Chandramukhi 2 Heroine Name: Meet Kangana Ranaut in the Lead Role

Find out Chandramukhi 2 heroine Name Kangana Ranaut takes the spotlight in this spooky sequel

Chandramukhi 2 Heroine Name: Meet Kangana Ranaut in the Lead Role

తెలుగు సినిమా (Telugu Cinema) ఆడియన్స్ ముఖ్యంగా మూవీ యొక్క కాన్సెప్ట్ బాగుంటే అందులో నటుడు ఎవరైనా సరే అలానే అది ఏ భాష అయినా సరే చూసి ఎంతో ఎంకరేజ్ చేస్తారు. ఆ విధంగా ఎన్నో ఏళ్ళ నుండి పలు డబ్బింగ్ సినిమాలు సైతం ఇక్కడ విశేషమైన ఆదరణ క్రేజ్ అందుకుని భారీ విజయాలు సొంతం చేసుకున్నవి ఉన్నాయి. 

ఇప్పుడు ఇదంతగా చెప్పడానికి ప్రధాన కారణం, 2005లో పి. వాసు దర్శకత్వంలో కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా తెరకెక్కిన చంద్రముఖి (Chandramukhi) మూవీ మనం అందరికీ గుర్తుండే ఉంటుంది. 

చంద్రముఖి 2 కథానాయిక ఎవరు?

ఆ మూవీ ద్వారా అందాల కథానాయిక నయనతార (Nayanthara) హీరోయిన్ గా పరిచయం అయ్యారు. డబ్బింగ్ మూవీ అయినప్పటికీ కూడా ఆకట్టుకునే హర్రర్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అంశాలతో రూపొందిన ఆ మూవీ అప్పట్లో పెద్ద బాక్సాఫీస్ సెన్సేషన్ అయితే సృష్టించింది. 

సూపర్ స్టార్ రజినికాంత్ యాక్టింగ్ స్టైల్, హర్రర్ అంశాలు, యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్ వంటివి అప్పటి ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి. ఆ విధంగా చంద్రముఖి మూవీ తెలుగు నాట కూడా ప్రభంజనం సృష్టించింది. 

ఇక ఆ మూవీకి సీక్వెల్ గా ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చింది చంద్రముఖి 2 (Chandramukhi 2). ఇందులో నటుడు కమ్ డ్యాన్సర్ అయిన రాఘవ లారెన్స్ హీరోగా నటించగా బాలీవుడ్ అందాల నటి కంగనా రనావత్ హీరోయిన్ గా నటించారు. 

కంగనా రనౌత్ పాత్ర విశేషాలు

మొదటి భాగం చంద్రముఖిలో కీలకమైన చంద్రముఖి పాత్రలో జ్యోతిక (Jyothika) నటించి ఆకట్టుకోగా ఈ మలి భాగంలో కంగనా (Kangana Ranaut) తన నటనతో అలరించారు. ఇక ఈ మూవీని కూడా పి వాసు నే తెరకెక్కించారు. 

ఎంతో భారీ వ్యయంతో హై టెక్నీకల్ వాల్యూస్ తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బాగానే విజయం అందుకుంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ పై సుభాస్కరన్ ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించిన చంద్రముఖి 2 మూవీలో లక్ష్మి మీనన్, మహిమా నంబియార్, రాధికా శరత్ కుమార్, వడివేలు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. 

ఎం ఎం కీరవాణి  (MM Keeravani)సంగీతం అందించిన ఈ మూవీ యొక్క సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు ఆర్ డి రాజశేఖర్ అందించిన విజువల్స్ కూడా అలరించాయి. ఆ విధంగా చంద్రముఖి 2 ద్వారా మరింత మంచి పేరు అందుకున్నారు టీమ్. 

చిత్రంలో ఆమె పాత్రకు ప్రత్యేకతలు

ముఖ్యంగా చంద్రముఖి పాత్రలో నటించిన కంగనా రనావత్ నటనతో పాటు డ్యాన్స్, మరీ ముఖ్యంగా పలు కీలక సన్నివేశాల్లో హృద్యమైన అభినయం ఆమె ఫ్యాన్స్ తో పాటు ఆడియన్సు ని కూడా ఎంతో అలరించింది. కాగా ఆమెకు తెలుగులో సవితా రెడ్డి డబ్బింగ్ చెప్పారు. 

మొత్తంగా బాలీవుడ్ నటి కంగనా ఈ మూవీ పాత్ర ద్వారా మరింత పేరు అందుకున్నారు. ఇటువంటి లేటెస్ట్ మూవీ అప్ డేట్స్ కోసం మా తెలుగు మూవీ మీడియా డాట్ కామ్ సైట్ ని చూస్తూ ఉండండి

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow