Keerthy Suresh Images – Latest HD Photos, Saree Looks & Stylish Moments
Explore the latest HD images of Keerthy Suresh, featuring her stunning saree looks, candid moments, and stylish appearances.

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం మంచి పేరు, క్రేజ్ తో తారాపథంలో కొనసాగుతున్న నటీమణుల్లో కీర్తి సురేష్ (Keerthy Suresh) కూడా ఒకరు. అటు తెలుగుతో తమిళ్ తో పాటు హిందీలో సైతం పలు సినిమాలు చేస్తూ కొనసాగుతున్నారు కీర్తి. ముందుగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఆమె ఎంట్రీ ఇచ్చిన మూవీ నేను శైలజ (Nenu Sailaja).
ఈ మూవీని కిశోర్ తిరుమల తెరకెక్కించగా రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా నటించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ అప్పట్లో మంచి విజయం అందుకోవడంతో పాటు హీరోయిన్ గా తొలి చిత్రంతోనే తన ఆకట్టుకునే యాక్టింగ్ టాలెంట్ తో అందరినీ అలరించారు కీర్తి సురేష్.
కీర్తి సురేష్ తాజా ఫోటోలు – స్టైలిష్ లుక్స్ & సారీ స్టైల్స్
వాస్తవానికి అంతకంటే ముందు వికె నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా తెరకెక్కిన అయినా ఇష్టం నువ్వు అనే సినిమా ద్వారా ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా చాలా రోజులు పాటు రిలీజ్ వాయిదా పడడంతో నేను శైలజ రిలీజ్ అయింది. ఇక ఫస్ట్ మూవీ సక్సెస్ తో అటు తమిళ్ లో కూడా మంచి అవకాశాలు అందుకున్నారు కీర్తి సురేష్.
అదే సమయంలో తమిళ నటుడు శివ కార్తికేయన్ తో ఆమె చేసిన సినిమా రెమో మంచి విజయం అందుకుని తమిళ్ కూడా కీర్తికి బాగా పేరు తీసుకువచ్చింది. ఆ తరువాత తెలుగులో నాచురల్ స్టార్ నానితో కలిసి ఆమె చేసిన మూవీ నేను లోకల్ (Nenu Local) మంచి విజయం అందుకుంది.
పాపులర్ లుక్స్ & ఫ్యాషన్ స్టేట్మెంట్స్
అనంతరం ఏకంగా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తీసిన అజ్ఞాతవాసి (Agnyaathavaasi) సినిమాలో ఒక హీరోయిన్ గా అవకాశం అందుకున్నారు కీర్తి సురేష్. ఆ మూవీలో అను ఇమ్మానుయేల్ (Anu Immanuel) కూడా మరొక హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. 2018 సంక్రాంతి సీజన్ లో మంచి క్రేజ్ తో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయింది.
ఆ తరువాత యువ దర్శకుడు నాగ అశ్విన్ తో కీర్తి సురేష్ చేసిన బయోపిక్ మూవీ మహానటి (Mahanati). ఒకప్పటి మహానటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన ఈమూవీలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ కనబరిచిన అద్భుత నటనకు అందరి నుండి విశేషమైన ప్రసంశలు కురవడంతో పాటు మూవీ పెద్ద విజయం అనుకుంది.
కాగా ఈమూవీలో సావిత్రి పాత్రలో అద్భుత నటనకు గాను ఏకంగా భారతదేశ ప్రభుత్వం అందించిన జాతీయ ఉత్తమ నటిగా అవార్డు సొంతం చేసుకున్నారు కీర్తి. ఇక అక్కడి నుండి ఆమెకు అందరిలో విపరీతంగా క్రేజ్ పెరగడంతో పాటు స్టార్ హీరోయిన్ గా పలు భాషల్లో మరిన్ని మంచి అవకాశాలు లభించాయి.
ఆ తరువాత మరొక్కసారి శివ కార్తీయేయన్ సీమ రాజా, చియాన్ విక్రమ్ (Vikram) తో సామి స్క్వేర్, ఇలయదళపతి విజయ్ (Vijay) తో సర్కార్, విశాల్ తో పందెం కోడి 2 సినిమాలు చేసి మరింత మంచి విజయాలు అందుకున్నారు. ఆ సినిమాల తరువాత తమిళనాటు కీర్తి సురేష్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది.
సోషల్ మీడియా నుండి ప్రత్యేక చిత్రాలు
ఆ తరువాత తెలుగులో పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి వాటి ద్వారా బాగా పేరు అందుకున్నారు కీర్తి. ఆపైన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా పరశురామ్ పెట్ల తీసిన సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా చేసారు. ఆ మూవీ మంచి విజయవంతం అయింది.
అనంతరం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా భాటియా (Tamannaah Bhatia) హీరోయిన్ గా మెహర్ రమేష్ తీసిన భోళా శంకర్ (Bholaa Shankar) లో అలానే సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా శివ తెరకెక్కించిన పెద్దన్న సినిమాల్లో ఆ టాప్ స్టార్స్ కి చెల్లెలిగా నటించి ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని మెప్పించారు కీర్తి. ఆపైన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ తీసిన భారీ సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ మూవీ కల్కి 2898 (Kalki 2898 AD) ఏడి మూవీలో బుజ్జి అనే కార్ కి ఆమె డబ్బింగ్ చెప్పి ఆకట్టుకున్నారు.
ఇక ఇటీవల బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు కీర్తి సురేష్. వరుణ్ ధావన్ (Varun Dhawan) హీరోగా రూపొందిన బేబీ జాన్ (Baby John) మూవీలో ఆమె కథానాయికగా నటించారు. తమిళ్ లో విజయ్ హీరోగా అట్లీ తెరకెక్కించిన తేరికి ఇది అఫీషియల్ రీమేక్. కాగా కొన్నాళ్ల క్రితం తన స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ (Antony Thattil) ని వివాహం చేసుకున్న అనంతరం ఇకపై ఎక్కువగా ఎంతో సెలెక్టీవ్ గా చేసేందుకు సిద్ధమయ్యారు కీర్తి సురేష్.
కాగా ప్రస్తుతం తమిళ్ లో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రెండు సినిమాలు రూపొందుతున్నాయి. అవి కన్ని వేడి, రివాల్వర్ రీటా. ఈ రెండు సినిమాలు త్వరలో ఆడియన్స్ ముందుకి రానున్నాయి. అయితే మొదటి నుండి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్, ఆడియన్స్ తో తన సినీ, వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు కీర్తి సురేష్.
ఇక తాజా లేటెస్ట్ ఫోటోషూట్ తాలూకు ఫోటోలు కూడా ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూ ఉంటారు. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ తనకు వీలైనంతలో పలు సామజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు కీర్తి సురేష్. ఆ విధంగా నటిగా మంచి పేరుతో కొనసాగుతున్న అందాల నటి కీర్తి రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలి. ఇటువంటి లేటెస్ట్ స్టార్స్ యొక్క ఫోటోలు, లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా Telugu Movie Media వెబ్ సైట్ తరచు చూస్తూ ఫాలో అవుతూ ఉండండి, ధన్యవాదాలు.
What's Your Reaction?






