Rare Facts About Vijay Deverakonda That Will Surprise You

Explore some surprising and rare facts about Vijay Deverakonda’s life, career, and attitude that define his unique personality

Rare Facts About Vijay Deverakonda That Will Surprise You

నటుడిగా ప్రస్తుతం ఒక్కో సినిమాతో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా దూసుకెళ్తున్నారు యువ నటుడు విజయ్ దేవరకొండ. కెరీర్ పరంగా ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. తాజాగా ఆయన చేస్తున్న మూవీ గౌతమ్ తిన్ననూరి తీస్తున్న కింగ్డమ్. ఈ మూవీలో యువ అందాల నటి భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. 

ఈ మూవీని పాన్ ఇండైన రేంజ్ లో గ్రాండ్ లెవెల్లో సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య తో కలిసి సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న కింగ్డమ్ మూవీ జులై చివర్లో ఆడియన్స్ ,ముందుకి వచ్చే అవకాశం ఉంది. 

Unknown Facts about Vijay Deverakonda

ఇక దీనిపై అనంతరం త్వరలో దిల్ రాజు నిర్మాతగా యువ దర్శకుడు రవికిరణ్ కోలా తీయనున్నారు రౌడీ జనార్ధన మూవీ కూడా చేయనున్నారు విజయ్ దేవరకొండ. ఈ మూవీని ఎంతో గ్రాండియర్ రేంజ్ లో రూరల్ మాస్ యాక్షన్ కమర్షియల్ డ్రామాగా నిర్మించనున్నారు. మొత్తంగా అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ క్రేజీ ప్రాజక్ట్ త్వరలో పట్టాలెక్కనుంది. 

వీటి తరువాత మరోవైపు మరొక యువ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తో ఒక భారీ పీరియాడిక్ యక్షన్ మూవీ కూడా చేయనున్నారు విజయ్ దేవరకొండ. గతంలో తనతో కలిసి చేసిన టాక్సీ వాలా మూవీ మంచి విజయం అందుకోవడంతో మరొక్కసారి అతడికి ఛాన్స్ ఇచ్చారు విజయ్. 

విజయ్ దేవరకొండ గురించి అరుదైన విషయాలు

అయితే ఈ సినిమాల తరువాత టాలీవుడ్ పాన్ ఇండియన్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో కూడా ఒక మూవీని లైన్ లో పెట్టారు విజయ్. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ తో మూవీ చేసేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్న సుకుమార్, దాని అనంతరం పుష్ప 3 తీయనున్నారు. ఈ రెండు సినిమాల తరువాత సుకుమార్ తో విజయ్ దేవరకొండ మూవీ రూపొందనున్నట్లు తెలుస్తోంది. 

ఇక విజయ్ దేవరకొండ సినిమా ప్రారంభ ప్రస్థానం గురించి చెప్పుకుంటే హీరోగా పెళ్ళిచూపులతో లైఫ్ ప్రారంభించినప్పటికీ అంతకముందు పలు సినిమాల్లో అక్కడక్కడా చిన్న చిన్న పాత్రలు చేసి ఆకట్టుకున్నారు విజయ్ దేవరకొండ. 2011 లో రవిబాబు తీసిన నువ్విలా సినిమాలో చిన్న పాత్ర ద్వారా టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చారు విజయ్. ఆ తరువాత శేఖర్ కమ్మల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, తరువాత నాని హీరోగా నాగ అశ్విన్ తీసిన ఎవడె సుభ్రహ్మణ్యం సినిమాలో ఆయన నటించారు. 

అయితే ఎవడే సుబ్రహ్మణ్యంలో విజయ్ పోషించిన పాత్ర మంచి పేరు తీసుకువచ్చింది. అనంతరం తన స్నేహితుడు తరుణ్ భాస్కర్ తీసిన పెళ్లి చూపులు మూవీతో హీరోగా మారారు విజయ్ దేవరకొండ. ఆ మూవీలో రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా రిలీజ్ అనంతరం అది విజయవంతం అయింది. ఆ తరువాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన మూవీ అర్జున్ రెడ్డి. ఇందులో షాలిని పాండే హీరోయిన్ గా నటించగా సీనియర్ లెజెండరీ నటి కాంచన ఒక కీలక పాత్ర చేసారు. 

కాగా రిలీజ్ అనంతరం అర్జున్ రెడ్డి మూవీ పెద్ద విజయం అందుకోవడం ఒక్కసారిగా విజయ్ దేవరకొండని స్టార్ నటుడిగా మార్చేసింది. అనంతరం పరశురామ్ పెట్లతో విజయ్ చేసిన మూవీ గీత గోవిందం. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీ అతి పెద్ద బాక్సాఫీస్ సంచలనంగా నిలిచి హీరోగా విజయ్ రేంజ్ ని క్రేజ్ ని అమాంతంగా పెంచేసింది. 

Vijay Devarakonda Movies List

ఇక ఆ తరువాత నోటా, డియర్ కామ్రేడ్, టాక్సీ వాలా సినిమాలు చేసారు విజయ్. ఇక ఇటీవల తొలిసారిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన తొలి పాన్ ఇండియన్ మూవీ లైగర్. ఈ మూవీలో బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్ గా నటించగా ఛార్మి తో కలిసి పూరి జగన్నాథ్ దీనిని గ్రాండ్ గా నిర్మించారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయింది. 

అనంతరం శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి విజయ్ దేవరకొండ చేసిన మూవీ ఖుషి. ఇది రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద విజయవంతం అయింది. ఇక ఇటీవల మరొక్కసారి పరశురామ్ పెట్ల తో విజయ్ చేసిన మూవీ ది ఫ్యామిలీ స్టార్ యావరేజ్ సక్సెస్ అయింది. అనంతరం ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ తీసిన పాన్ ఇండియన్ మూవీ కల్కి లో అర్జునుడిగా క్యామియో పాత్రలో కనిపించారు విజయ్. మొత్తంగా నటుడిగా ఒక్కో సినిమాతో ఎంతో క్రేజ్, ఫాలోయింగ్, మార్కెట్ తో దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండ యొక్క లైఫ్ లోని కొన్ని ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం.

1. నటుడిగా కెరీర్ ని చిన్న పాత్రలతో మొదలెట్టినప్పటికీ మొక్కవోని దీక్ష, కార్య దక్షతతో ముందుకు సాగిన విజయ్ దేవరకొండ, ఆ తరువాత పెళ్లి చూపులతో హీరోగా మారి ఫస్ట్ మూవీతోనే విజయం అందుకున్నారు. అయితే ఎప్పటికైనా ఖచ్చితంగా మంచి విజయం అందుకుని నటుడిగా రాణించాలనేది తన ఆలోచన అని, అందుకే ఎప్పుడూ కష్టపడేవాడినిని తరచు చెప్తారు విజయ్ దేవరకొండ. 

యూత్‌ ఐకాన్ వెనుక అసలు కథ


2. ఇక అందరు విద్యార్థుల మాదిరిగా చిన్నప్పుడు బాగానే చదివిన తనకు యువకుడిగా ఉన్నప్పుడు ఎలాగైనా సినిమాల్లో అవకాశాలు సంపాదించాలని ఉండేదని చెప్తారు. అలానే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తాను పెద్ద అభిమానిని అని, అప్పట్లో అతడు, పోకిరి, ఖలేజా సినిమాలు హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో అందరితో కలిసి చూసి ఎంజాయ్ చేసిన ఎక్స్ పీరియన్స్ ఎప్పటికీ మరువలేనని చెప్తారు విజయ్ దేవరకొండ. 


3. ఓవైపు నటుడిగానే కాక మరోవైపు బిజినెస్ ఎంట్రప్రెన్యూయర్ గా కూడా దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండ, రౌడీ పేరుతో బ్రాండ్ ని నెలకొల్పి యువతని ఆకట్టుకునే పలు రకాల ట్రెండీ దుస్తుల స్టోర్ ని ప్రారంభించారు. ముఖ్యంగా రౌడీ వేర్ కి యువతతో పాటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ లో మంచి క్రేజ్ ఉంది. 


4. అయితే నటుడిగా తన సినిమా ప్రస్థానాన్ని ప్రారంభించే ముందు థియేటర్ ఆర్ట్స్ లో అంటే అక్కడక్కడా స్కూల్ లో వేసే నాటకాలంలో తాను పార్టిసిపేట్ చేసేవారు. అక్కడి నుండి సినిమాల పై మంచి మక్కువ ఏర్పడడం, అందుకే సినిమాల్లోకి వచ్చాకా నటనపరంగా మంచి పేరు సొంతం చేసుకోవడం జరిగింది. 


5. ఇక మిగతా నటీనటుల మాదిరిగా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో యాక్టివ్ గా ఉండే విజయ్ దేవరకొండ తరచు సోషల్ రెస్పాన్సిబిలిటీ పరంగా చేసే కార్యక్రమాల్లో పాల్గొని వాటిని తన ఖాతాల్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కరోనా సమయంలో భారీ విరాళం అందించడంతో [పాటు ఎందరో పేదసాదలకు ఆర్ధిక, భోజన సహాయం చేసారు. 


6. ముఖ్యంగా అయన కెరీర్ పరంగా చూసుకుంటే పెళ్లి చూపులు మొదలుకుని మొన్నటి కల్కి లోని అర్జునుడి పాత్ర వరకు చాలా వరకు ఎప్పటికప్పుడు వెరైటీ రోల్స్ లో నటించేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడూ ఒకేవిధమైన బోర్ కొట్టించే సినిమాలు, పాత్రలు చేయడం కంటే ఎప్పటికప్పుడు ప్రేక్షకులకి వైవిద్యంతో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ అందించే సినిమాలు చేయాలనేది తన ఆలోచన అని చెప్తారు విజయ్. 

పర్సనల్ లైఫ్ నుంచి ప్రొఫెషనల్ వరకూ


7. ఓవైపు హీరోగా మంచి క్రేజ్ తో కొనసాగుతున్న విజయ్ దేవరకొండ ఒకానొక సమయంలో హైదరాబాద్ బ్లాక్ వాక్స్ వాలీబాల్ టీమ్ కి కో ఓనర్ గా వ్యవహరించారు. ముఖ్యంగా మొదటి నుండి స్పోర్ట్స్ అంటే మంచి ఇష్టం కలిగిన విజయ్ ఆ టీమ్ కి ప్రాతినిథ్యం వహించడం ఎంతో అందంగా ఉందని తెలిపారు విజయ్ దేవరకొండ. 


8. తొలిసారిగా రష్మిక మందన్నతో కలిసి విజయ్ చేసిన మూవీ గీత గోవిందం బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టింది. అనంతరం ఆమెతో మరొక్కసారి చేసిన మూవీ డియర్ కామ్రేడ్. ఆ మూవీ కూడా బాగానే విజయవంతం అయింది. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అందుకే ఇటీవల కలిసి పలు వెకేషన్స్ కి ట్రావెల్ చేస్తున్నప్పటికీ గోప్యంగా ఉంచుతున్నారు అంటూ పలు మీడియా మాధ్యమాల్లో న్యూస్ వైరల్ అవుతున్నాయి. 


9. అయితే వాటి పై ఇప్పటివరకు అటు విజయ్ దేవరకొండ కానీ అటు రష్మిక మందన్న కానీ స్పందించలేదు. ముఖ్యంగా విజయ్ తో పాటు రష్మిక ఇద్దరూ కూడా మంచి మంచి స్నేహితులు అనేది తెలిసిందే. అటు విజయ్, ఇటు రష్మిక ఇద్దరూ కూడా తమ స్నేహబంధం గురించి మంచిగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి .మరి వారిద్దరి మధ్య స్నేహాన్ని మించే మరేదైనా ఉందా అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి. 


10. ఇక రీల్ పై అద్భుత నటనతో అందరినీ ఆకట్టుకుని ఎందరో ఫ్యాన్స్ మనసులు కొల్లగొట్టడమే కాక రియల్ లైఫ్ లో కూడా నిజమైన హీరో అని నిరూపించుకున్నారు విజయ్ దేవరకొండ. ముఖ్యంగా కరోనా సమయంలో తన తరపున భారీ విరాళం అందించడంతో పాటు ఒక ప్రత్యేక స్వచ్చంద సంస్థని ఏర్పాటు చేసి తద్వారా ఎందరో పేదసాదలకు మంచి మనసుతో సాయం అందించిన గొప్ప దాతృత్వ గుణం ఆయనది. మొత్తంగా నటుడిగా మంచి పేరుతో కొనసాగుతున్న విజయ్ దేవరకొండ మరిన్ని విజయాలతో కొనసాగాలని కోరుకుందాం. 


ఇటువంటి మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ మూవీ అప్ డేట్స్ కోసం అప్పటికప్పుడు మా తెలుగు మూవీ మీడియా సైట్ ని ఫాలో అవుతూ ఉండండి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow