Sreeleela Instagram Official Account: New Posts & Highlights
Discover Sreeleela's official Instagram account. Follow for her latest images, reels, and updates.

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఆడియన్స్, ఫ్యాన్స్ లో మంచి క్రేజ్ తో కొనసాగుతున్న యువ నటీమణుల్లో శ్రీలీల కూడా ఒకరు. స్వతహాగా బెంగళూరుకి చెందిన శ్రీలీల పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలుకు చెందిన వారు. అయితే తన విద్యాబ్యాసం పూర్తి చేస్తున్న సమయంలో ఆమెకు తెలుగులో చిత్రాంగద చిత్రంలో తొలిసారిగా వెండితెరపై కనిపించే అవకాశం లభించింది.
ఆ మూవీ అనంతరం కన్నడలో కిస్ మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల, దాని అనంతరం తెలుగులో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా గౌరి రోణంకి తీసిన పెళ్లి సందడి మూవీ ద్వారా పరిచయం అయ్యారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఆ మూవీకి దర్శకత్వ పర్యవేక్షకులుగా వ్యవహరించారు.
శ్రీలీల అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా
అయితే అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈమూవీ రిలీజ్ అనంతరం హిట్ అయింది. ముఖ్యంగా హీరోయిన్ గా తెలుగులో తొలి చిత్రంతో తన ఆకట్టుకునే యాక్టింగ్, గ్లామర్ తో తెలుగు ఆడియన్స్ మనసు దోచారు శ్రీలీల. చిన్నప్పటి నుండి భరతనాట్యంలో మంచి ప్రావిణ్యం కలిగిన శ్రీలీల పెళ్ళిసందడి మూవీలో డ్యాన్స్ తో కూడా అలరించారు.
ఆ మూవీ తరువాత శ్రీలీల కు టాలీవుడ్ స్టార్ యాక్టర్ మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన తీసిన ధమాకా మూవీలో ఆమె హీరోయిన్ గా అవకాశం అందుకున్నారు. అనూహ్యంగా రిలీజ్ అనంతరం ఈ మూవీ కూడా బాగా విజయవంతం అవడంతో అక్కడి నుండి శ్రీలీలకు టాలీవుడ్ లో మరింత అవకాశాలు పెరిగాయి.
ఆ తరువాత రామ్ తో స్కంద, బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తీసిన భగవంత్ కేసరిలో ఒక ప్రధాన పాత్రలో నటించి ఆకట్టుకున్నారు శ్రీలీల. తరువాత మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ తో ఆదికేశవ, నితిన్ తో ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటించారు.
శ్రీలీల ఇన్స్టాగ్రామ్ తాజా పోస్ట్‌లు మరియు హైలైట్స్
ఆపైన టాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటెర్టైనర్ మూవీ గుంటూరు కారంలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకున్నారు శ్రీలీల. అయితే ముందుగా ఆ పాత్ర కోసం హీరోయిన్ పూజా హెగ్డే ని తీసుకున్నారు, కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారు. కాగా అనంతరం ఆమెకు డేట్స్ సమస్య కారణంగా గుంటూరు కారం మూవీలో పూజా హెగ్డే స్థానంలో అవకాశం శ్రీలీలని వరించింది.
ఇక మంచి అంచనాలతో రిలీజ్ అయిన గుంటూరు కారం మూవీ బాక్సాఫీస్ వద్ద విజయవంతం అయింది. ఇక ఇటీవల పాన్ ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తీసిన పుష్ప 2 మూవీలో ఒక స్పెషల్ లో నటించి ఆకట్టుకున్నారు శ్రీలీల.
కిసిక్ అనే పల్లవితో సాగె ఆ సాంగ్ యువత తో పాటు మాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుని ఎంతో బాగా రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మరోవైపు ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు శ్రీలీల. హిందీలో కార్తీక్ ఆర్యన్ హీరోగా రూపొందుతున్న ఆషికి 3 మూవీలో ఆమె హీరోయిన్ గాన్ నటిస్తున్నారు.
శ్రీలీలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యే విధానం
అలానే కోలీవుడ్ లో శివ కార్తికేయన్ హీరోగా సుధా కొంగర తీస్తున్న పరాశక్తి తీస్తున్న పరాశక్తి మూవీలో కూడా హీరోయిన్ గా చేస్తున్నారు శ్రీలీల. ఇక మరికొన్ని ప్రాజక్ట్స్ డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. ఇక మొదటి నుండి అటు సోషల్ మీడియా మాధ్యమాల్లో అకౌంట్స్ కలిగి ఉన్న శ్రీలీల ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ వంటి వాటిలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.
తన సినిమాలు, వ్యక్తిగత విషయాలకు సంబంధించి పలు అంశాలు ఇన్స్టా ద్వారా ఫ్యాన్స్, ఆడియన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు శ్రీలీల. ఇక లేటెస్ట్ ట్రెండీ అవుట్ ఫైట్స్ తో ట్రెండ్ ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు దిగిన తన లేటెస్ట్ ఫోటో షూట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు శ్రీలీల. ప్రస్తుతం ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో 12 మిలియన్స్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. యువత తో పాటు అన్ని వర్గాల ఆడియన్ లో శ్రీలీల కు మంచి క్రేజ్ ఉంది. మరి నటిగా శ్రీలీల మరింతగా సక్సెస్ లతో దూసుకెళ్లాలని, కెరీర్ పరంగా ఆమెకు మరిన్ని విజయాలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
What's Your Reaction?






