Daaku Maharaj OTT Release Date, Streaming Platform & Movie Details
Daaku Maharaaj OTT Release Details టాలీవుడ్ నటుడు నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 (Akhanda 2) మూవీ చేస్తున్నారు. ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ సంస్థ పై గోపి ఆచంట, రామ్ ఆచంట ప్రతిష్టాత్మకంగా

టాలీవుడ్ నటుడు నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 (Akhanda 2) మూవీ చేస్తున్నారు. ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ సంస్థ పై గోపి ఆచంట, రామ్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా సంయుక్తా మీనన్ (Samyuktha Menon) హీరోయిన్ గా నటిస్తున్నారు.
Daaku Maharaj OTT Release Date – When & Where to Watch Online?
ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీ యొక్క షూటింగ్ వేగవంతంగా జరుగుతుండగా దీనిని ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. అంతకముందు బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండ మూవీ భారీ విజయంతో అఖండ 2 పై అందరిలో మరింతగా అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఇటీవల యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ డాకు మహారాజ్ (Daaku Maharaaj). ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సాయి సౌజన్య తో కలిసి యువ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గ్రాండ్ లెవెల్లో నిర్మించగా ప్రగ్య జైస్వాల్ (Pragya Jaiswal) ఇందులో బాలకృష్ణ కు జోడీగా నటించారు.
Daaku Maharaj Movie Story, Cast & Crew – Everything You Need to Know
ఎస్ థమన్ సంగీతం సమకూర్చిన ఈ మూవీ మొన్నటి సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి పెద్ద విజయం సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీలో మరొక్కసారి తన పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు బాలకృష్ణ. అలా డాకు మహారాజ్ మూవీని దర్శకుడు బాబీ ఆకట్టుకునే రీతిన తెరకెక్కించగా విజయ్ కార్తీక్ కన్నన్ అందించిన గ్రాండియర్ విజువల్స్, థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయాయి.
Which OTT Platform Will Stream Daaku Maharaj? Expected Release Date
అలానే నిర్మాతల గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఈ మూవీ యొక్క సక్సెస్ కు మరొక కారణం. చాందిని చౌదరి (Chandini Chowdary), ఊర్వశి రౌటేలా (Urvashi Rautela), శ్రద్ధ శ్రీనాథ్ (Shraddha Srinath), సచిన్ ఖేడేకర్, ఆడుకాలం నరేన్, బాబీ డియోల్, మకరంద్ దేశ్ పాండే తదితరులు ఇందులో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీలో ఐ ఈ ఎస్ సీతారాం గా, డ్రైవర్ నానాజీ గా అలానే డాకు మహారాజ్ గా మొత్తం మూడు షేడ్స్ ఉన్న పాత్రని ఈ మూవీలో బాలకృష్ణ పోషించారు.
Daaku Maharaj Box Office Performance & Digital Rights Updates
బాక్సాఫీస్ వద్ద డాకు మహారాజ్ మూవీ రూ. 170 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుంది. కాగా మ్యాటర్ ఏమిటంటే, తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) ద్వారా మొత్తంగా ఐదు పాన్ ఇండియన్ భాషల ఆడియన్స్ ముందుకి వచ్చింది. అటు థియేటర్స్ లో మంచి బాక్సాఫీస్ కలెక్షన్ సొంతం చేసుకున్న ఈ మూవీ మరోవైపు ఓటిటి ఆడియన్స్ ని కూడా అలరించడం ఖాయం అంటున్నారు మూవీ టీమ్.
Daaku Maharaj Movie Review – Audience & Critics’ Reactions
అయితే ఈ సినిమాలోని ఊర్వశి రౌటేలా నటించిన సీన్స్ ని ఓటిటి లో తీసివేయనున్నారు అంటూ ఇటీవల రూమర్స్ వచ్చాయి. కాగా ఓటిటి వర్షన్ చూసాక అదేమి లేదని అర్ధమయింది. అలానే బాలకృష్ణ తో కలిసి ఆమె చిందేసిన దబిడి దిబిడి (Dabidi Dibidi) సాంగ్ కూడా ఉంది. ఇక డాకు మహారాజ్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. మరి ఓవరాల్ గా ఈ మూవీ ఎంతమేర ఓటిటి ఆడియన్స్ ని మెప్పిస్తుంది అనేది తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.
What's Your Reaction?






