Sreeleela Biography: Age, Family, Personal Life & Lesser-Known Facts

Sreeleela Family Personal Life Age Humanity తెలుగు సినిమా పరిశ్రమలోని యువ అందాల కథానాయికల్లో శ్రీలీల కూడా ఒకరు. ముఖ్యంగా ఫస్ట్ మూవీ నుండి కెరీర్ పరంగా మంచి విజయాలతో అలానే నటిగా తన ఆకట్టుకునే అందం, అభినయంతో ప్రస్తుతం

Sreeleela Biography: Age, Family, Personal Life & Lesser-Known Facts

తెలుగు సినిమా పరిశ్రమలోని యువ అందాల కథానాయికల్లో శ్రీలీల కూడా ఒకరు. ముఖ్యంగా ఫస్ట్ మూవీ నుండి కెరీర్ పరంగా మంచి విజయాలతో అలానే నటిగా తన ఆకట్టుకునే అందం, అభినయంతో ప్రస్తుతం మంచి క్రేజ్ తో కొనసాగుతున్నారు శ్రీలీల. 

Sreeleela Biography – Age, Family & Personal Life Details

మాస్ మహారాజ్ రవితేజ, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి పెద్ద స్టార్స్ అందరి సినిమాల్లో అవకాశాలతో మంచి క్రేజ్ అందుకున్న శ్రీలీల ప్రస్తుతం అటు తమిళ్, ఇటు హిందీ సినిమాల్లో కూడా మరింతగా దూసుకెళ్తున్నారు. మరి ఆమె పర్సనల్ లైఫ్ కెరీర్ ఫ్యామిలీ గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం 

శ్రీలీల బాల్యం వ్యక్తిగత జీవితం (Sreeleela Childhood Family Life)

శ్రీలీల తండ్రి సూరపనేని శుభాకరరావు, తల్లి హేమలత. ఆమె తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త కాగా తల్లి హేమలత వృత్తి రీత్యా గైనకాలజిస్ట్. కాగా వారి కుటుంబం అమెరికాలో ఇదివరకు నివాసముండేవాడు. అదే సమయంలో 2001 జూన్ 14న మిచిగాన్ లోని డెట్రాయిట్ లో శ్రీలీల జన్మించారు. 

అయితే అప్పటికే ఆమె తల్లితండ్రులు ఒకరినుండి మరొకరు విడిపోయారు. చిన్నతనం నుండే భరతనాట్యం అభ్యసించి మంచి ప్రావిణ్యం సాధించిన శ్రీలీల, యుక్త వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం MBBS విద్యని ఆమె అభ్యసిస్తున్నారు. 

Sreeleela’s Family Background & Early Life

శ్రీలీల మూవీ కెరీర్ (Sreeleela Movie Career)

ముందుగా చిన్నప్పటి నుండి చదువుల్లో ఎంతో చురుకుగా ఉండే శ్రీలీల, అదే సమయంలో భరతనాట్యం కూడా నేర్చుకోవడంతో పాటు అందులో మంచి ప్రావిణ్యం సంపాదించారు. అనంతరం డాక్టర్ విద్యని అభ్యసించాలనుకున్న సమయంలో తెలుగులో జి. అశోక్ దర్శకత్వంలో అంజలి ప్రధాన పాత్రలో రూపొందిన హర్రర్ మూవీ చిత్రాంగదలో ఆమె సింధు తులాని చిన్నప్పటి పాత్ర చేసారు. 

ఆ విధంగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు శ్రీలీల. అనంతరం ఆమె ఫోటోలు చూసిన కన్నడ దర్శకుడు ఏపి అర్జున్, 2019లో తన దర్శకత్వంలో రూపొందనున్న కిస్ మూవీలో ఆమెకు అవకాశం ఇచ్చారు. 

హీరోయిన్ గా శ్రీలీల టాలీవుడ్ ఎంట్రీ (Sreeleela Tollywood Entry as Heroine) 

2021లో సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా గౌరీ రోనంకి దర్శకత్వలో తెరకెక్కిన పెళ్లి సందడి మూవీలో ఆమెకు హీరోయిన్ గా అవకాశం లభించింది. ఈ మూవీకి ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. 

కాగా ఈ మూవీలో కొండవీటి సహస్ర పాత్ర పోషించిన శ్రీలీల తన ఆకట్టుకునే అందం, అభినయంతో మెప్పించారు. ముఖ్యంగా ఆమె డ్యాన్స్ యువతని విశేషంగా అలరించింది. ఆ తరువాత రవితేజ హీరోగా వచ్చిన ధమాకా మూవీ పెద్ద విజయం ఆమెకు టాలీవుడ్ లో మరింత క్రేజ్ తీసుకువచ్చింది. 

ఆ తరువాత రామ్ తో స్కంద, బాలకృష్ణ కుమార్తెగా కనిపించిన భగవంత్ కేసరి, ఆపైన ఏకంగా టాలీవుడ్ సూపర్ స్టార్ (Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన గుంటూరు కారం మూవీ విజయం ఆమెకు మరింత పేరు తీసుకువచ్చింది. 

అలానే అల్లు అర్జున్ హీరోగా రూపొందిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ మూవీ పుష్ప 2 (Pushpa 2 : The Rule) మూవీలో ఆమె చేసిన కిసిక్ సాంగ్ నేషనల్ వైడ్ గా విశేషమైన ఆదరణ సొంతం చేసుకుంది. 

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, యువ నటుడు నితిన్ తో రాబిన్ హుడ్, రవితేజ తో మాస్ జాతర మూవీస్ చేస్తున్నారు. వీటన్నిటి పై ఆడియన్స్ లో ఫ్యాన్స్ లో మంచి హైప్ నెలకొని ఉంది. 

How Old is Sreeleela? Date of Birth & Zodiac Sign

శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ (Sreeleela Kollywood Entry) 

ఇటు తెలుగులో వసరుసగా మంచి విజయాలు సొంతం చేసుకున్న శ్రీలీల తాజాగా శివకార్తికేయన్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న పరాశక్తి మూవీ ద్వారా కోలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. 

రవి మోహన్, అథర్వ, దేవ్ రామ్ నాథ్ కీలక పాత్రలు చేస్తున్న ఈమూవీని డాన్ పిక్చర్స్ సంస్థ పై ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. మరి రిలీజ్ అనంతరం పరాశక్తి మూవీ ద్వారా శ్రీలీల కోలీవుడ్ లో ఎంత మేర క్రేజ్ అందుకుంటారో చూడాలి. 

శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ (Sreeleela Bollywood Entry)

శ్రీలీల తాజాగా బాలీవుడ్ సినిమాలోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. వాస్తవానికి ఆమెను ప్రముఖ నిర్మాత కం దర్శకుడు కరణ్ జోహార్ అక్కడ పరిచయం చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే ఆమె హీరోయిన్ గా కార్తీక్ ఆర్యన్ హీరోయిన్ గా (Aashiqui 3) మూవీతో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అయింది. 

తాజాగా ఆ మూవీకి సంబంధించి రెండు వీడియోస్ ని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసారు కార్తీక్. బాలీవుడ్ లో ఆషికి సిరీస్ మూవీస్ కి మంచి క్రేజ్ ఉంది. మరి ఈ లవ్ యాక్షన్ ఎమోషనల్ మూవీ ద్వారా శ్రీలీల ఎంతమేర అక్కడి ఆడియన్స్ ని అందుకుంటారో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే. 

శ్రీలీల మానవత్వం (Sreeleela Humanity) 

యువ నటిగా ఫస్ట్ మూవీ నుండి తన ఆకట్టుకునే అందం అభినయంతో ఎందరో ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని అలరించిన శ్రీలీల మరోవైపు తనకు వస్తున్న కొంత ఆదాయాన్ని పలు చారిటీస్ కి కూడా అందిస్తూ తనవంతుగా సేవ చేస్తున్నారు. 

అలానే ఇటీవల ఇద్దరు మానసిక దివ్యంగులైన పిల్లలని దత్తత తీసుకుని వారిని పెంచుకుంటున్నారు. ఇంత చిన్న వయసులో కూడా ఈ విధంగా తన మానత్వాన్ని చాటుకుంటున్న శ్రీలీల పై పలువురు ప్రసంశలు కురిపిస్తున్నారు.    

Sreeleela’s Personal Life – Hobbies, Interests & Lifestyle  

శ్రీలీల సోషల్ మీడియా ప్రొఫైల్స్ (Sreeleela Instagram) (Sreeleela Twitter) (Sreeleela Facebook)

ముఖ్యంగా నేటి అందరు నటీనటుల మాదిరిగా శ్రీలీల కూడా తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. తన సినీ, వ్యక్తిగత విషయాలకు సంబందించిన పలు పోస్టుల్ని ఆమె తన సోషల్ మేడి ప్రొఫైల్స్ లో తరచు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ తో తన ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు. 

Lesser-Known Facts About Sreeleela You Should Know

ఆమెకు అటు ట్విట్టర్, ఇటు ఇన్స్టాగ్రామ్ తో పాటు ఫేస్ బుక్ లో కూడా అకౌంట్స్ ఉన్నాయి. అలానే శ్రీలీల కు ఆయా సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ ఉంది. మరి నటిగా ఆమె మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow