Latest Telugu Industry News 2025 | Movie Updates, Celebrity Gossips, and More

Stay updated with the latest Telugu film industry news! Get all movie updates, celebrity gossips, OTT releases, and box office reports for 2025

Latest Telugu Industry News 2025 | Movie Updates, Celebrity Gossips, and More

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రస్తుతం రోజు రోజుకు ఖండాంతరాలు దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. కొన్నేళ్ల క్రితం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా అనుష్క శెట్టి, తమన్నా హీరోయిన్స్ గా తెరకెక్కిన బాహుబలి సిరీస్ మొదలుకుని మొన్నటి పుష్ప 2 వరకు దాదాపుగా భారతేదేశంలోని అనేక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రికార్డ్స్ తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ఉన్నాయి. ఇక మరోవైపు సౌత్ లోని ఇతర భాషలతో పాటు హిందీ వారు కూడా ఎక్కువగా భారీ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తున్నారు. 

అయినప్పటికీ కూడా చాలా వరకు తెలుగు సినిమాల యొక్క డామినేషన్ విపరీతంగా ఉంది. మరోవైపు తెలుగు స్టార్స్ అందరూ కూడా దాదాపుగా పాన్ ఇండియన్ ని మించి పాన్ వరల్డ్ మార్కెట్ దిశగా కొనసాగుతున్నారు. ఇక ఈ ఏడాది సెట్స్ మీద ఉన్న అలానే త్వరలో ఆడియన్స్ ముందుకి రానున్న Latest TeluguFilm Industry News ఏమిటనేది ఇప్పుడు చూద్దాం. 

SSMB 29 

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తొలిసారిగా ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29. ఈ మూవీ పై మహేష్ ఫ్యాన్స్ అలానే భారతీయ ఆడియన్స్ లో మాత్రమే కాదు యావత్ ప్రపంచం మొత్తంలో సినీ లవర్స్ అందరూ కూడా దీని కోసం కోట్లాది కళ్ళతో ఎదురుచూస్తున్నారు. 

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ తన శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో హై టెక్నీకల్ వాల్యూస్ తో నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలని పోషిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అలానే వి విజయేంద్ర ప్రసాద్ కథని అందిస్తున్నారు. ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ మూవీ యొక్క మూడవ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మూవీని 2027 సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. 

తాజా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వార్తలు 2025

ఓజి : (OG) 

పవర్ స్టార్ పఅ కళ్యాణ్ ఓవైపు రాజకీయాలతో బిజీగా కొనసాగుతూ మరోవైపు సినిమాలు కోడోత్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన చేతిలో ప్రస్తుతం మొత్తం మూడు సినిమాలు ఉన్నాయి. వాటిలో హరీష్ శంకర్ తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ కలిసి తెరకెక్కిస్తున్న హరి హర వీర మల్లు అలానే సుజీత్ తీస్తున్న ఓజి. ఈ మూడు సినిమాల పై అందరిలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. 

అయితే వీటిలో ఒకింత ఎక్కువ అంచనాలతో పాటు నార్మల్ ఆడియన్స్ లో ఓజి మూవీ పై మరింత హైప్ ఉంది. మాస్ యాక్షన్ తో కూడిన గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీగా రూపొందిన ఓజి మూవీలో ప్రియనకే మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తుండగా ఈ మూవీని ఈ ఏడాది సెప్టెంబర్ 5న రిలీజ్ చేయనున్నారు. 

AA 22 

ఇటీవల సుకుమార్ తీసిన పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ మూవీ పుష్ప 2 తో కెరీర్ పరంగా అతిపెద్ద విజయం సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పటికే రెండు సిన్మాలు లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. అందులో ఒకటి హారికా హాసిని క్రియేషన్స్, గీతా కలయికలో త్రివిక్రమ్ తీయనున్న మైథలాజికల్ ఎంటర్టైనర్ అలానే మరోవైపు కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ కుమార్ తో చేయనున్న భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ. 

ఈ రెండు సినిమాల పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ అందరిలో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. ఇటీవల అల్లు అర్జున్, అట్లీ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ ని ఒక చిన్న గ్లింప్స్ ద్వారా రిలీజ్ చేసారు. దానిని బట్టి ఈ మూవీ కోసం అనేక హాలీవుడ్ దిగ్గజ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోస్ వర్క్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ మూవీకి యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించనుండగా ఇందులో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ లో కనిపించనున్నారని టాక్. ఈ మూవీని 2027 లో రిలీజ్ చేయనున్నట్లు చెప్తున్నారు. 

సినిమా రిలీజ్‌లు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

స్పిరిట్ : (Spirit) 

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. అందులో ఒకటి మారుతీ తెరకెక్కిస్తున్న ది రాజా సాబ్ కాగా మరొకటి హను రాఘవపూడి తీస్తున్న మూవీ. ఈ రెండు సినిమాల పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి .

కాగా వీటిలో ది రాజా సాబ్ మూవీ ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది. అలానే హను రాఘవపూడి మూవీ వచ్చే ఏడాది మధ్యలో రిలీజ్ కానుంది. అయితే వీటి అనంతరం త్వరలో ఆనిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ స్పిరిట్ మూవీ చేయనున్నారు ప్రభాస్. 

కాగా ఇందులో ఆయన ఒక సిన్సియర్ పోలీస్ అధికారిగా కనిపించనుండగా రష్మిక మందన్న, జాన్వీ కపూర్ లలో ఒకరు ఇందులో ప్రభాస్ కి జోడీగా కనిపించనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ టాక్. ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనున్న స్పిరిట్ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా టి సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు దీనిని అత్యంత గ్రాండ్ లెవెల్లో నిర్మించనుంది.
 
పెద్ది : Peddi 

మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ పాన్ ఇండియన్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పెద్ది. ఈ మూవీలో బాలీవుడ్ అందాల నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆస్కార్ సంగీత దర్శకుడు ఏ ఆర్ రహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. 

ఇప్పటికే కొంత మేర షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 27న గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి రానుంది. వ్రిద్ది సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థల పై ఎంతో భారీ స్థాయిలో యువ నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ అనంతరం సుకుమార్ తో తన కెరీర్ 17వ మూవీ చేయనున్నారు రామ్ చరణ్. RC 17 వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. 

సెలబ్రిటీ గాసిప్స్ మరియు తాజా ట్రెండ్స్

వార్ 2 : War 2 

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఇటీవల కొరటాల శివ తీసిన దేవర పార్ట్ 1 మూవీ ఎంతో పెద్ద విజయం సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూవీ అనంతరం ఇప్పటికే బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ తో కలిసి యాక్షన్ స్పై మూవీ వార్ 2 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. 

ఈ మూవీలో ఎన్టీఆర్, హృతిక్ ల పాత్రలు అదిరిపోతాయని అలానే హీరోయిన్ గా నటిస్తున్న కియారా అద్వానీ పాత్ర కూడా ఆకట్టుకుంటుందని టీమ్ చెప్తోంది. ఈ మూవీని అయాన్ ముఖర్జీ తీస్తున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకున్న వార్ 2 మూవీ ఈ ఏడాది ఆగష్టు 14న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. 

ఇక మరోవైపు తాజాగా ప్రశాంత్ నీల్ తో ఒక భారీ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ మూవీని లైన్లో పెట్టారు యంగ్ టైగర్. ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు దీనిని సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. రవి బస్రూర్ మ్యూజిక్ ని అలానే భువన గౌడ ఫోటోగ్రఫిని అందిస్తున్న ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూట్ తాజాగా ప్రారంభము అయింది. 

ఈ మూవీలో ఎన్టీఆర్ మునుపెన్నడూ పోషించని ఊరమాస్ పాత్రలో నటిస్తున్నట్లు టాక్. అలానే ఈ మూవీలో అనేక మాస్ యాక్షన్ తో పాటు ఎలివేషన్ సీన్స్ మరో రేంజ్ లో ఉంటాయని అంటున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకి రానుంది.


కాగా వీరితో పాటు మాస్ మహారాజా రవితేజ, యంగ్ యాక్టర్స్ నాచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ, చైతన్య అక్కినేని, సిద్దు జొన్నలగడ్డ సహా మరికొందరి సినిమాలు గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇందులో మెజర్టీ సక్సెస్ అయితే మాత్రం టాలీవుడ్ కీర్తి ప్రతిష్టలు మరింత ఉన్నత స్థాయికి చేరడం ఖాయం. కాగా ఈ మూవీస్ అన్నిటికీ కూడా ముందస్తుగా మా telugumoviemedia.com వెబ్ సైట్ తరపున ముందస్తు బ్లాక్ బస్టర్ శుభాభినందనలు చెప్తున్నాము.    

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow