Hari Hara Veera Mallu Trailer Release Date Announced – Pawan Kalyan’s Epic Movie Update
Hari Hara Veera Mallu Trailer Release Date పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా ప్రస్తుతం టోటల్ గా మూడు మూవీస్ సెట్స్ మీద ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే. కాగా ఆ మూడు మూవీస్ ఒకటి ఓజి (OG), మరొకటి హరి హర వీర మల్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా ప్రస్తుతం టోటల్ గా మూడు మూవీస్ సెట్స్ మీద ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే. కాగా ఆ మూడు మూవీస్ ఒకటి ఓజి (OG), మరొకటి హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu), వేరొకటి ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh).
Hari Hara Veera Mallu Trailer Release Date Confirmed – Full Details
కాగా ఈ మూడు సినిమాలు ఇప్పటికే కొంత మేర షూటింగ్ జరుపుకున్నాయి. ముఖ్యంగా వీటిలో ఓజి మూవీ ఆల్మోస్ట్ 80 శాతానికి పైగా షూటింగ్ జరుపుకుంది. ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తుండగా ఆయనకు జోడీగా అందాల కథానాయిక ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటిస్తోంది.
మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీని పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమాని అయిన సుజీత్ తెరకెక్కిస్తున్నారు. గతంలో రన్ రాజా రన్ తో పాటు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో సాహూ వంటి మూవీస్ తెరకెక్కించి మంచి విజయాలు సొంతం చేసుకున్న సుజీత్ ఈ మూవీలో తన అభిమాన పవర్ స్టార్ ని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరూ ఎలా చూడాలి అనుకుంటున్నారో అదే విధంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని అంటోంది టీమ్.
Pawan Kalyan’s Hari Hara Veera Mallu Trailer – What to Expect?
కాగా ఈ మూవీని ఇటీవల ఆర్ఆర్ఆర్ (RRR) వంటి భారీ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీని నిర్మించి అతిపెద్ద విజయం సొంతం చేసుకున్న డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈమూవీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తుండగా ఇతర కీలక పాత్రల్లో కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్ అలానే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు.
ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ ఈ ఏడాది ఆగష్టు లో రిలీజ్ అయ్యే అవకాశం కనపడుతోంది. దీని తరువాత ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా కొంతమేర షూటింగ్ జరుపుకుంది. ఈ మూవీని తమిళ స్టార్ విజయ్ నటించిన సూపర్ హిట్ మూవీ తేరి కి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు హరీష్ శంకర్. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా శ్రీలీల, సాక్షి వైద్య ఇందులో హీరోయిన్స్ గా కనిపించనున్నారు.
Hari Hara Veera Mallu Movie Story, Cast & Budget Details
వీటితో పాటు భారీ ప్రతిష్టాత్మక హిస్టారికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu : Part 1 - Sword vs Spirit) కూడా చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ మూవీలో యువ అందాల నటి నిధి అగర్వాల్ (Nidhi Agerwal) హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో ఆనిమల్ (Animal) నటుడు బాబీ డియోల్, అలానే నర్గీస్ ఫక్రి, నోరా ఫతేహి కనిపించనున్నారు.
ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం కూడా చివరి దశకు చేరుకున్న హరి హర వీర మల్లు నుండి ఇటీవల రిలీజ్ అయిన మూడు గ్లింప్స్ టీజర్స్ అలానే ఒక సాంగ్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఈ మూవీలో గజదొంగ వీరమల్లు పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తుండగా ఆస్కార్ (Oscar) విజేత ఎం ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.
When & Where to Watch Hari Hara Veera Mallu Trailer?
ప్రముఖ సీనియర్ నిర్మాత ఏ ఎం రత్నం అత్యంత గ్రాండ్ లెవెల్లో హై టెక్నీకల్ వాల్యూస్ తో రూపొందిస్తున్న ఈమూవీ మొత్తంగా రెండు భాగాలుగా రూపొందనుండగా మొదటి భాగాన్ని మార్చి 28న పలు భారతీయ భాషల్లో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ఇక ఈ మూవీ నుండి రెండవ పాటని ఫిబ్రవరి 24న రిలీజ్ చేయనున్నట్టు నిన్నటి ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు.
ముఖ్య విషయం ఏమిటంటే ఈ మూవీని ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో పాటు ఏ ఎం రత్నం పెద్ద కొడుడు జ్యోతికృష్ణ కలిసి తెరకెక్కిస్తున్నారు. కాగా లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం హరి హర వీర మల్లు యొక్క థియేట్రికల్ ట్రైలర్ మార్చి మూడవ వారంలో రిలీజ్ కానుందని, ఇక్కడి నుండి వరుసగా సాంగ్స్ ని రిలీజ్ చేసి అతి త్వరలో ట్రైలర్ యొక్క రిలీజ్ డేట్ ని కూడా టీం అనౌన్స్ చేయనుందని చెప్తున్నారు. అలానే పక్కాగా హరి హర వీర మల్లు మూవీ అనుకున్న డేటుకే థియేటర్స్ లో ఉంటుందని టీమ్ చెప్తోంది. మరి ఇటువంటి మరిన్ని మూవీ న్యూస్ అప్ డేట్స్ కోసం మన సైట్ ని ఫాలో అవుతూ ఉండండి.
Hari Hara Veera Mallu vs Other Upcoming Big Trailers – Hype & Expectations
What's Your Reaction?






