Thalapathy Vijay’s Jana Nayagan Teaser on June 22

Jana Nayagan teaser featuring Thalapathy Vijay to be released on June 22 as a special birthday treat for fans. Expectations sky-high

Thalapathy Vijay’s Jana Nayagan Teaser on June 22

కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఇలయదళపతి విజయ్ (Vijay) హీరోగా తాజాగా హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ జన నాయాగన్ (Jana Nayagan). వాస్తవాన్ని అంతకముందు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఆయన చేసిన మూవీ గోట్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (GOAT) (The Greatest of All Time). ఈమూవీలో విజయ్ డ్యూయల్ రోల్ చేయగా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), స్నేహ (Sneha) హీరోయిన్స్ గా నటించారు. 

Thalapathy Vijay teaser release date

అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన గోట్ మూవీ మంచి విజయం సాధించింది. అయితే ప్రస్తుతం విజయ్ చేస్తున్న జన నాయగన్ మూవీ ఆయన కెరీర్ లాస్ట్ మూవీ అనేది తెలిసిందే. పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ప్రేమలు (Premalu) ఫేమ్ మమిత బైజు (Mamitha Baiju) కీలక పాత్ర చేస్తున్నారు. 

జూన్ 22న ‘జన నాయకన్’ టీజర్ తో ధమాకా – తలపతి విజయ్

అయితే ఈ మూవీ తెలుగు బ్లాక్ బస్టర్ హిట్ భగవంత్ కేసరికి రీమేక్ అనే వార్తలు కొన్నాళ్లుగా ప్రచారం అవుతున్నప్పటికీ జన నాయగన్ టీమ్ నుండి దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. ఇందులో ఆనిమల్ మూవీ ఫేమ్ బాబీ డియోల్ విలన్ గా చేస్తుండగా ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ వారు గ్రాండ్ లెవెల్లో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. 

ఇక ఈమూవీలో హీరో విజయ్ పాత్ర నభూతో భవిష్యతి అనే రేంజ్ లో దర్శకుడు వినోద్ రాసుకుని తెరకెక్కిస్తున్నట్లు చెప్తున్నారు. ఆయన ఆఖరి మూవీ కావడంతో ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరూ కూడా ఈమూవీని విజయ్ పాత్రని మనసులో ఎప్పటికీ నిలుపుకుంటారని టాక్. 

Jana Nayagan movie teaser Telugu update

అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న జన నాయగన్ మూవీలో శృతి హాసన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, వరలక్ష్మి శరత్ కుమార్, బాబా భాస్కర్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రానున్న 2026 సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి రానుంది. 

విజయ్ పుట్టినరోజు స్పెషల్ ట్రీట్ – ఫ్యాన్స్ లో ఎదురుచూపులు

తమిళ నాడుతో పాటు దేశవ్యాప్తంగా ఈమూవీని గ్రాండ్ లెవెల్లో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. అయితే విషయం ఏమిటంటే, జూన్ 22న హీరో విజయ్ జన్మదినం సందర్భంగా జన నాయగన్ మూవీ నుండి ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ కానుందని అంటున్నారు. త్వరలో దీనికి సంబంధించి టీమ్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రానుందని చెప్తున్నారు. 

Jana Nayagan Teaser

సత్యన్ సూర్యన్ ఫోటోగ్రఫి అందిస్తున్న ఈ మూవీ కోసం అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఇటీవల హీరో విజయ్ తన తమిళగ వెట్రి కళగం రాజకీయ పార్టీని ఇటీవల నెలకొల్పి ప్రస్తుతం పార్టీ యొక్క అంతర్గత కార్యక్రమాల విషయమై కూడా బిజీగా ఉంటున్నారు. 

జన నాయకన్ టీజర్ టైమింగ్, విడుదల డీటెయిల్స్ 

మొత్తంగా జన నయగన్ రిలీజ్ అనంతరం తన సినీ కెరీర్ మొత్తానికి కూడా వీడ్కోలు పలికి పూర్తిగా ఇకపై తన జీవితం మొత్తం కూడా రాజకీయాలకి, ప్రజాసేవకి ఆయన అంకితం చేసేందుకు సిద్ధమవుతున్నారు. 

Jana Nayagan movie updates in Telugu

కాగా ఈ మూవీ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుండగా విజయ్ రాజకీయ అరంగేట్రం సందర్భంగా అందుకు సంబంధించి కూడా ఈ సినిమాలో అక్కడక్కడా కొన్ని పొలిటికల్ డైలాగ్స్ కూడా ఉన్నాయట. మొత్తంగా అందరిలో విశేషమైన అంచనాలు ఏర్పరిచిన జన నాయగన్ మూవీ మరొక ఆరు నెలల్లో రిలీజ్ అనంతరం ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow