Top Telugu Actresses in Black Dress – Stunning Pics Inside

Here’s a stunning collection of Telugu actresses in black dresses. See how stars like Samantha, Rashmika, and Pooja Hegde rocked the black look

Top Telugu Actresses in Black Dress – Stunning Pics Inside

తెలుగు సినిమా (Telugu Cinema) పరిశ్రమలోని ప్రస్తుతం యువ కథానాయికలు అందరూ కూడా తమ తమ ఆకట్టుకునే అందం, అభినయంతో ఆడియన్స్, ఫ్యాన్స్ యొక్క మెప్పు సొంతం చేసుకుని పలు అవకాశాలు, సక్సెస్ లతో దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఇటీవల వచ్చిన దాదాపుగా అందరు కథానాయికలు కూడా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో అకౌంట్స్ కలిగి ఉన్నారు అలానే వారు అందరూ కూడా ఎప్పటికప్పుడు పలు ఫ్యాషన్ ట్రెండ్స్ ని కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఇక ఇక వారందరూ కూడా ఆ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా ఎప్పటికప్పుడు తమ సినీ, వ్యక్తిగత విషయాలతో పాటు పలు లతో రకరకాల ఫోజుల్లో దిగిన ఫోటీషూట్ తాలూకు ఫోటోలు, వీడియోలు కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వారందరికీ మీడియా మాధ్యమాల్లో ఎంతో క్రేజ్ ఉంది. అయితే అసలు విషయం  ఏమిటంటే, మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్న టాపిక్ బ్లాక్ డ్రెస్ లేదా బ్లాక్ సారీ లుక్ లో మన హీరోయిన్స్ గురించి.(Telugu Actress in Black Dress)

త్రిష కృష్ణన్ (Trisha Krishnan)

టాలీవుడ్ తో పాటు తమిళ్ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా మంచి క్రేజ్ తో పేరుతో కొనసాగుతున్నారు త్రిష. తెలుగులో తరుణ్ హీరోగా నీమనసు నాకు తెలుసు మూవీ ద్వారా ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ప్రభాస్ నటించిన వర్షం, సిద్దార్థ నటించిన నువ్వు వస్తానంటే నేనొద్దంటానా సినిమాల సక్సెస్ లు ఆమెకు విపరీతంగా ఇక్కడ పేరు తీసుకువచ్చాయి. అనంతరం ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్లిన త్రిష, ఆ తరువాత తమిళ్ లో కూడా ఆకట్టుకున్నారు. ఎప్పటికప్పుడు ట్రెండీ ఫ్యాషన్స్ ని ఫాలో అవుతూ ఉంటారు త్రిష

బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న తెలుగు నటీమణులు

కియారా అద్వానీ (Kiara Advani)

ప్రస్తుతం సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్ తో కొనసాగుతున్న హీరోయిన్స్ లో కియారా అద్వానీ కూడా ఒకరు. ఆమె తొలిసారిగా తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ తీసిన భరత్ అనే నేను సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ 2018లో పెద్ద విజయం సొంతం చేసుకుని ఫస్ట్ మూవీతోనే బెస్ట్ సక్సెస్ సొంతం చేసుకున్నారు. అనంతరం రామ్ చరణ్ తో వినయ విధేయ రామ, ఇటీవల గేమ్ ఛేంజర్ సినిమాలు చేశారు అటు హిందీలో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తరచు సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తన లేటెస్ట్ ట్రెండీ స్టైలిష్ ఫోటోషూట్ ఫొటోస్, వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఉంటారు కియారా అద్వానీ.  

సమంత రూత్ ప్రభు (Samanatha Ruth Prabhu)

ఏమాయ చేసావే మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత, ఫస్ట్ మూవీతోనే తన ఆకట్టుకునే అందం, అభినయంతో మెప్పించారు. ఆ తరువాత దూకుడు, బృందావనం, ఈగ సినిమాల్లో నటించి మరొక మూడు విజయాలు సొంతము చేసుకున్న సమంత, అక్కడి నుండి తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎన్నో అవకాశాలు అందుకున్నారు. అనంతరం అటు తమిళ్ లో సైతం స్టార్ హీరోస్ తో నటించి ఆకట్టుకున్నారు సమంత. ఇక ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్, ని స్టయిల్స్ ని ఆమె ఫాలో అవుతూ ఉంటారు. 

అనుష్క శెట్టి (Anushka Shetty)

సూపర్ మూవీతో తెలుగు చిత్ర సీమకి హీరోయిన్ గా పరిచయం అయిన బెంగళూరు భామ అనుష్క శెట్టి, ఆపైన కోడి రామకృష్ణ తీసిన అరుంధతి మూవీ ద్వారా పెద్ద విజయం సొంతం చేసుకుని అక్కడి నుండి భారీ క్రేజ్ తో స్టార్ నటిగా దూసుకెళ్లారు. ఇక ఇటీవల ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ సినిమాలు ఆమెకు జాతీయ స్థాయిలో ఎంతో పేరు క్రేజ్ తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళంలో ఆమె హీరోయిన్ గా బిజీగా దూసుకెళ్తున్నారు. ఇక ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండీ స్టైల్స్ తో పాటు చీరకట్టులో కూడా అదరగొడుతుంటారు అనుష్క.

టాప్ స్టార్స్ సమంత, రష్మిక, పూజా లుక్‌లు

తమన్నా భాటియా (Tamannaah Bhatia)

శ్రీ సినిమా ద్వారా తెలుగు చిత్ర సీమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తమన్నా, ఆ తరువాత హ్యాపీ డేస్ మూవీ ద్వారా హీరోయిన్ గా బాగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. అనంతరం అల్లు అర్జున్ తో బద్రీనాథ్, నాగ చైతన్యతో 100% లవ్ సినిమాలు చేసారు. ఇక అక్కడి నుండి నటిగా ఒక్కో అవకాశంతో దూసుకెళ్లిన తమన్నా, అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పలువురు టాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ సరసన నటించి మంచి విజయాలు అందుకున్నారు. అలానే అటు హిందీలో సైతం మంచి విజయాలతో క్రేజ్ అందుకుని దూసుకెళ్తున్నారు తమన్నా. అయితే మొదటి నుండి అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో అకౌంట్స్ కలిగిన తమన్నా, తన లేటెస్ట్ ట్రెండీ స్టైల్స్ లో దిగిన ఫోటోలు ఎప్పటికప్పుడు వాటిలో పోస్ట్ చేస్తుంటారు. 

శ్రీలీల (sreeleela)

అందాల యువ నటి శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు తమిళ్, హిందీ చిత్ర పరిశ్రమల్లో మంచి ఛాన్స్ లు సొంతం చేసుకుంటూ దూసుకెళ్తున్నారు. పెళ్ళిసందడి మూవీ ద్వారా టాలీవుడ్ కి ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం రవితేజ తో ధమాకా, మహేష్ బాబుతో గుంటూరు కారం, పంజా వైష్ణవ్ తేజ్ తో ఆదికేశవ, నితిన్ తో రాబిన్ హుడ్ సినిమాలు చేసి తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ కొనసాగుతున్నారు. ఇక ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ట్రెండీ స్టైల్స్ తో దిగిన ఫోటోషూట్ తాలూకు ఫోటోలు సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తుంటారు శ్రీలీల

కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)

లక్ష్మి కళ్యాణం మూవీ ద్వారా తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్, ఆ తరువాత చందమామే, మగధీర సినిమాల భారీ విజయాలతో టాలీవుడ్ ఆడియన్స్ లో తనకంటూ ప్రత్యేకమైన పేరు సొంతం చేసుకున్నారు. ఇక ఆపై టాలీవుడ్ లో దాదాపుగా అందరు స్టార్స్ తో ఆమె నటించారు. అనంతరం ఆమెకు తమిళ్ లో కూడా వరుసగా ఆక్వాకాశాలు క్యూ కట్టాయి. అలానే అటు హిందీలో కూడా పలు సినిమాలు చేస్తూ ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా కొనసాగుతున్న కాజల్ కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. ఎప్పటికప్పడు సరికొత్త ట్రెండ్స్ ని ఫాలో అవుతూ దిగిన ఫోటోషూట్ ఫోటోలు అందరితో పంచుకుంటూ ఉంటారు. 

కీర్తి సురేష్ (Keerthy Suresh)


అందాల నటి కీర్తి సురేష్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంతో బిజీ బిజీగా ఉన్నారు. ఇటీవల తన స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ ని ప్రేమించి వివాహం చేసుకున్న కీర్తి సురేష్ తొలిసారిగా నేను శైలజ సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి, మహేష్ బాబు తో సర్కారు వారి పాట సినిమాలు చేసి తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని మెప్పించారు. అటు హిందీలో కూడా ఆమె ఇటీవల బేబీ జాన్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. మొదటి నుండి తనకు ట్రెండీ స్టైల్ అవుట్ ఫిట్స్ తో పాటు ట్రెడిషనల్ వెర్ అంటే కూడా ఎంతో ఇష్టం అని చెప్తూ ఉంటారు కీర్తి 

ఫ్యాన్స్‌ ఫేవరెట్ బ్లాక్ డ్రెస్ ఫొటోలు

శృతి హాసన్ (Shruti Haasan)

కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ తొలిసారిగా సిద్దార్ధ హీరోగా రూపొందిన అనగనగా ఒక ధీరుడు సినిమా దావా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్, మహేష్ బాబుతో శ్రీమంతుడు, ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్యా సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. ఇటీవల అల్లు అర్జున్ తో రేసు గుర్రం, ప్రభాస్ తో సలార్ సినిమాలు చేసి అలరించారు. ఇక బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ కొనసాగుతున్నారు శృతి. ఎప్పటికప్పుడు తనకు నచ్చిన ట్రెండీ లేటెస్ట్ కాస్ట్యూమ్స్ లో దిగిన ఫోటోషూట్ తాలూకు ఫోటోలని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు శృతి 

సాయి పల్లవి (Sai Pallavi)

యువ నటి, అందాల సహజ నటిగా పేరు గాంచిన సాయి పల్లవి తొలిసారిగా శేఖర్ కమ్ముల తీసిన ఫిదా సినిమా ద్వారా తెలుగుకి ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ అప్పట్లో భారీ విజయం అందుకుంది. ఫస్ట్ మూవీలోనే తన మార్క్ నాచురల్ యాక్టింగ్, డ్యాన్స్ తో ఆకట్టుకున్న సాయి పల్లవి అనంతరం వరుసగా అవకాశాలు సొంతం చేసుకుంటూ కొనసాగారు. ఇక తెలుగు తో పాటు తమిళ్ సినిమాల్లో కూడా నటించి ఆకట్టుకున్నారు సాయి పల్లవి. అలానే మలయాళంలో కూడా ఆమె కొన్ని సినిమాలు చేసారు. ఎక్కువగా ట్రెడిషనల్ వెర్ లో కనిపించే సాయి పల్లవి తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఎప్పటికప్పుడు దిగిన ఫోటోషూట్ ఫోటోలు అప్ లోడ్ చేసి ఫ్యాన్స్, ఆడియన్స్ తో పంచుకుంటూ ఉంటారు. 

పూజా హెగ్డే (Pooja Hegde)

ముకుంద సినిమా ద్వారా తెలుగుకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే, దాని అనంతరం ఒక లైలా కోసం, గడ్డలకొండ గణేష్ సినిమాలు చేసి మంచి విజయాలతో నటిగా ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. అనంతరం సూపర్  స్టార్ మహేష్ బాబుతో మహర్షి, అల్లు అర్జున్ తో చేసిన అలవైకుంఠపుమురలో సినిమాలతో భారీ విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు. అనంతరం ఆమెకు తెలుగుతో పాటు తమిళ్ హిందీ సినిమాల్లో అవకాశాలు పెరిగాయి. తమిళ్ లో కూడా స్టార్స్ సరసన నటించి ఆకట్టుకున్న పూజా హెగ్డే, హిందీలో కెరీర్ బిగినింగ్ లో హృతిక్ రోషన్ తో కలిసి నటించారు. అయితే మొదటి నుండి ఫ్యాషన్స్ ని అలానే లేటెస్ట్ ట్రెండ్స్ ని ఎప్పటికప్పుడు ఫాలో అయ్యే పూజా హెగ్డే తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఎంతో యాక్టీవ్ గా ఉంటారు. అలానే ఎప్పటికప్పుడు దిగిన లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలని కూడా ఆమె వాటి ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు.

రష్మిక మందన్న (Rashmika Mandanna)

నేషనల్ క్రష్ గా పేరు గాంచిన రష్మిక మందన్న తొలిసారిగా ఛలో సినిమా ద్వారా తెలుగుకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం నితిన్ తో భీష్మ, మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, ఇటీవల అల్లు అర్జున్ తో పుష్ప 1, పుష్ప 2 సినిమాలు చేసి తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఎందరో ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని మెప్పించారు. అలానే హిందీలో రణబీర్ కపూర్ తో ఆనిమల్ వంటి బ్లాక్ బస్టర్, ఇక తమిళ్ లో విజయ్ తో వరిసు వంటి బిగ్ హిట్ సినిమాలు చేసారు. అయితే ఎక్కువగా సోషల్ మీడియా మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండే రష్మిక, తరచు దిగిన తన లేటెస్ట్ ట్రెండీ ఫోటోషూట్ ఫోటోలని వాటిలో పోస్ట్ చేస్తూ ఉంటారు. 

కాగా ఇటువంటి మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ మూవీ ఆప్ డేట్స్, న్యూస్, రివ్యూస్ కోసం ఎప్పటికప్పుడు మన Telugu Movie Media సైట్ చూస్తూ ఉండండి, ధన్యవాదములు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow