Chhaava Box Office Collection Worldwide: Day-Wise Earnings & Total Report

Chhaava Box Office Collection Worldwide ప్రస్తుతం బాలీవుడ్ సినిమా పరిశ్రమలో వరుసగా వస్తున్న సినిమాలు మంచి విజయం సొంతం చేసుకుంటున్నాయి. ఇక ఇటు తెలుగులో ఇటీవల మంచి సక్సెస్ లతో స్టార్ హీరోయిన్ గా బాగా క్రేజ్ సొంతం చేసుకున్న రష్మిక మందన్న

Chhaava Box Office Collection Worldwide: Day-Wise Earnings & Total Report

ప్రస్తుతం బాలీవుడ్ సినిమా పరిశ్రమలో వరుసగా వస్తున్న సినిమాలు మంచి విజయం సొంతం చేసుకుంటున్నాయి. ఇక ఇటు తెలుగులో ఇటీవల మంచి సక్సెస్ లతో స్టార్ హీరోయిన్ గా బాగా క్రేజ్ సొంతం చేసుకున్న రష్మిక మందన్న తాజాగా అక్కడ ఛావా మూవీలో నటించారు. 

Chhaava Box Office Collection Worldwide – Latest Earnings Report

అంతకముందు హిందీలో స్టార్ యాక్టర్ రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తీసిన ఆనిమల్ మూవీలో నటించి అతి పెద్ద విజయం అందుకున్నారు రష్మిక. ఆ మూవీ అప్పట్లో రూ. 950 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుని హీరోయిన్ గా రష్మిక కు అక్కడ మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. 

ఇక తాజాగా అక్కడి ప్రముఖ స్టార్ నటుడు విక్కీ కౌశల్ తో ఆమె చేసిన ఛావా (Chhaava) మూవీ కూడా ఫస్ట్ డే నుండి మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంటోంది. ఆ మూవీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటించగా, ఆయన భార్య యేసు భాయ్ భోంసలే పాత్రలో కనిపించారు రష్మిక. 

Chhaava Movie Day-Wise Box Office Collection & Growth Analysis

ఇక ఈ మూవీలో విక్కీ నటనకు మంచి పేరు లభిస్తుండగా అటు రష్మిక మందన్న నటన పై కూడా బాగా రెస్పాన్స్ లభిస్తోంది. ఈ హిస్టారికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించగా ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాడాక్ ఫిలిమ్స్ పై దినేష్ విజన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత స్థాయిలో నిర్మించారు. 

ముఖ్యంగా ఛావా మూవీ ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణాంతరం ఆ రాజ్యాన్ని ఔరంజేబు వశం చేసుకోవాలని చూడడం, అయితే అదే సమయంలో ఆయన కుమారుడు శంభోజి అడ్డుపడి అతడిని వీరోచితంగా ఎదుర్కోవడం అనే అంశం ఆధారంగా తెరకెక్కించారు. ఇంకా ఈ మూవీలో అశుతోష్ రాణా, అక్షయ్ ఖన్నా, వినీత్ కుమార్ సింగ్, దివ్య దత్త, డయానా పెంటీ తదితరులు కనిపించారు. 

ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రహమాన్ స్వరాలు సమకూర్చిన ఈ మూవీకి సౌరభ్ గోస్వామి ఫోటోగ్రఫి అందించారు. ఫస్ట్ డే అన్ని ఏరియాస్ లో గ్రాండ్ గా రిలీజ్ అయి పాజిటివ్ రాక్ ని అయితే అందుకుంది ఛావా. అక్కడ 2025లో రిలీజ్ అయిన మూవీస్ లో టాప్ ఓపెనర్ గా ఇది నిలిచింది. 

Chhaava Total Collection – India vs Overseas Performance

ఈ ఏడాది ఇప్పటికే అక్షయ్ కుమార్ నటించిన స్కై ఫోర్స్ (Sky Force) మూవీ తొలిరోజు రూ. 15.3 కోట్లు సాధించగా దానిని బ్రేక్ చేసి ఇండియాలో ఈ మూవీ తొలిరోజు రూ. 31 కోట్ల నెట్ కలెక్షన్ ని, అంటే రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. గతంలో విక్కీ కౌశల్ నటించిన ఉరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమా తొలిరోజు రూ. 8.2 కోట్ల కలెక్షన్ సాధించగా తాజాగా ఛావా దానిని బద్దలుకొట్టి ఆయన కెరీర్ కి బిగ్గెస్ట్ ఓపెనింగ్ అందించింది. 

వాస్తవానికి ఛావా అంటే సింహం పిల్ల అని అర్ధం. మరాఠా యోధుడు సింహం అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడిగా సింహం కుమారుడిగా ఇందులో విక్కీ కౌశల్ అదరగొట్టారు. ఫస్ట్ హాఫ్ అంతా బాగుందని, అయితే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ సాగదీసినట్లు ఉన్నాయని, అయితే యుద్ధ సన్నివేశాలు, చివరి అరగంటతో పాటు ఏ ఆర్ రహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సౌరభ్ విజువల్స్ బాగున్నాయనేది మెజారిటీ ఆడియన్స్ చెప్తున్న మాట. 

Chhaava Movie Budget vs Box Office Verdict – Hit or Flop?

ఇక రెండవ రోజు కూడా కలుపుకుని ఈ మూవీ రూ. 67.5 కోట్లని రాబట్టినట్లు చెప్తున్నాయి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు. కాగా ఇది ఇటీవల విక్కీ కౌశల్, త్రిప్తి దిమ్రి (Tripti Dimri ) కలిసి నటించిన బ్యాడ్ న్యూజ్ (Bad Newz)ఓవరాల్ కలెక్షన్ కంటే ఎక్కువ. కాగా మూవీ ఓవరాల్ గా రూ. 64.51 కోట్లని రాబట్టింది. మరి మొత్తంగా రాబోయే రోజుల్లో ఛావా మూవీ ఇంకెంత మేర రాబడుతుందో చూడాలి. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow