Suriya Donates ₹10 Crore from 'Retro' Profits to Agaram Foundation

Actor Suriya donates ₹10 crore from 'Retro' profits to Agaram Foundation, supporting education for underprivileged children in Tamil Nadu

Suriya Donates ₹10 Crore from 'Retro' Profits to Agaram Foundation

తమిళ స్టార్ నటుడు సూర్య (Suriya) గురించి మన తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటుడిగా ఒక్కో సినిమాతో ఎంతో గొప్ప క్రేజ్ తో పాటు ఎందరో ఫ్యాన్స్ యొక్క ప్రేమాభిమానాలు చూరగొంటూ కెరీర్ పరంగా ఒక్కో సినిమాతో దూసుకెళ్తున్నారు సూర్య. 

తన తండ్రి శివ కుమార్ నటనని ఆదర్శంగా తీసుకుని సూర్య తో పాటు ఆయన తమ్ముడు కార్తీ కూడా వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ లు అందుకుంటూ దూసుకెళ్తున్నారు. తమిళనాడులో సూర్య కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక మన తెలుగులో అయితే మురుగదాస్ తీసిన గజినీ మూవీ నటుడిగా సూర్యకి మంచి క్రేజ్ తీసుకువచ్చింది. 

సూర్య – 'రెట్రో' లాభాల నుండి అగరం ఫౌండేషన్‌కు ₹10 కోట్లు విరాళం

అప్పట్లో ఆ మూవీ తమిళ్ తో పాటు తెలుగులో సైతం పెద్ద విజయం సొంతం చేసుకోవడం విశేషం. అనంతరం 7th సెన్స్, రాక్షసుడు, యముడు, యముడు 2 సహా మరికొన్ని సినిమాలతో తెలుగు ఆడియన్సు ముందుకి వచ్చారు సూర్య. తెలుగులో కూడా సూర్య కి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 

కొన్నాళ్ల క్రితం సిరుత్తై శివ దర్శకత్వంలో సూర్య నటించిన సినిమా కంగువ (Kanguva). ఈ మూవీ ఎంతో భారీ వ్యయంతో రూపొందింది. ఆయన తమ్ముడు కార్తీ ఈ మూవీ యొక్క క్లైమాక్స్ లో మనకు కనిపిస్తారు. అయితే ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన కంగువ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. 

అనంతరం యువ కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తో సూర్య చేసిన సినిమా రెట్రో (Retro). ఈ మూవీలో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్ గా నటించగా జయరాం, జోజు జార్జి, శ్రియ శరణ్, నాజర్, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు. ఇటీవల మంచి అంచనాలతో తెలుగు, తమిళ ఆడియన్స్ ముందుకి వచ్చిన రిట్రో మూవీ బాగానే టాక్ అందుకుంది. 

అగరం ఫౌండేషన్‌ ద్వారా విద్యకు మద్దతు

తాజాగా ఈ మూవీ రూ. 100 కోట్ల కలెక్షన్ మార్క్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈమూవీ సూర్య ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. అయితే విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ యొక్క కలెక్షన్స్ నుండి రూ. 10 కోట్ల రూపాయలని తమ అగరం ఫౌండేషన్ (Agaram Foundation) కి విరాళంగా ఇచ్చారు సూర్య. 

దీని వలన ఆ సంస్థ తరపున చదువుకునే విద్యార్థులకి పై చదువుల నిమిత్తం ఆ డబ్బు ఎంతో ఉపయోగపడుతుందని సూర్య వెల్లడించారు. ఇక అగరం ఫౌండేషన్ గురించి మాట్లాడుకుంటే, 2006 సెప్టెంబర్ లో స్థాపించబడ్డ ఈ ఫౌండేషన్ ద్వారా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ధికంగా చదువుకోలేని ఎందరో చిన్నారులకు ఇది చేయూతని అందిస్తుంది. 

'రెట్రో' సినిమా విజయవంతం – బాక్సాఫీస్ కలెక్షన్లు

అలానే వారి చదువులతో పాటు ఇతర అవసరాలకు కూడా కొంత ఆర్ధిక సహాయం ఇస్తున్నారు. ఈ ఫౌండేషన్ నుండి ఇప్పటివరకు అనేక మంది చిన్నారులు చక్కగా చదువుకుని భవిష్యత్తులో రాణిస్తున్నారు. తన భార్య జ్యోతిక తోపాటు కుటుంబం కూడా అన్ని విధాలుగా అగరం ఫౌండేషన్ కి చేయూత నందిస్తునడం, అలానే తమ ద్వారా ఎందరో చిన్నారులకు మంచి జీవితం లభించడం ఎంతో ఆనందంగా ఉందని అంటారు సూర్య. ఈ ఫౌండేషన్ ద్వారా ఆయన చేస్తున్న ఈ గొప్ప పనికి అనేకమంది సినీ ప్రముఖులతో పాటు ప్రజల నుండి కూడా గొప్ప ప్రసంశలు కురుస్తున్నాయి.

అలానే కోవిడ్ సమయంలో ఈ సంస్థ ద్వారా ఆసుపత్రులకు వైద్య పరిరకరాలు అందించడం వంటి మరెన్నో సేవలు అందించి తన గొప్ప మనసు చాటుకున్నారు సూర్య. మొత్తంగా సంస్థ మరింతమంది చిన్నారులకి సరికొత్త జీవితం అందించాలని మనస్ఫూర్తిగా మా Telugu Movie Media టీమ్ కోరుకుంటూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తోంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow