Mahesh Babu Net Worth in 2025 – Income, Assets & Luxurious Lifestyle

Mahesh Babu Net Worth in 2025 మన తెలుగు సూపర్ స్టార్ గా పాతికేళ్ల నుండి టాలీవుడ్ ని రూల్ చేస్తూ కోట్లాది ప్రేక్షకాభిమానుల హృదయాలు కొల్లగొడుతూ దూసుకెళ్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. తొలిసారిగా దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు

Mahesh Babu Net Worth in 2025 – Income, Assets & Luxurious Lifestyle
మన తెలుగు సూపర్ స్టార్ గా పాతికేళ్ల నుండి టాలీవుడ్ ని రూల్ చేస్తూ కోట్లాది ప్రేక్షకాభిమానుల హృదయాలు కొల్లగొడుతూ దూసుకెళ్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. తొలిసారిగా దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు తెరకెక్కించిన నీడ మూవీతో బాలనటుడిగా టాలీవుడ్ కి తండ్రి నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు.

Mahesh Babu Net Worth in 2025 – Total Earnings & Wealth


ఆ తరువాత పలు సినిమాలలో బాలనటుడిగా నటించి ఆడియన్స్, ఫ్యాన్స్ యొక్క మెప్పు సొంతం చేసుకుని అప్పట్లోనే తన నటనతో ఆకట్టుకున్నారు చిన్నారి సూపర్ స్టార్. ఇక చివరిగా బాలచంద్రుడు మూవీ తరువాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి అక్కడి నుండి పైచదువులు, యాక్టింగ్ లో మరింతగా శిక్షణ తీసుకున్నారు మహేష్ బాబు.

ఆ తరువాత 1999లో ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన రాజకుమారుడు మూవీ ద్వారా టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రిన్స్ గా ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ కొట్టారు మహేష్ బాబు. ప్రీతీ జింతా హీరోయిన్ గా నటించిన రాజకుమారుడు మూవీ అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద సూపర్ డూపర్ సక్సెస్ కొట్టడంతో పాటు మహేష్ బాబుకు లక్షలాది అభిమానులని తెచ్చిపెట్టింది.

Mahesh Babu’s Movie Remuneration & Brand Endorsements in 2025

ఇక అక్కడి నుండి వరుసగా అనేక సినిమాల అవకాశాలతో కొనసాగారు మహేష్ బాబు. కాగా మధ్యలో కెరీర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులు కూడా ఎదుర్కొన్న మహేష్, మధ్యలో ఏ మాత్రం తొణకకుండా బెణకకుండా కోట్లాది హృదయాలు కొల్లగొడుతూ, బాక్సాఫీస్ ని బద్దలుకొట్టారు.

ఆపైన ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ తో పాటు ఆయన పలు ఫెయిల్యూర్స్ కూడా చవిచూశారు. అయితే మహేష్ బాబు చేసిన సినిమాలు ఫెయిల్ అయినప్పటికీ నటుడిగా మహేష్ బాబు కెరీర్ లో ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదనేది నగ్న సత్యం. ఆ విధంగా అన్ని వర్గాల ఆడియన్స్ యొక్క తిరుగులేని అభిమానం చూరగొన్నారు మహేష్ బాబు.

ఇక కెరీర్ పరంగా నంది అవార్డులు వంటి పలు ప్రతిష్టాత్మక అవార్డులని సైతం అందుకున్న సూపర్ స్టార్, మొదటి నుండి తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి అడుగుజాడల్లో నడుస్తుండడంతో పాటు తమ గొప్ప మనసు సైతం చాటుకున్నారు.

అప్పట్లో కృష్ణ గారి పద్మాలయ స్టూడియోస్ బాధ్యతలు స్వీకరించి దానికి సంబంధించి ఆర్ధిక సమస్యలు అన్ని కూడా తీర్చిన మహేష్, ప్రస్తుతం టాలీవుడ్ లో రీజినల్ హీరోస్ లో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు అనేది ఒప్పుకుతీరవలసిన సత్యం. ముఖ్యంగా మహేష్ బాబు నుండి మూవీ వస్తుంది అంటే కోట్లాది ఫ్యాన్స్ ఆడియన్స్ లో ఎంతో ఆసక్తితో పాటు థియేటర్స్ వద్ద విశేషమైన పండుగ వాతావరణం నెలకొంటుంది.

అది సూపర్ స్టార్ గా మహేష్ బాబు సంపాదించిన మాస్ కల్ట్ క్రేజ్. ఇక మహేష్ బాబు అటు సినిమాలతో పాటు అనేక బ్రాండ్స్ కి అంబాసడర్ గా కూడా వ్యవహరిస్తూ తద్వారా వచ్చిన ఆదాయంలో 30 శాతం సామజిక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక ఇటీవల తన మహేష్ బాబు ఫౌండేషన్ తరపున ఆంధ్ర హాస్పిటల్స్ వారి ద్వారా వేలాది మంది చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలు చేయించి తన ఉదారత చాటుకుని ఎందరో పాలిటి దేవుడిగా నిలిచారు మహేష్.

ఇక మహేష్ బాబు నెట్ వర్త్ గురించి చెప్పుకోవాలి అంటే, టాలీవుడ్ లో రీజినల్ హీరోస్ లో మహేష్ బాబు రూ. 90 కోట్ల రెమ్యునరేషన్ సొంతం చేసుకుంటూ టాప్ స్టార్ గా దూసుకెళ్తున్నారు. ఇక ఆయన నెట్ వర్త్ 2005 నుండి 2024 వరకు రూ. 500 కోట్లవరకు ఉంటుందనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్.

Mahesh Babu’s Luxurious Lifestyle – Houses, Cars & Properties

ప్రస్తుతం మహేష్ బాబుకు హైదరాబాద్ జూబిలీ హిల్స్ లో రూ. 35 కోట్ల విలువైన బంగ్లా ఉంది. అలానే మరోవైపు రేంజ్ రోవర్, రోల్స్ రాయిస్ ఘోస్ట్, లంబోర్గిని గాలార్డో, ఆడి ఈ ట్రాన్, ఎస్ క్లాస్ మెర్సిడెస్ బెంజ్, బి ఎం డబ్ల్యు ఎక్స్ 6, లెక్సస్ ఎల్ ఎక్స్ 570 కార్స్ ని కలిగి ఉన్నారు. వాటితో పాటు మహేష్ బాబుకు ప్రత్యేకంగా చార్టెడ్ ఫ్లైట్ తో పాటు రూ. 9 కోట్ల విలువైన లావిష్ వ్యానిటీ వ్యాన్ కూడా ఉందని సమాచారం.

నిజానికి తన తొలి మూవీకి రూ. 75 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నారు మహేష్. ఇక అక్కడి నుండి హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా కొనసాగిన మహేష్, ఒక్కో సినిమాతో రెమ్యునరేషన్ పరంగా కూడా దూసుకెళ్లారు. మధ్యలో జయంత్ సి పరాన్జీతో సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన యాక్షన్ కౌబాయ్ మూవీ టక్కరి దొంగకు ఆయన ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు.

ఈ విషయం పలు సందర్బాల్లో జయంత్ స్వయంగా వెల్లడించారు. నిజానికి అంతకముందు జనరేషన్ లో టాప్ ప్లేస్ లో మెగాస్టార్ చిరంజీవి కొనసాగిన విషయం తెలిసిందే. ఆ తరువాత జనరేషన్ లో వచ్చిన హీరోల్లో మహేష్ బాబుకు అన్ని వర్గాల్లో క్రేజ్ కలిగి ఉండడంతో ఆయన మూవీస్ కి భారీ క్రేజ్, సెట్టింగ్స్, మార్కెట్ కూడా జరుగుతుండడంతో టాప్ స్టార్ గా దూసుకెళ్తున్నారు.  

ఇక ఒక్క పాన్ ఇండియన్ మూవీ చేయనప్పటికీ మహేష్ బాబుకు హిందీ సహా పలు ఇతర భాషల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. దేశవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ కాంటెస్ట్ లో ఒకానొక సమయంలో బాలీవుడ్ టాప్ స్టార్స్ అందరినీ సైతం తలదన్ని ఇండియా వైడ్ నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగిన మహేష్, ఆ తరువాత ఫరెవర్ డిజైరబుల్ మ్యాన్ గా మరింత గొప్ప ఖ్యాతిని సొంతం చేసుకున్నారు.
Mahesh Babu’s Business Ventures & Investments 

ఇక ముఖ్యంగా మహేష్ బాబు ఒక యాడ్ చేస్తున్నారు అంటే దానికి బ్రాండ్ వాల్యూ కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మహేష్ చేసిన థమ్స్ అప్, ప్రోవోగ్, లాయిడ్, ఒట్టో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాయి. ఇక ఎక్కువగా తన లైఫ్ ని సినిమాల తరువాత ఫ్యామిలీ కోసం కేటాయిస్తూ మంచి ఫ్యామిలీ మ్యాన్ గా కూడా పేరు సొంతం చేసుకున్నారు మహేష్.

ఇక త్వరలో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో చేయనున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 కోసం సూపర్ స్టార్ మహేష్ ఏకంగా రూ. 175 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని అంటున్నారు. ఈ మూవీ దాదాపుగా రూ. కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందే అవకాశం కనపడుతోంది.

Mahesh Babu’s Net Worth Growth Over the Years

ఇక ఈ మూవీ కనుక పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ విజయం సొంతం చేసుకుంటే, హీరోగా మహేష్ బాబు క్రేజ్, మార్కెట్, బ్రాండ్ వేల్యూ ఊహకందనంత ఎత్తుకు చేరడం ఖాయం అని తెలుస్తోంది. కాగా ఇటీవల 49వ పుట్టినరోజు జరుపుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోయే రోజుల్లో మరింత గొప్ప విజయాలు సొంతం చేసుకుని భారీ క్రేజ్ తో దూసుకెళ్లాలని కోరుకుందాం.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow