SSMB 29 Story Line in Telugu – Mahesh Babu & Rajamouli Movie Plot & Updates

SSMB 29 Story Line Telugu టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి మూవీ వస్తుంది అంటే ఆయన ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎంతో ఆసక్తి నెలకొని ఉంటుంది. ముఖ్యంగా అయన మూవీ రిలీజ్ అవుతుంటే

SSMB 29 Story Line in Telugu – Mahesh Babu & Rajamouli Movie Plot & Updates
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి మూవీ వస్తుంది అంటే ఆయన ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎంతో ఆసక్తి నెలకొని ఉంటుంది. ముఖ్యంగా అయన మూవీ రిలీజ్ అవుతుంటే థియేటర్స్ అన్ని కూడా పండుగ వాతావరణంతో కళకళలాడుతుంది. ఇక ఈ ఏడాది ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు సూపర్ స్టార్ మహేష్.

SSMB 29 Story Line in Telugu – Mahesh Babu & Rajamouli’s Epic Film

  

శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈమూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీలో రమణగాడి పాత్రలో మరొక్కసారి తన మార్క్ మాస్ స్టైల్ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని అలరించి ఆకట్టుకున్నారు మహేష్ బాబు. అయితే దీని అనంతరం టాలీవుడ్ ప్రముఖ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తో ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ యాక్షన్ గ్లోబల్ జంగిల్ అడ్వెంచర్ మూవీ SSMB29 మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు మహేష్ బాబు.

SSMB 29 Movie Plot – What to Expect from This Adventure Film?

ఇక మరోవైపు ఇటీవల ఈ మూవీకి సంబంధించి వేగంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఐతే హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేగంగా జరుగుతోంది. అలానే ఈ మూవీలోని తన పాత్ర కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు పూర్తిగా గడ్డం, క్రాఫ్ తో పాటు బల్క్ గా బాడీని కూడా పెంచుతున్నారు. తాజాగా ఈ మూవీ కోసం మహేష్ బాబు పెంచిన క్రాఫ్, గడ్డం లుక్స్ బయటకు వచ్చి సోషల్ మీడియాలో సెన్సేషనల్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ భారీ మూవీని అత్యంత గ్రాండ్ లెవెల్లో దాదాపుగా రూ. 1000 కోట్ల బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ శ్రీదుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు.

SSMB 29 Story Line was shocking

ఇప్పటివరకు భారతీయ సినీ చరిత్రలో తెరకెక్కని విధంగా అత్యున్నత సాంకేతిక విలువలతో ఎస్ ఎస్ రాజమౌళి ఈ మూవీని తెరకెక్కించేందుకు సిద్దమవుతున్నారట. ఇక ఈ మూవీలో ఇండియా తో పాటు పలువురు హాలీవుడ్ నటులు కూడా నటించనుండగా అందుకోసం ఇప్పటికే ఒక ప్రముఖ హాలీవుడ్ క్యాస్టింగ్ సంస్థ తో దర్శకుడు రాజమౌళి అండ్ టీమ్ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈమూవీకి సంబంధించి ఓవైపు ప్రీ విజువలైజేషన్ తో పాటు క్యారెక్టర్స్ యొక్క స్కెచ్ వర్క్ జరుగుతోందట.

మొత్తంగా అయితే ఈ భారీ క్రేజీ పాన్ వరల్డ్ ప్రాజక్ట్ పై ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ అందరిలో ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తాను తీసిన ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ గా ఆడియన్స్ నుండి గొప్ప క్రేజ్ సొంతం చేసుకున్న రాజమౌళి, ఆ మూవీలోని నాటు నాటు సాంగ్ ద్వారా హాలీవుడ్ అత్యున్నత పురస్కారమైన ఆస్కార్ అవార్డుని ఇండియాకి తీసుకువచ్చారు. కాగా నాటు నాటు సాంగ్ ని కంపోజ్ చేసిన కీరవాణి, రచించిన చంద్రబోస్ ఈ అవార్డుని దక్కించుకున్నారు.

SSMB 29 Release Date & Latest Updates from Rajamouli

దానితో ఆయన తదుపరి మూవీ అయిన SSMB29 ఏ రేంజ్ లో తీస్తారో చూడాలని అందరిలో ఎంతో క్రేజ్ ఏర్పడింది. అయితే విషయం ఏమిటంటే, ఈ భారీ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక పవర్ పాత్రలో కనిపించనుండగా ఆయన పాత్రలో హిందువుల ఆరాధ్య దైవం హనుమంతుల వారి ఛాయలు ఉంటాయని, ఆ విధంగా ఎంతో అద్భుతంగా జక్కన్న అండ్ టీమ్ ఆ పాత్రని డిజైన్ చేస్తోందని టాక్. అలానే మూవీ యొక్క స్టోరీకి కొంత భారతీయ ఇతిహాసం రామాయణంతో పోలిక కూడా ఉంటుందని అంటున్నారు.

SSMB 29 Cast & Crew – Mahesh Babu’s Role & Other Details

ఇక ప్రముఖ హాలీవుడ్ నటులు క్రిస్ హెమ్స్ వర్త్, డ్వేయిన్ జాన్సన్ వంటి వారు ఇందులో కీలక పాత్రలు చేయనున్నట్లు కొన్ని మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అవుతున్నాయి. అయితే అసలు ఈ వార్తలు అన్నిట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలియాలి అంటే మాత్రం SSMB29 మూవీ టీమ్ నుండి అధికారిక ప్రకటన అయితే రావాలి. కాగా ఈ మూవీని రానున్న 2025 సంక్రాంతి అనంతరం సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నట్లు ఇటీవల ఒక కార్యక్రమంలో భాగంగా కథకుడు విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

SSMB 29 Story Line

అలానే మూవీని వీరులైనంత వేగంగా పూర్తి చేసి 2027లో ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు జక్కన్న అండ్ టీమ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందట. ప్రస్తుతం మూవీ యొక్క లొకేషన్స్ సెర్చింగ్ నిమిత్తం సౌత్ ఆఫ్రికా, కెన్యా దేశాల్లో తన టీమ్ తో కలిసి పర్యటిస్తున్నారు జక్కన్న. ఇక మహేష్ బాబు తన కెరీర్ లో ఇప్పటివరకు 28 సినిమాలు చేయగా, ఆయన తన కెరీర్ లో పోషించని విధంగా జక్కన్న ఆయన పాత్రని SSMB29 కోసం సిద్ధం చేస్తున్నట్లు టాక్. ఇక దర్శకుడు రాజమౌళి కూడా తన కెరీర్ లో చేసిన సినిమాలతో పోలిస్తే ఈ మూవీ విషయమై మరింత గట్టిగా శ్రద్ధ పెడుతున్నట్లు తెలుస్తోంది.

SSMB 29 Movie Budget & Production – Biggest Telugu Film Ever?

షూటింగ్ ప్రారంభం అయింది మొదలుకుని చివరికి ముగిసే వరకు అన్ని కూడా ఎక్కడా ల్యాగ్ లేకుండా పక్కాగా షెడ్యూల్స్ జరిగేలా సిద్ధం చేస్తున్నారట. మరోవైపు ఇప్పటికే మూవీ యొక్క పూర్తి స్క్రిప్ట్ కూడా సిద్ధం కాగా, ఈలోపు ఇతర అంశాల విషయమై టీమ్ ని కూడా అలర్ట్ చేశారట జక్కన్న. రాజమౌళి అండ్ ఫ్యామిలీ ఎప్పుడూ కూడా ఆయన వెన్నంటే ఉండి తన సినిమాలకు పని చేయడం ఆయనకు ఒకింత బలం అని చెప్పాలి. ఆయన తనయుడు కార్తికేయ, భార్య రమ రాజమౌళి, వదిన శ్రీవల్లి, అన్నయ్య కీరవాణి కూడా ఇందుకోసం పని చేయనున్నారు.

ఇక సంగీత దర్శకుడు కీరవాణి ఇప్పటికే ఈ మూవీ కోసం ప్రత్యేకంగా మ్యూజిక్ సిట్టింగ్స్ ని ప్రారంభించారని అంటున్నారు. అలానే ముఖ్యంగా ఇంతటి భారీ మూవీని నిర్మించాలి అంటే ఫోటోగ్రఫి, విజువల్స్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకోవాలి కనుక ఆ విషయమై కూడా దీర్ఘంగా ఆలోచన చేస్తున్నారట రాజమౌళి. ముఖ్యంగా పలువురు బడా హాలీవుడ్ మూవీస్ కి వర్క్ చేసిన టీమ్ దీని కోసం పని చేయనున్నారని టాక్. మరి ఇంతటి ప్రతిష్టాత్మక మూవీ అనౌన్స్ మెంట్ సహా ఇతర వివరాలు అన్ని తెలియాలి అంటే టీమ్ నుండి అఫీషియల్ న్యూస్ వచ్చే వరకు ఆగాలి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow