Devara 2 Movie: Jr NTR’s Shooting Update Revealed
Jr NTR’s Devara 2 movie shooting updates, release expectations, and on-location buzz with Koratala Siva.

టాలీవుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అటు హృతిక్ రోషన్ తో అయాన్ ముఖర్జీ తీస్తున్న వార్ 2 సినిమాతో పాటు తాజాగా ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ మూవీ యొక్క షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఇక ఈ రెండు సినిమాల పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి.
ముందుగా వార్ 2 మూవీ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. 2019 లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద విజయవంతం అయిన వార్ మూవీకి సీక్వెల్ గా రూపొందుతున్న వార్ 2 మూవీ లో హృతిక్ తో పాటు ఎన్టీఆర్ పాత్ర కూడా ఎంతో పవర్ఫుల్ ఉండడంతో పాటు అందరినీ ఆకట్టుకుంటుందని టీమ్ అంటోంది.
దేవర 2 తాజా షూటింగ్ విశేషాలు
ఇక బాలీవుడ్ అందాల కథానాయిక కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ పై గ్రాండ్ లెవెల్లో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. మరోవైపు దీనితో పాటు ప్రశాంత్ నీల్ తీస్తున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ డ్రాగన్ షూట్ లో రెండు రోజుల క్రితం ఎన్టీఆర్ జాయిన్ అయ్యారు.
ఈ మూవీలో కన్నడ అందాల భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ నటుడు టోవినో థామస్ ఒక కీలక పాత్ర చేస్తున్నట్లు టాక్. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు దీనిని భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.
కాగా వీటిలో వార్ 2 మూవీ రానున్న ఆగష్టు 14న రిలీజ్ కానుండగా ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చిలో రిలీజ్ కానుంది. ఇక ఈ రెండు సినిమాల అనంతరం ఇప్పటికే సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ లో ఒక సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారు ఎన్టీఆర్.
దేవర 2 లో ఎన్టీఆర్ పాత్ర మరియు లుక్
ఈ క్రేజీ కాంబినేషన్ మూవీని కోలీవుడ్ యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, నెల్సన్ మధ్యన పలు కథా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.
అయితే వీటి అనంతరం కొరటాల శివ తీయనున్న దేవర 2 మూవీ చేయనున్నారు ఎన్టీఆర్. గత ఏడాది సెప్టెంబర్ చివర్లో రిలీజ్ అయిన దేవర మూవీ అందరి అంచనాలు అందుకుని బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
దేవర 2 మ్యూజిక్, ఫైట్ సీన్స్ వివరాలు
దానితో అందరిలో దేవర పార్ట్ 2 పై మరింతగా అంచనాలు ఏర్పడ్డాయి. కాగా దేవర 2 మూవీ పార్ట్ 1 ని మించేలా మరింత గ్రాండియర్ గా చిత్రీకరించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే మూవీకి సంబంధించి పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో నిమగ్నం అయి ఉన్నారు కొరటాల శివ. మరోవైపు సంగీత దర్శకుడు అనిరుద్ కూడా దేవర 2 కి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత అద్భుతంగా అందించేందుకు త్వరలో ప్లాన్స్ సిద్ధం చేయనున్నారట.
జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ తో కలిసి యువ సుధా ఆర్ట్స్ వారు నిర్మించనున్నారు. అయితే దేవర మూవీ అనేది ఒక ట్రైలర్ అనుకుంటే దేవర పార్ట్ 2 సినిమా వంటిదని, ఆ విధంగా మూవీలో ఎన్నో గూస్ బంప్స్ తెప్పించే అంశాలు ఉంటాయనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. మొత్తంగా దేవర 2 మూవీ పక్కాగా ఎప్పుడు మొదలవుతుంది అనే దానిపై క్లారిటీ రావాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.
What's Your Reaction?






