Jr NTR Devara 2 Big Update – Fans Can’t Wait

Jr NTR’s Devara 2 big update is finally here! Fans are eagerly waiting for this blockbuster sequel. Check out the latest details now

Jr NTR Devara 2 Big Update – Fans Can’t Wait

టాలీవుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ దీనిని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ పలు పాన్ ఇండియన్ భాషలో రానున్న ఆగష్టు 14న గ్రాండ్ రిలీజ్ కానుంది. 

Jr NTR Devara 2 Big Update – Full Details Revealed

కాగా దీని తో పాటు ఇప్పటికే కెజిఎఫ్, సలార్ మూవీస్ తో దర్శకుడిగా దేశవ్యాప్తంగా తనకంటూ ఆడియన్స్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించినా ప్రశాంత్ నీల్ తీస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ మూవీలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు టాక్. 

ఇక ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థల పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, కళ్యాణ్ రామ్ గ్రాండ్ గా నిర్మిస్తుండగా రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎంతో పవర్ఫుల్ గా ఉండనుండగా దీనిని వేగంగా పూర్తి చేసి గతంలో తాము ప్రకటించిన విధంగా పక్కాగా 2026 సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 

Why Jr NTR’s Devara 2 Update Is a Game Changer

ఇక ఈ మూవీ యొక్క ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే జరుగగా, త్వరలో సెకండ్ షెడ్యూల్ ని గ్రాండ్ గా ప్రారంభించనున్నారు. కాగా ఎన్టీఆర్ ఈ షెడ్యూల్ లో జాయిన్ అవ్వనున్నారు. ఇక ఈ మూవీ అనంతరం సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్న ఒక క్రేజీ మూవీ చేయనున్నారు ఎన్టీఆర్. కాగా ఈ మూవీ క్రేజీ కాంబినేషన్ మూవీకి కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. 

ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించి కొన్నాళ్లుగా మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అవుతున్నాయి. నేడు జరిగిన మ్యాడ్ స్క్వేర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగముగా ఈ ప్రాజక్ట్ గురించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, దీని గురించి త్వరలో వంశీ అఫీషియల్ గా ఫుల్ డీటెయిల్స్ అనౌన్స్ చేయడంతో పాటు ప్రారంభం నుండి రిలీజ్, ఆపైన ఇతరాలు అన్ని కూడా అతనే చూసుకుంటాడని సరదాగా చెప్పుకొచ్చారు. 

అయితే ఈ సినిమాల అనంతరం కొరటాల శివతో ఎన్టీఆర్ దేవర 2 మూవీ చేయనున్నారు. గత ఏడాది సెప్టెంబర్ లో ఎన్నో అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకి వచ్చిన దేవర మూవీ ఎంతో పెద్ద విజయం అందుకుని హీరోగా ఎన్టీఆర్ యొక్క క్రేజ్, మార్కెట్ వేల్యూ ని అమాంతంగా పెంచేసింది. 

ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించారు. అనిరును అందించిన సాంగ్స్, కొరటాల టేకింగ్ తో పాటు ఎన్టీఆర్ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ దేవర మూవీకి ఎంతో పెద్ద సక్సెస్ అందించాయి. కాగా ఈమూవీ ఇప్పటిలో తెరకెక్కే అవకాశం లేదని కొన్ని మాధ్యమాల్లో ఇటీవల వార్తలు రాగా, అసలు ఈ మూవీ ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయిందని మరికొన్ని మాధ్యమాల్లో ఖాతాలు వైరల్ అయ్యాయి. 

Fans React to Jr NTR’s Massive Devara 2 Announcement

అయితే తాజాగా మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్ లో భాగంగా హీరో ఎన్టీఆర్ దేవర 2 మూవీ గురించి మాట్లాడుతూ, దేవర 2 పక్కాగా ఉంటుందని, అందరి అంచనాలను మించేలా దర్శకుడు కొరటాల మరింత అద్భుతంగా దీనిని తెరకెక్కించనున్నట్లు తెలిపారు. సో, దీనిని బట్టి పక్కాగా దేవర 2 మూవీ ఉంటుందని తేటతెల్లం అయింది. అయితే ఇది పక్కాగా ప్రారంభం అవడానికి మాత్రం మరొక ఏడాదికి పైగానే సమయం పెట్టె ఛాన్స్ ఉంది. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow