SSMB29 Villain: Big Rumor Spreading Like Wildfire!
A huge rumor about the SSMB29 villain is going viral. Is there any truth to it? Read the full details here!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న లేటెస్ట్ ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ SSMB 29. ఈ మూవీ పై వరల్డ్ వైడ్ ఆడియన్స్ అందరిలో కూడా ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి.
Big Rumor on SSMB29 Villain!
ఆర్ఆర్ఆర్ జక్కన్న తీస్తున్న ఈమూవీ ఖచ్చితంగా వరల్డ్ ఆడియన్స్ ని అలరించేలా రూపొందుతోందని టాక్. ఇప్పటికే హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ యొక్క సెకండ్ షెడ్యూల్ ప్రస్తుతం ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో జరుగుతోంది.
కాగా రెండు రోజుల క్రితం SSMB29 మూవీకి సంబంధించి షూటింగ్ స్పాట్ నుండి ఒక చిన్న వీడియో బైట్ లీక్ కావడంతో వెంటనే అప్రమత్తమైన టీమ్ వారు లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
ఇకపై షూటింగ్ స్పాట్ నుండి ఎటువంటి లీక్స్ జరుగకుండా అంతటా కూడా మూడంచెల భద్రతని ఎంతో పటిష్టంగా ఏర్పాటు చేశారట. మరోవైపు ఈ మూవీలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు చేస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతాన్ని వి. విజయేంద్రప్రసాద్ కథని అందిస్తున్నారు.
A Powerful Villain for Mahesh Babu's Movie?
శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోని సినీ చరిత్రలోనే అత్యధిక వ్యయంతో నిర్మితం అవుతున్న ఈమూవీ 2027 సమ్మర్ లో వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి రానున్నట్లు టాక్.
కాగా మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీలో ప్రియాంక, పృథ్వీరాజ్ నెగటివ్ పాత్రలు చేస్తున్నప్పటికీ ఇందులో ఒక ప్రముఖ హాలీవుడ్ నటుడు మెయిన్ విలన్ గా నటించనున్నారు అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల బజ్. ఇప్పటికే పలువురు హాలీవుడ్ నటులు ఎంపిక కోసం అక్కడి ప్రముఖ ఏజెన్సీ సిఏఏ తో జక్కన్న ఒప్పందం కుదుర్చుకున్నారట.
కాగా ఇందులో థార్ మూవీ హీరో క్రిస్ హెమ్స్ వర్త్ మెయిన్ విలన్ గా నటించనున్నారు అనే వార్తలు కూడా కొన్నాళ్లుగా పలు మీడియా మాధ్యమాల్లో విరివిగా ప్రచారం అవుతున్నాయి. ఇక ఈ మూవీలో మహేష్ బాబు పాత్ర హనుమంతుని పాత్ర యొక్క ఇన్స్పిరేషన్ తో రాసుకున్నారని, ఆ విధమైన ఛాయలతో ఆయన పాత్ర ఉంటుందని టాక్.
SSMB29 How True Is This News?
మరోవైపు ఈ మూవీ కోసం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో భారీ కాశీ సెట్టింగ్ కూడా వేయడంతో ఇది టైం ట్రావెల్ తో సాగె మైథలాజి కథ అనేది కూడా మరికొందరి అనుమానం.
మొత్తంగా SSMB29 మూవీకి సంబంధించి ప్రచారం అవుతున్న కథనాలు అన్ని కూడా ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అధికారికంగా టీమ్ దీని గురించి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ ఇచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ మూవీలో మహేష్ బాబు పాత్ర పేరు రుద్ర అని కూడా అంటున్నారు.
Rising Expectations Among Mahesh Fans?
ఇక తన పాత్ర కోసం ఇప్పటికీ ఫుల్ గా క్రాఫ్ తో పాటు గడ్డం కూడా పెంచేసి సిద్ధమయ్యారు సూపర్ స్టార్. ఆ విధంగా ఈ సినిమాకి సంబంధించి ఏదైనా పిసరంత న్యూస్ బయటకు వస్తే చాలు దానిని కొండంతగా ప్రచారం చేసేస్తున్నారు. కాగా ఈ మూవీ యొక్క అధికారిక అనౌన్స్ మెంట్ తెలుగు సంవత్సరాది ఉగాది నాడు ఉంటుందని కూడా అంటున్నారు. వీటన్నిటిలో ఎంతవరకు ఏవేవి నిజాలో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగక తప్పదు.
What's Your Reaction?






