధంగా కథ ముందుకు సాగింది, అసలు ఆ రిపేరు చేసే వ్యక్తి ఎందుకు కారుని అటువంటి తప్పుడు కార్యక్రమాలకు వాడాడు అనేది మొత్తం కూడా సినిమా తెరపై చూడాల్సిందే.
నటీనటుల పెర్ఫార్మన్స్ :
తుడరుమ్ సినిమా హైలైట్స్ మరియు కథ విశ్లేషణ
ముఖ్యంగా మరొక్కసారి ఈ మూవీతో తన అద్భుత నటన ద్వారా ఆడియన్స్ నుండి మరింత మంచి పేరు అందుకున్నారు హీరో మోహన్ లాల్. మధ్యతరగతి వ్యక్తిగా సినిమాలోని పలు కీలక యాక్షన్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో ఆయన నటన ఎంతో బాగుంది.
ఇక ఎన్నో ఏళ్ళ క్రితమే అద్భుత నటుడిగా అందరి నుండి ప్రసంశలు అందుకున్న మోహన్ లాల్ గురించి మరింత ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఆయన భార్య లలితగా నటించిన శోభన కూడా అద్భుతంగా ఆకట్టుకున్నారు. ఆమె పాత్రలో ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ రెండు అంశాలు మనల్ని ఆకట్టుకుంటాయి. ఇక ఇతర పాత్రలు చేసిన బిను పప్పు, ప్రకాష్ వర్మ, థామస్ మాత్యు ల నటన కూడా బాగుంది. ఓవరాల్ గా నటీనటుల ఆకట్టుకునే నటనా ప్రదర్శన ఈ మూవీకి ఒక బలంగా చెప్పవచ్చు.
విశ్లేషణ :
కథ ప్రకారం ఎంతో చిన్న పాయింట్ అయినప్పటికీ దర్శకుడు తరుణ్ మూర్తి తుడరుమ్ మూవీని ఆడియన్స్ ని అలరించేలా చాలావరకు ఆసక్తికరంగానే ముందుకు నడిపారు అని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ చాలా వరకు బాగుంటుంది, అయితే అక్కడక్కడా ట్రాక్ తప్పినప్పటికీ ఇంటర్వెల్ అనంతరం వచ్చే సెకండ్ హాఫ్ బాగానే సాగుతుంది.
కాగా రాబోయే సీన్స్ ప్రత్యేకంగా ట్విస్టుల మాదిరిగా కాకుండా మనం ముందే ఊహించదగిన విధంగా ఉంటాయి. దానివల్ల ప్రత్యేకంగా ఆడియన్స్ లో క్యూరియాసిటీ ఏమి అనిపించదు. ఎక్కువగా కథ, పాత్రల యొక్క నటనా బలం కలిగి ఉన్న ఇటువంటి మూవీలో యాక్షన్ సీన్స్, మంచి పంచ్ డైలాగ్స్, తో పాటు ఒకటి లేదా రెండు సందర్భానుసారం మంచి ఎలివేషన్ సీన్స్ పడి ఉంటె మాస్ ఆడియన్స్ ని కూడా ఈమూవీ మరింతగా ఆకట్టుకునేది.
అయినప్పటికీ ఇటువంటి కథలని ఇలాగే చెప్పాలనే తీరున సాగే మూవీ ఆడియన్స్ ని అలరిస్తుంది. మొత్తంగా ఆడియన్స్ పాత్రలకు సన్నివేశాలకు బాగానే కనెక్ట్ అవుతారు. పెద్దగా బోరింగ్ గా అయితే అనిపించదు. మంచి హృద్యమైన సినిమాలు ఇష్టపడేవారికి తుడరుమ్ ఎంతో బాగా నచ్చుతుంది. ఇక సినిమాలో నిర్మాతల యొక్క నిర్మాణ విలువలు బాగున్నాయి. ముఖ్యంగా మ్యూజిక్ అందించిన జేక్స్ బిజోయ్ సంగీతం మూవీకి ఒక బలం. అలానే ఫోటోగ్రఫి అందించిన షాజీ కుమార్ కూడా పలు కీలక సన్నివేశాలను బాగా చిత్రీకరించారు. అయితే ఎడిటింగ్ విభాగం మరింత శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేదనిపిస్తుంది.
తుడరుమ్ మూవీ ప్రేక్షకుల స్పందన మరియు మూవీ రేటింగ్
ప్లస్ పాయింట్స్ :
ప్రధాన పాత్రల నటన
కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు
కథ, కథనం
మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
యాక్షన్, ఎలివేషన్ సీన్స్ లేకపోవడం
ఊహించదగిన స్క్రీన్ ప్లే
అక్కడక్కడా నెమ్మదించే కథనం
తీర్పు :
మొత్తంగా ఏప్రిల్ 26న మంచి అంచనాల నడుమ తెలుగు, మలయాళ భాషల ఆడియన్స్ ముందుకి వచ్చిన తుడరుమ్ మూవీ బాగానే ఆకట్టుకుంటుందని చెప్పాలి. ముఖ్యంగా మంచి హృద్యమైన సినిమాలు కోరుకునే వారికి ఇదే ఎంతో నచుతుంది. అయితే భారీ యక్షన్, ఎలివేషన్స్, డైలాగ్స్ వంటివి ఆశించేవారికి పెద్దగా నచ్చకపోవచ్చు. అయితే కథ కథనాలు అక్కడక్కడా తప్పించి ఓవరాల్ గా మనల్ని అలరిస్తాయి. వీలైతే తప్పకుండా మీ సమీప థియేటర్స్ లో తుడరుమ్ మూవీని కుటుంబంతో సహా చూసి ఆనందించండి.
What's Your Reaction?






